STOCKS

News


తొలి పెట్టుబడికి బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ మంచిది.

Monday 4th March 2019
personal-finance_main1551679185.png-24417

  • ధీరేంద్ర కుమార్‌
  • (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌)

ప్ర: నేను రిలయన్స్‌ గిల్ట్‌ అనే లిక్విడ్‌ ఫండ్‌లో రూ.3 లక్షలు ఇన్వెస్ట్‌ చేశాను. సాధారణంగా లిక్విడ్‌ ఫండ్స్‌ల్లో ఒడిదుడుకులు తక్కువగా ఉంటాయి. కానీ ఈ ఫండ్‌ కూడా ఒడిదుడుకులమయంగా సాగుతోంది. ఇక ఇప్పుడు  నెలకు రూ.10,000 చొప్పున ప్రతి నెలా ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్‌లో పదిహేను సంవత్సరాల పాటు  ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. మంచి ఫండ్స్‌ను సూచించండి. 
-క్రిష్టోఫర్‌, సికింద్రాబాద్‌ 


జ: మీరు ఇన్వెస్ట్‌ చేసిన గిల్ట్‌  సెక్యూరిటీస్‌ ఫండ్‌... లిక్విడ్‌  ఫండ్‌ కాదు. స్వభావంలో లిక్విడ్‌గా ఉన్నప్పటికీ, ఇది లిక్విడ్‌ ఫండ్‌ కాదు. లిక్విడ్‌ ఫండ్స్‌ 91 రోజుల మెచ్యూరిటీని మించిన సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయవు. అంటే 91 రోజుల్లోపే మెచ్యూరయ్యే సాధనాల్లోనే లిక్విడ్‌ ఫండ్స్‌  ఇన్వెస్ట్‌ చేస్తాయి. లిక్విడ్‌ ఫండ్స్‌ విలువ చాలా అరుదైన సందర్భాల్లోనే మాత్రం తగ్గుతుంది. ఇక గిల్ట్‌ ఫండ్స్‌ ప్రభుత్వ సెక్యూరిటీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తాయి. ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెడితే.. ఆ సొమ్ములకు పూర్తి భద్రత ఉన్నట్లు కాదు. చెల్లింపుల విషయంలో ఎలాంటి డిఫాల్ట్‌లు ఉండవు. అయితే దీర్ఘకాల మెచ్యురిటీ బాండ్స్‌పై వడ్డీరేట్ల రిస్క్‌ ప్రభావం ఉంటుంది. వడ్డీరేట్లలో మార్పులు.. ఈ బాండ్ల పనితీరును ప్రభావితం చేస్తాయి.  వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ల రాబడులు తగ్గుతాయి. మీరు ఇన్వెస్ట్‌ చేసింది లిక్విడ్‌ ఫండ్‌ కాదు, గిల్ట్‌ ఫండ్‌ అని గుర్తించండి. గిల్డ్‌ ఫండ్స్‌కు ఒడిదుడుకులు తప్పవని గ్రహించండి. ఇక ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్స్‌ విషయానికొస్తే,  మంచి ఫండ్స్‌ చాలానే అందుబాటులో ఉన్నాయి. యాక్సిస్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ ఫండ్, మిరే అసెట్‌ ట్యాక్స్‌ సేవర్‌లను పరిశీలించవచ్చు. 

ప్ర: నేను గత ఏడాదిన్నర నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. మరికొన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. కొన్ని ఫండ్స్‌తో ఒక జాబితా తయారు చేశాను. ఇవన్నీ మల్టీక్యాప్‌ ఫండ్స్‌. ఎస్‌బీఐ, మిరా అసెట్‌ ఇండియా, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ట్యాక్స్‌ రిలీఫ్, ఐసీఐసీఐ బ్యాలన్స్‌డ్‌ అడ్వాండేజ్‌ ఫండ్‌లు... నేను షార్ట్‌లిస్ట్‌ చేసిన వాటిల్లో ఉన్నాయి. నేను కనీసం 15–20 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. వీటిల్లో ఏ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయమంటారు ?
-మహ్మద్‌ సల్మాన్‌, హైదరాబాద్‌ 
జ: మీరు 15–20 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఐసీఐసీఐ బ్యాలన్స్‌డ్‌ అడ్వాండేజ్‌ మినహా మిగిలిన వాటిని పెట్టుబడులకు పరిగణనలోకి తీసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాలన్స్‌డ్‌ అడ్వాండేజ్‌ ఫండ్‌ మంచి మ్యూచువల్‌ ఫండే.. .కానీ తొలిసారి మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ వారికి ఈ ఫండ్‌ మరింత అనువైనది. ఇది ఈక్విటీ, డెట్‌ రెండు సాధనాల్లోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంది. మీరు ఏడాదికి పైగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. కాబట్టి మార్కెట్‌ ఒడిదుడుకుల ప్రభావం మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఇతర ఫండ్స్‌ల్లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. మీ పోర్ట్‌ఫోలియోను కనీసం ఆరు నెలలకొకసారైనా మదింపు చేయండి. మార్కెట్‌  ఒడిదుడుకులను మీరు భరించలేని పక్షంలో మల్టీక్యాప్‌ ఫండ్స్‌ల్లో కాకుండా బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయండి. 

