STOCKS

News


ఫండ్స్‌లో రెండంకెల వృద్ధి కొనసాగుతుంది: యాంఫి

Saturday 25th August 2018
personal-finance_main1535171497.png-19622

కోల్‌కతా: మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ వృద్ధి కొనసాగుతుందని మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫ) పేర్కొంది. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ వృద్ధికి ఢోకా ఉండదని అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ 17 శాతం వృద్ధి చెందగా, రిటైల్‌ పరిశ్రమ 34 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.23 లక్షల కోట్లకు చేరింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ వృద్ధి జోరు ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని యాంఫి సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ కోల్‌కతాలో ‘ఎంసీసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఫోరమ్‌ 2018’ కార్యక్రమంలో తెలిపారు. ఆర్థిక విధానాలు వృద్ధికి దోహదపడతాయన్నారు. ప్రస్తుతం ఒక లక్షగా ఉన్న పంపిణీదారుల సంఖ్యను 2025 నాటికి ఐదు లక్షలకు పెంచాలన్న లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. 



You may be interested

పీఎస్‌బీలకు నిర్వహణ స్వేచ్ఛ ఉండాలి

Saturday 25th August 2018

న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకుల స్థాయిలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకూ (పీఎస్‌బీ) నిర్వహణాపరమైన స్వేచ్ఛ ఉండాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జి. పద్మనాభన్ చెప్పారు. అప్పుడే మొండిబాకీలు సహా పలు సమస్యలను పీఎస్‌బీలు వాటంతట అవే పరిష్కరించుకోగలవని ఆయన తెలిపారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ పాలసీ రీసెర్చ్ (సీఈపీఆర్‌) నిర్వహించిన బ్యాంకింగ్ సదస్సులో శుక్రవారం పాల్గొన్న సందర్భంగా పద్మనాభన్ ఈ విషయాలు చెప్పారు. ప్రభుత్వ రంగ

త్వరలో 8 మొండిపద్దుల పరిష్కారం

Saturday 25th August 2018

న్యూఢిల్లీ: మొండిబాకీల రికవరీకి సంబంధించి విద్యుత్ రంగానికి చెందిన 7-8 పద్దులు త్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ అరిజిత్ బసు వెల్లడించారు. వీటిపై రుణదాతలంతా దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చారని ఆయన పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ. 17,000 కోట్లు ఉంటుందని శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బసు చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ రంగంలో

Most from this category