STOCKS

News


ఈ ఏడాది బెస్ట్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ ఇవే..

Saturday 14th July 2018
personal-finance_main1531545519.png-18312

మొత్తం షేర్ల ప్రస్తుత ధర ఆధారంగా కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ నిర్ణయమౌతుంది. ఈక్విటీ పోర్ట్‌ఫోలియో కోసం చూసేటప్పుడు కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ కూడా చూడాలి. స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌.. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా 251 ర్యాంక్‌ నుంచి మొదలయ్యే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇలాంటి ఫండ్స్‌ తన మొత్తం అసెట్స్‌లో 65 శాతం వరకు స్మాల్‌క్యాప్‌ కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో పెట్టుబడిగా పెడతాయి. ఎవరైతే ఎక్కువ రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడతారో వారికి ఈ స్మాల్‌క్యాప్స్‌ అనువుగా ఉంటాయి. చరిత్రను పరిశీలిస్తే రాబడుల పరంగా చూస్తే స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌కు మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. అలాగే వృద్ధికి అవకాశం ఉంటుంది. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌ కోసం వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు.  
స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ముందు కొన్ని అంశాలను చూడాలి. అవి ఏమిటంటే.. 

♦ గత పనితీరు
♦ ప్రాఫిట్‌/ఎక్స్‌పెన్స్‌ రేషియో
♦ ఫండ్‌ మేనేజర్‌ అనుభవం
♦ ఫండ్‌ రేటింగ్‌
♦ ఫండ్‌ ఆబ్జెక్టివ్‌
♦ స్టాక్‌ ఎక్స్‌పోజర్‌
♦ ఫండ్‌ హోల్డింగ్‌ డైవర్సిఫికేషన్‌ 
 
బెస్ట్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ చూస్తే.. 
1.ఎల్‌ అండ్‌ టీ ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఫండ్‌: ఇది ప్రారంభం నుంచి 28.1 శాతం రిటర్న్స్‌ అందించింది.
2.రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌: ఈ ఫండ్‌ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా 30.51 శాతం రాబడిని అందించింది. 
3.సుందరం స్మాల్‌క్యాప్‌ ఫండ్‌: ఇది ప్రారంభం నుంచి 22.17 శాతం రాబడిని ఇచ్చింది.
4.ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌: ఇది ప్రారంభం నుంచి 32.72 శాత రిటర్న్స్‌ అందించింది. 
  
గమనిక: ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ముందుగా భరించగలిగే రిస్క్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం వంటి అంశాలను చూసుకోవాలి. ఫండ్‌ మేనేజర్‌ సలహాలు తీసుకోవడం ఉత్తమం.  



You may be interested

ఐటీఆర్‌ ఇ-ఫైలింగ్‌.. ఈ విషయాలు తెలుసా?

Saturday 14th July 2018

ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో గత ఏడాది కాలంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులు వేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా ఉండాలంటే ఈ మార్పుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఐటీఆర్‌ ఆసల్యంగా వేస్తే అదనపు భారం తప్పదు. ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోని ఆరు ముఖ్యమైన మార్పులను గమనిస్తే..  ♦ ఇ-ఫైలింగ్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అయ్యేటప్పుడు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సిన అవసరం

డిసెంబరు నాటికి 11,500 పాయింట్లకు నిఫ్టీ..!

Saturday 14th July 2018

ముంబై: నిఫ్టీ 10,900 స్థాయి ఎగువన కొనసాగుతున్నంతకాలం.. 11,171 పాయింట్లను అధిగమించే అవకాశం ఉందనే ఆశావాద ధోరణిలో ఉండవచ్చని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహమద్‌ అన్నారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి కీలక స్థాయిని అధిగమించడమే కాకుండా 11,500 పాయింట్లకు చేరుతుందని టార్గెట్‌ ఇచ్చారు. ప్రస్తుత స్థాయి నుంచి జీవితకాల గరిష్టస్థాయికి చేరుకోవడానికి కేవలం 2 శాతం

Most from this category