STOCKS

News


ఇన్వెస్టర్ల సంగతేమో... ఫండ్స్‌కు అయితే లాభాలే!

Saturday 27th October 2018
personal-finance_main1540579339.png-21505

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో (టీఈఆర్‌)ను సెబీ ఇటీవల తగ్గించింది. ఇది ఆయా సంస్థల భవిష్యత్తు ఆదాయాలపై ప్రతిఫలించనుంది. అయితే, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలకు (ఏఎంసీలు) లాభాలు, ఆస్తుల విలువ వృద్ధి పరంగా గడిచిన ఆర్థిక సంవత్సరం (2017-18) గుర్తుండిపోతుంది. ఏఎంసీలు అన్నింటికీ కలిపి వచ్చిన ఆదాయం రూ.14,000 కోట్లు. 

 

ఎస్సెల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఇన్వెస్కో మ్యూచువల్‌ ఫండ్‌, మిరే అస్సెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలను మినహాయించి మిగిలిన 35 ఏఎంసీల గణాంకాలను పరిశీలించినట్టయితే... వీటి ఉమ్మడి ఆస్తులు (ఏయూఎం) రూ.16.4 లక్షల కోట్ల నుంచి రూ.20 లక్షల కోట్లకు 2017-18లో పెరిగాయి. ఈ 35 ఏఎంసీల ఆదాయం రూ.13,944 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.10,700 కోట్లే. ఆదాయం 30 శాతం వృద్ధి చెందింది. ఇది ఆరేళ్లలోనే గరిష్ట వృద్ధి. వీటి ఉమ్మడి నికర లాభం కూడా అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 38 శాతం పెరిగి రూ.3,584 కోట్లుగా ఉంది. అంటే 35 ఏఎంసీలు కలిసి ఈ స్థాయిలో లాభాలను ఇన్వెస్టర్ల పెట్టుబడుల నిర్వహణ ద్వారా గడించాయని తెలుస్తోంది. అయితే, విడిగా 35 సంస్థలు లాభాల్లో ఉన్నట్టు కాదు. 9 ఏఎంసీలు గత ఆర్థిక సంవత్సరంలో నష్టాల్లోనే ఉన్నాయి.

 

ఆదాయం, లాభాలు
ఆదాయం, లాభాల ఆర్జనలో అగ్ర స్థానంలో ఉన్న సంస్థలను చూస్తే... 
ఆదాయం: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.1897 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ 1867 కోట్లు, రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.1746 కోట్లు, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ 1272 కోట్లు, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ 1261 కోట్లు, యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ 1058 కోట్లు, యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ 753 కోట్లు, డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ 752 కోట్లు, మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ 668 కోట్లు, కోటక్‌ మహింద్రా మ్యూచువల్‌ ఫండ్‌ రూ.519 కోట్లు ఆదాయం సొంతం చేసుకున్నాయి.
నికర లాభం: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.626 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.722 కోట్లు, రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.505 కోట్లు, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.331 కోట్లు, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.322 కోట్లు, యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ 376 కోట్లు, డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ 201 కోట్లు, మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ 131 కోట్లు, కోటక్‌ మహింద్రా మ్యూచువల్‌ ఫండ్‌ రూ.81 కోట్లు, జేఎం ఫైనాన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.57 కోట్ల మేర లాభాన్ని నమోదు చేశాయి. ఆదాయం విషయంలో టాప్‌ టెన్‌లో ఉన్న యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, లాభం విషయంలో టాప్‌-10లో లేదు. 



You may be interested

మొబైల్‌ కనెక్షన్లకు ఆధార్‌ ఈ–కేవైసీ వాడొద్దు

Saturday 27th October 2018

న్యూఢిల్లీ: పాత, కొత్త మొబైల్‌ కనెక్షన్లకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ విధానంలో యూజర్ల గుర్తింపు, చిరునామాల ధృవీకరణ కోసం (ఈ–కేవైసీ) ఆధార్‌ను ఉపయోగించరాదంటూ టెలికం సంస్థలను కేంద్రం ఆదేశించింది. వినియోగదారు స్వచ్ఛందంగా ఇచ్చిన పక్షంలో కేవైసీ కోసం పేపరు రూపంలోని ఆధార్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించింది. ఈ నిబంధనల అమలుపై నవంబర్‌ 5లోగా నివేదిక ఇవ్వాలని టెలికం శాఖ శుక్రవారం ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రైవేట్‌ సంస్థలు ఆధార్‌ను వినియోగించడంపై ఆంక్షలు

ఐఐఎఫ్‌ఎల్‌ దివాళీ స్టాక్‌ రెకమండేషన్లు ఇవే...

Saturday 27th October 2018

ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్‌ఎల్‌ దీపావళి సందర్భంగా స్టాక్‌ సిఫారసులను వెల్లడించింది. ఆర్తి ఇండస్ట్రీస్‌, మైండ్‌ట్రీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎంఫసిస్‌ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. ఆర్తి ఇండస్ట్రీస్‌ టార్గెట్‌ రూ.1,517. 2017-18 ఆదాయంలో 48 శాతం ఎగుమతుల నుంచే వచ్చింది. వచ్చే రెండేళ్ల పాటు ఏటా 12-15 శాతం వృద్ధికి అవకాశాలున్నాయి. కంపెనీ రూ.14,000 కోట్ల విలువైన 10 ఏళ్లు, 20 ఏళ్ల కాలవ్యవధికి రెండు కాంట్రాక్టులను సొంతం చేసుకుంది. దీంతో

Most from this category