News


మీ ఫండ్స్‌ సెన్సెక్స్‌తో పాటు ర్యాలీ చేయలేదా?

Saturday 8th September 2018
Markets_main1536402880.png-20095

ఈ ఏడాదిలో సెన్సెక్స్‌ సూచీ 10 శాతం ర్యాలీ చేసింది. 38,989 పాయింట్ల వద్ద తన జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. సెన్సెక్స్‌ భారీ స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మాత్రం ఈస్థాయి ర్యాలీని అందుకోలేకపోయాయి. అందుకు గల కారణాన్ని కోటక్‌ ఇంటర్నేషనల్‌ ఈక్విటీస్‌ వివరిస్తూ ‘‘సెన్సెక్స్‌ ర్యాలీకీ ప్రధాన కారణమైన కొన్ని హెవీవెయిట్‌ షేర్లను మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు, విదేశీ ఇన్వెస్టర్లు తక్కువ హోల్డ్‌ చేయడంతో మ్యూచువల్‌ ఫండ్స్‌ సెన్సెక్స్‌తో పాటు ర్యాలీని అదుకోలేకపోయాయి’’ అని తెలిపింది.  
సూచీల ర్యాలీలో సమతుల్యత లేదు:-
ఏడాదికాలంలో సూచీల చేస్తున్న ర్యాలీలో సమతుల్యత కొరవడినట్లు కోటక్‌ ఈక్విటీస్‌ అభిప్రాయపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లకు గానూ 7 షేర్లు, నిఫ్టీ-50 సూచీలోని 17 షేర్లు మాత్రమే ర్యాలీ చేయడం ఇందుకు కారణం‍గా చెబుతోంది. హెవీ వెయిట్‌ షేర్లైన ఐటీ, ఎఫ్‌ఎంజీసీ, అయిల్‌ రంగ షేర్లు మాత్రమే సూచీల ర్యాలీని నడిపించినట్లు కోటక్‌ తెలిపింది. 



You may be interested

కరెక‌్షన్‌ వైపు అడుగులు!?

Saturday 8th September 2018

మార్కెట్‌ అంతిమంగా కరెక‌్షన్‌ వైపు అడుగులు వేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. దేశీ, అంతర్జాతీయ పరిస్థితులు ఇందుకు కారణమని తెలిపారు. డాలర్‌ బలపడటం, కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరుగుదల, ద్రవ్యల్బోణ అంచనాలు, గ్లోబల్‌గా వడ్డీ రేట్ల పెంపు ధోరణి, భౌగోళిక రాజకీయ పరిస్థితులు క్షీణించడం వంటి అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.   స్టాక్స్‌ కొత్త గరిష్ట స్థాయిలకు చేరుకున్న తర్వాత పతనం బాటలో పయనిస్తున్నాయని గుర్తు చేశారు. అలాగే

ఈ వారం పిక్‌: ఇంజినీర్స్‌ ఇండియా

Saturday 8th September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఈ వారం స్టాక్‌ పిక్‌గా ఇంజినీర్స్‌ ఇండియాను సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఇంజినీర్స్‌ ఇండియా (ఈఐఎల్‌) ఇండస్ట్రీ: ఇంజినీరింగ్‌ ప్రస్తుత ధర: రూ.126 టార్గెట్‌ ప్రైస్‌: రూ.144-165 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ప్రభుత్వ రంగానికి చెందిన ఇంజినీర్స్‌ ఇండియాపై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 4-6 త్రైమాసికాల్లో స్టాక్‌ ధర రూ.144-165 శ్రేణికి చేరొచ్చని టార్గెట్‌ను

Most from this category