STOCKS

News


ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ను అమ్మేస్తున్నారా..? ఒక్క నిమిషం!

Thursday 17th January 2019
personal-finance_main1547748707.png-23644

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, ప్రభుత్వం ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కనుక ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడులపైనే పన్ను మినహాయింపు కానీ, అవిచ్చే రాబడులపై మాత్రం కాదన్న విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. కనుక ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ను విక్రయించే సమయంలో పన్ను అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. 

 

ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లో లాకిన్‌ పీరియడ్‌ మూడేళ్లు. ప్రతీ పెట్టుబడి కూడా మూడేళ్లు నిండిన తర్వాతే వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతో మూడేళ్లు పూర్తయిన వెంటనే పెట్టుబడులను ఉపసంహరించుకుని, తిరిగి మళ్లీ ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి సెక్షన్‌ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపు పొందే వారు కూడా ఉన్నారు. కానీ నిపుణులు మాత్రం ఇది సమంజసం కాదంటున్నారు. మూడేళ్లు నిండిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తం స్వల్పంగానే ఉంటుంది. దానిపై దీర్ఘకాల మూలధన లాభం కూడా తక్కువే ఉండొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలిక మూలధన లాభం (ఎల్‌టీసీజీ) ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో రూ.లక్ష మించితేనే దానిపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.లక్ష వరకు పన్ను లేదు. కనుక ఆలోపు ఉంటే వెనక్కి తీసుకుని, తిరిగి ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఎల్‌టీసీజీ పన్ను ఆదాతోపాటు, పెట్టుబడిపై సెక్షన్‌ 80సీ ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు. 

 

ఇలా కాకుండా ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఉన్న పెట్టుబడులనే లాకిన్‌ తీరిన తర్వాత తిప్పేస్తూ ఉండడం సరికాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు మూడేళ్ల క్రితం రూ.1.50లక్షలను ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వాటిని ఉపసంహరించుకుని, తిరిగి మరలా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల... పాత పెట్టుబడే కొనసాగుతుంది. ఇది దీర్ఘకాలంలో సంపద సృష్టికి, లక్ష్యాల సాకారానికి దారితీయదని సూచిస్తున్నారు. పన్ను ఆదా కోసం ఉపసంహరించుకుంటే తిరిగి ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయడంతోపాటు, అంతకుముందు ప్రకారమే ప్రణాళిక మేరకు తాజా పెట్టుబడి కూడా ఫండ్స్‌లో కొనసాగించాలని సూచిస్తున్నారు. అలా కాకుండా పాత పెట్టుబడినే కాల వ్యవధి తీరిన తర్వాత తిరగేస్తుంటే, పన్ను ఆదా తప్పించి వచ్చే ప్రయోజనమేదీ ఉండదని పేర్కొంటున్నారు. ‘‘సంపద సృష్టికి కొత్త పెట్టుబడిని జత చేయాలి. ఈక్విటీ పథకాల నుంచి ఏటా డబ్బులను వెనక్కి తీసుకోవడం మంచి నిర్ణయం కాదు’’ అని ఫిన్‌షెప్రా ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌కు చెందిన బాబు కృష్ణమూర్తి తెలిపారు. అయిత, రిటైర్‌ అయి, పన్ను ఆదా కోసం ఇన్వెస్ట్‌ చేసేంత మిగులు లేని వారు అప్పటికే లాకిన్‌ పీరియడ్‌ తీరిన ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ పెట్టుబడులను వెనక్కి తీసుకుని, రీఇన్వెస్ట్‌ చేయడంలో తప్పు లేదని ఎక్స్‌లెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ వ్యవస్థాపకుడు పునీత్‌ ఓబెరాయ్‌ సూచించారు.You may be interested

ఆర్‌డీ చేస్తున్నారా...? మరోసారి ఆలోచించండి!

Thursday 17th January 2019

దీర్ఘకాలంలో మంచి పొదుపు సాధనం గురించి అడిగితే తల్లిదండ్రులు రికరింగ్‌ డిపాజిట్‌(ఆర్‌డీ) గురించి చెబుతారు. ఆర్‌డీ పోస్టాఫీసుతోపాటు బ్యాంకుల్లోనూ ప్రారంభించి ప్రతీ నెలా ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లొచ్చు. వడ్డీ రేటు ఎప్పటికప్పుడు మారుతుంటుంది. బ్యాంకును బట్టి ఇది కొంచెం వేర్వేరుగానూ ఉండొచ్చు. ప్రస్తుతం ఓ ప్రముఖ బ్యాంకులో ఆర్‌డీపై వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. మరి ఇది నిజంగా మంచి రాబడినిచ్చే సాధనమేనా? అని ప్రశ్నించుకోండి. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌

డెరివేటివ్స్‌ మార్జిన్లు పెంచిన ఎన్‌ఎస్‌ఈ

Thursday 17th January 2019

బడ్జెట్‌ సెషన్‌ సమయంలో తీవ్ర ఒడిదుడుకులను తట్టుకునేందుకు ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో మార్జిన్లను పెంచుతున్నట్లు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. పార్లమెంట్‌లో బడ్జెట్‌ సెషన్‌ జరిగే వేళ డెరివేటివ్స్‌లో తీవ్ర కదలికలుంటాయని, వీటిని కట్టడి చేసేందుకు మార్జిన్లను దాదాపు 40 శాతం మేర పెంచుతున్నామని ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. వచ్చే సోమవారం(జనవరి 21)నుంచి కొత్త మార్జిన్లు అమల్లోకి వస్తాయి. నిజానికి ప్రస్తుతం దేశీయ వీఐఎక్స్‌ స్వల్పకాలిక సరాసరి 16 వద్దే ఉంది. అంటే మార్కెట్లో పెద్దగా

Most from this category