 

ప్ర: రెండు నెలల క్రితం నుంచి మూడు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించాను. పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనే ఉద్దేశంతో ఈ మూడు ఫం‍డ్స్‌-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, కోటక్‌ స్డాండర్డ్‌ మల్టీక్యాప్‌, ఐసీఐసీఐ బ్లూచిప్‌లను ఎంచుకున్నాను. ఇవి మంచి పండ్సేనా ? నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి నాకు ఎన్‌పీఎస్‌ టైర్‌ వన్‌ తప్పనిసరి. ఇక మ్యూచువల్‌ ఫండ్స్‌, ఎన్‌పీఎస్‌ టైర్‌ టూల్లో ఏది మంచి ఆప్షన్‌ ?
-కిరణ్‌, విశాఖపట్టణం 
జ: మీరు రెండు నెలల క్రితం అంటే మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రారంభించకముందు సలహా అడిగి ఉంటే.. మీ మొదటి మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌తో మాత్రమే ఆరంభించమని సలహా ఇచ్చేవాణ్ణి.  మీరు ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకున్నారంటే, దానర్థం మీరు మీ నిధులను లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమని సదరు ఫండ్‌ మేనేజర్‌కు సూచిస్తున్నారని భావం. మొదటిసారిగా మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో  ఇన్వెస్ట్‌ చేసేవారికి ఇది సరైన పెట్టుబడి వ్యూహం కాదు. మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తుంటే, ఫండ్‌ మేనేజర్‌కు పూర్తి స్వేచ్ఛ ఉండాల్సిందే. ఇది మల్టీక్యాప్‌ ఫండ్స్‌ల్లోనే సాధ్యం. కోటక్‌ స్డాండర్డ్‌ మల్టీక్యాప్‌ అలాంటిదే. ఇటీవలి కాలంలో చాలా లార్జ్‌క్యాప్ ఫండ్స్‌, నిఫ్టీ, సెన్సెక్స్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌ను మించిని రాబడులను ఇవ్వలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు రెండు. మొదటిది. సెన్సెక్స్‌, గానీ, నిఫ్టీ గానీ రెండు-మూడు షేర్ల కారణంగానే గత ఏడాది కాలంలో జోరుగా ఎగిశాయి. రెండోది లార్జ్‌క్యాప్‌ షేర్ల ఎక్స్‌పెన్స్‌ రేషియో అధికంగా ఉంటోంది. ఇక మీ రెండో ప్రశ్న విషయానికొస్తే, ఎన్‌పీఎస్‌ టైర్‌ టూ మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనమే. అయితే ఎన్‌పీఎస్‌ ద్వారా మీరు గరిష్టంగా ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేయగలిగేది 75 శాతం వరకూ మాత్రమే. దీనికి సంబంధించిన డెట్‌ విభాగం ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఇండేక్సేషన్‌ ప్రయోజనం లభిస్తుందా లేదా అనే విషయమై ఇప్పటిదాకా స్పష్టత లేదు. అయితే ఎన్‌పీఎస్‌లో వ్యయాలు తక్కువగా ఉండటం ఒక సానుకూలాంశం.You may be interested

ఫండ్స్‌ వయా వ్యాలెట్స్‌

Monday 4th March 2019

పేటీఎం మనీ, మొబిక్‌విక్‌, ఈటీమనీ, జెరోదా కాయిన్‌ ఇలా అందుబాటులోకి ఎన్నో యాప్స్‌ పెట్టుబడి, ఉపసంహరణ ఎంతో సులభం ఇన్వెస్టర్లు జాగ్రత్తగా మసలుకోవాలన్నది నిపుణుల సూచన ఆర్థిక సలహాదారుల సూచనతో చేస్తే లాభమే లేదంటే నష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చని హెచ్చరిక మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఒకప్పుడు కొన్ని రోజులు పట్టే కార్యక్రమం. కానీ, ఇప్పుడు క్షణాల్లోనే ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు డిజిటల్‌ సాధనాలు ఉన్నాయి. అందులోనూ అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌ నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలు కల్పించే

నిఫ్టీ తక్షణ అవరోధం 10940

Monday 4th March 2019

వడ్డీ రేట్ల పెంపునకు అమెరికా ఫెడ్‌ బ్రేకులు వేయడం, అమెరికా-చైనాల వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల అధ్యక్షులూ త్వరలో సంతకాలు చేయవచ్చన్న వార్తలతో గతవారం పలు ప్రపంచ ప్రధాన మార్కెట్లు నెలల గరిష్టస్థాయిలో ముగిసినప్పటికీ, హఠాత్తుగా ఇండో-పాక్‌ల మధ్య తలెత్తిన ఘర్షణ ఫలితంగా భారత్‌ సూచీలు పరిమితశ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల వేగాన్ని పెంచడంతో ఇక్కడి భౌగోళిక ఉద్రిక్తతలు మార్కెట్‌పై పెద్దగా ప్రతికూల ప్రభావాన్ని చూపించలేదని భావించవచ్చు.

Most from this category