STOCKS

News


సెక్టోరల్‌ ఫండ్స్‌ వద్దు.. మల్టీక్యాప్‌ ఫండ్స్‌ ముద్దు..

Monday 15th October 2018
personal-finance_main1539591708.png-21166

సెక్టోరల్‌ ఫండ్స్‌కు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు మ్యూచువల్‌ ఫండ్‌ నిపుణులు, వ్యాల్యు రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌. రూపాయి పతనం నేపథ్యంలో ఎగుమతి ఆధారిత వ్యాపారాలపై ఎక్కువగా ఆధారపడ్డ ఐటీ, ఫార్మా రంగ స్టాక్స్‌కు డిమాండ్‌ ఏర్పడింది. చాలా మంది అడ్వైజర్లు కూడా వారి ఇన్వెస్టర్లకు ఈ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని సలహా ఇస్తున్నారు. అయితే ధీరేంద్ర కుమార్‌ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ఇన్వెస్టర్లు కేవలం ఐటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయవద్దని తెలిపారు. ఐటీ కంపెనీల మార్జిన్లు చూడటానికి ఆకర్షణీయంగా లేవని పేర్కొన్నారు. ఐటీ రంగం ఇప్పటికీ పలు సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. 
రూపాయి ప్రస్తుత ఏడాది దాదాపుగా 16 శాతంమేర పతనమైంది. మరోవైపు బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్‌ అక్టోబర్‌ 12 నాటికి 27 శాతం వృద్ధితో 14,299 పాయింట్లకు ఎగసింది. జనవరి 1న ఐటీ ఇండెక్స్‌ 11,216 పాయింట్ల వద్ద ఉంది. 
రూపాయి క్షీణత ఐటీ రంగానికి ఏవిధంగా కూడా ఉపయోగపడదని ధీరేంద్ర కుమార్‌ తెలిపారు. చాలా కంపెనీలు కరెన్సీ పొజిషన్లను హెడ్జ్‌ చేసి ఉన్నాయని పేర్కొన్నారు. ఐటీ కంపెనీల స్టాక్స్‌ ఇటీవలి పెరుగుదల వాటి ఎర్నింగ్స్‌కు భిన్నంగా ఉందని తెలిపారు. ఇన్వెస్టర్లు వారి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికలకు కట్టుబడి ఉండాలని సూచించారు. మల్టీక్యాప్‌ ఫండ్‌ విభాగంలో చాలా అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఐసీఐసీఐ ప్రడెన్షియల్‌ వ్యాల్యు డిస్కవరీ ఫండ్‌, పీపీఎఫ్‌ఏఎస్‌ లాండ్‌ టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌, క్వాంటమ్‌ లాంగ్‌ టర్మ్‌ గ్రోత్‌ ఫండ్‌ వంటి వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని సూచించారు. 



You may be interested

యూనిట్‌ విక్రయంతో రెడ్డీస్‌ షేరు 4% అప్‌

Monday 15th October 2018

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేరు సోమవారం దాదాపు 4 శాతంమేర పెరిగింది. కంపెనీ తనకు హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఉన్న ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌) మ్యానుఫ్యాక్చరింగ్‌ బిజినెస్‌ యూనిట్‌ను విక్రయించడం ఇందుకు ప్రధాన కారణం. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఈ ఏపీఐ యూనిట్‌ను మొత్తంగా జనరిక్స్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ థెరాపివాకు విక్రయించింది. ఈ వార్త నేపథ్యంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేరు ధర 4 శాతంమేర ర్యాలీ చేసింది. కాగా

అంతర్జాతీయ అస్థిరత కొనసాగుతుంది!

Monday 15th October 2018

ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టిన్‌ లగార్డ్‌ వాణిజ్య యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కొనసాగుతుందని, దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ నాయకులు సిద్ధంగా ఉండాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్‌ క్రిస్టిన్‌ లగార్డ్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడకులు, కేంద్రబ్యాంకుల నుంచి రేట్ల పెంపుదలలు కొనసాగుతాయని ఆమె అంచనా వేశారు. రాబోయే రిస్కులను తట్టుకునేలా తగిన మానిటరీ, ఫిస్కల్‌ ప్రణాళికలను రూపొందించుకొని ఉండాలని కేంద్ర బ్యాంకులకు ఆమె సూచించారు. సంస్కరణలు క్రమంగా మందగిస్తున్నాయని,

Most from this category