STOCKS

News


స్వల్ప కాల పెట్టుబడుల కోసం ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ షార్ట్‌టర్మ్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌

Monday 13th August 2018
personal-finance_main1534136996.png-19207

సెబీ ఆదేశాల మేరకు షార్ట్‌ డ్యురేషన్‌ కేటగిరీ ఫండ్స్‌ ఏడాది నుంచి మూడేళ్లు కాల వ్యవధి కలిగిన డెట్‌ సెక్యూరిటీల్లోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. పెద్దగా రిస్క్‌ తీసుకోని వారు, స్వల్ప స్థాయి నుంచి మోస్తరు రిస్క్‌ను తట్టుకునేవారు, ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధి కోసం పెట్టుబడుల కోసం షార్ట్‌ డ్యురేషన్‌ లేదా షార్ట్‌ టర్మ్‌ అపార్చునిటీస్‌ పథకాలను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ షార్ట్‌ టర్మ్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌ నిలకడైన పనితీరును ప్రదర్శిస్తోంది. ఇది పూర్తిగా నూరు శాతం పెట్టుబడులను డెట్‌, మనీ మార్కెట్‌ సాధనాల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈక్విటీల్లో పెట్టదు.

రాబడులు
ఈ పథకం ఏడాదిలో 4.3 శాతం, మూడేళ్లలో 7.7 శాతం, ఐదేళ్లలో వార్షికంగా సగటున 8.7 శాతం రాబడులను ఇచ్చింది. ఇదే కాలంలో ఈ కేటగిరీ రాబడులు ఏడాదిలో 4.7 శాతం, మూడేళ్లలో 7.1 శాతం, ఐదేళ్లలో 7.9 శాతం చొప్పున ఉన్నాయి. అంటే కేటగిరీని మించిన రాబడులు ఉన్నాయి. తక్కువ కాల వ్యవధి కలిగిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు వడ్డీ రేట్ల పరంగా రిస్క్‌ను తగ్గించే విధంగానే ఉంటాయి. ఈ పథకం 30-40 శాతం పెట్టుబడులను ఏఏ రేటెడ్‌ బాండల్లో పెడుతుంది. ఇటీవలి కాలంలో కార్పొరేట్‌ బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడంతో ఈ పథకంలో పెట్టుబడుల ద్వారా ప్రయోజనం పొందొచ్చు. సగటు కాల వ్యవధిని 1-3 ఏళ్ల మధ్యే నిర్వహిస్తూ వచ్చింది. సెబీ నూతన నిబంధనలు కూడా ఈ మేరకే ఉండడంతో గత పనితీరును ప్రామాణికంగా తీసుకోవచ్చు. 

స్థిరమైన పనితీరు
ఈ పథకం ఈ విభాగంతో పోలిస్తే సగటున అన్ని కాలాల్లోనూ అధిక రాబడులనే అందించింది. 2014, 2016లో 11.3 శాతం మేర రాబడులను అందించిన చరిత్ర ఉంది. ఇక బలహీన సమయాల్లో 2015లో 8.4 శాతం రాబడులను ఇచ్చింది. గత ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు 4.3 శాతంగానే ఉన్నాయి. ఇదే విభాగంలోని ఇతర టాప్‌ ఫండ్స్‌తో పోలిస్తే ఇది తక్కువ పనితీరే. తక్కువ రిస్క్‌, తక్కువ రాబడులు ఉండే ఏఏఏ రేటెడ్‌ డెట్‌ సాధనాల్లో అధిక పెట్టుబడులు కలిగి ఉండడమే ఇందుకు కారణం. వార్షికంగా కాంపౌండెడ్‌ సగటు రాబడులు గత ఐదేళ్ల కాలంలో 8.7 శాతంగా ఉండడం గమనార్హం. 

పోర్ట్‌ఫోలియో
జూన్‌ నాటికి 46 శాతం పెట్టుబడులను ఏఏఏ రేటెడ్‌ బాండ్లలో 30 శాతం పెట్టుబడులను ఏఏ రేటెడ్‌ వాటిలో, 10.6 శాతం పెట్టుబడులను ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉంది. 

టాప్‌ హోల్డింగ్స్‌
సెక్యూరిటీ పేరు    రేటింగ్‌    పెట్టుబడులు
7.68% ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్స్‌ 2020    ఏఏఏ    5.86
టీఎంఎఫ్‌ హోల్డింగ్స్‌ 2019    ఏఏ    4.37
4%ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 2019    3.61
వాద్వాన్‌ గ్లోబల్‌ క్యాపిటల్‌ 2020    ఏఏఏ    3.61
టాటా పవర్‌ 2023    ఏఏ    3.59
ఐడీఎఫ్‌సీ బ్యాంకు 2018    ఏ1ప్లస్‌    3.58
13.4% వాద్వాన్‌ గ్లోబల్‌ క్యాపిటల్‌ 2022    ఏఏఏ    3.57
7.5%టాటా మోటార్స్‌ 2021    ఏఏప్లస్‌    3.10
7.95%పవర్‌ ఫైనాన్స్‌ కార్ప్‌ 2019    ఏఏఏ    2.74
11% చోళమండలం ఇన్వెస్ట్‌ 2020    ఏఏప్లస్‌    2.45
 You may be interested

సమయానికి తగు బీమా

Monday 13th August 2018

    వివాహాది శుభకార్యాలు సంతోషాలు కలిగించడంతో పాటు కొత్త బాధ్యతలను కూడా మోసుకొస్తాయి. పెళ్లి, కొత్తగా సొంతిల్లు .. పిల్లల కోసం, వారి చదువుల కోసం ప్లానింగ్‌ ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత మరొకటి వచ్చేస్తాయి. వీటి కోసం ప్లానింగ్ చేసుకోవడంతో పాటు దురదృష్టకరమైన సంఘటనేదైనా జరిగితే ..కుటుంబం ఆర్థికంగా ఇబ్బందిపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సరైన సమయంలో బీమా పాలసీ తీసుకున్న పక్షంలో

37,585 మద్దతు కీలకం

Monday 13th August 2018

ఇక్కడి నిఫ్టీ-50...అమెరికా బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ ఎస్‌ అండ్‌ పీ-500 ఇండెక్స్‌ను అనుసరిస్తున్నట్లు గత కొద్దివారాల ట్రెండ్‌ స్పష్టంచేస్తున్నదని, ఆ సూచీలో తీవ్రమైన కరెక‌్షన్‌ వస్తేనే..మన మార్కెట్‌ కూడా పతనమయ్యే ప్రమాదం వుంటుందని భావించాల్సివుంటుంటూ గత కాలమ్‌లో సూచించాం. క్రితం వారం ఎస్‌ అండ్‌ పీ-500 వరుసగా మూడురోజులపాటు కొత్త గరిష్టస్థాయిని తాకడానికి చేసిన ప్రయత్నాలు విఫలంకావడంతో శుక్రవారం 20 పాయింట్లు నష్టపోయింది. అంటే...అమెరికా ప్రధాన సూచీలో డబుల్‌టాప్‌ సంకేతాలు కన్పిస్తున్నట్లు

Most from this category