STOCKS

News


ఎంఎఫ్‌లు ఎంచుకున్న ఏడు స్టాకులు

Monday 29th October 2018
personal-finance_main1540797781.png-21559

ఇటీవల కాలంలో ఎంఎఫ్‌లు ఎక్కువగా వాటాలు పెంచుకున్న స్టాకులను పరిశీలించగా వాటిలో 7 స్టాకులు అన్ని పారామీటర్లకు తగినట్లున్నాయని తేలింది. ఆర్‌ఓఈ, పీఈ, కంపెనీ మూలాలు, బాలెన్స్‌షీట్‌, భవిష్యత్‌ ధృక్పధం, మేనేజ్‌మెంట్‌ నిర్వహణ తదితర పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని వీటిని ఎంపిక చేయడం జరిగింది. ఎంఎఫ్‌లు మక్కువ చూపిన ఈ స్టాకుల్లో పెట్టుబడులు పెడితే ఎంఎఫ్‌ల్లాగే దీర్ఘకాలం వేచిచూడాలని, అప్పుడే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఏడు కంపెనీల్లో ఎంఎఫ్‌లు పెంచుకున్న వాటా తదితర వివరాలు ఇలా ఉన్నాయి...

కంపెనీల విశ్లేషణ:
1. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌: రక్షణ రంగంలో దేశీయ కొనుగోళ్లు పెరగడం కంపెనీకి కలిసివచ్చే అంశం. స్టాకు తన ఐదేళ్ల సరాసరి పీఈకి బాగా డిస్కౌంట్‌లో ట్రేడవుతోంది. ఇటీవల వచ్చిన కరెక‌్షన్‌తో వాల్యూషన్లు దిగివచ్చాయి. దీంతో పాటు స్టాకు రిస్కు రివార్డు నిష్పత్తి ఆకర్షణీయంగా మారింది. నామినేషన్‌ విధానంలో గెలుచుకున్న ప్రాజెక్టులకు సంబంధించి మార్జిన్లపై పరిమితి విధించడం కాస్త నెగిటివ్‌ అంశం. అయినా ఇలాంటి ప్రాజెక్టులు కంపెనీ ఆర్డరు బుక్‌లో 20 శాతానికి లోపే ఉన్నాయి. 
2. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌: రుతుపవనాలు బాగుండడంతో దేశంలో ప్రధాన పంటల సాగు విస్తీర్ణాలు పెరగడం పాజిటివ్‌ అంశం. సాగు పెరగడంతో కంపెనీ విక్రయాలు జోరందుకుంటాయి. అధిక ఎరువుల వాడకం అవసరమైన పంటల వాటా సాగులో పెరగడం కంపెనీకి కలిసివచ్చే ఇంకో అంశం. ఇటీవల కాలంలో ఎరువుల ధరలు పెరగడంతో రెవెన్యూ మంచి వృద్ధి సాధిస్తుందని అంచనా. ముడిపదార్ధాల ధరల పెరుగుదల మార్జిన్లపై కాస్త ప్రభావం చూపవచ్చు. అయితే ఫాస్ఫారిక్‌ ఆమ్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని కంపెనీ పెంచుకోవడం వల్ల ముడిపదర్ధాల వ్యయాలు తగ్గుతాయి.
3. గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌: తాజాగా పెట్రోలియం, నేచరల్‌గ్యాస్‌ నియంత్రణా బోర్డు ట్రాన్సిమిషన్‌ టారిఫ్‌ను పెంచడం అత్యంత పాజిటివ్‌ అంశం. టారిఫ్‌ల పెరుగుదలతో మార్జిన్లు, ఎర్నింగ్స్‌ మంచి జోరు చూపుతాయి. దీంతోపాటు ఇటీవల కాలంలో ఎరువులు, విద్యుత్‌ రంగ కంపెనీల నుంచి డిమాండ్‌ పెరగడంతో వాల్యూంల్లో కూడా మంచి వృద్ది కనిపిస్తుంది. వచ్చే ఏడాది ముంద్రా టర్మినల్‌ ఆరంభమైతే వాల్యూంల్లో మరింత పెరుగుదల నమోదుఅవుతుందని అంచనా. 
4. మదర్‌సన్‌సుమి సిస్టమ్స్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్ల ఉత్పత్తిదారులకు కీలక కంపెనీగా మారింది. దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల ఆర్డర్‌బుక్‌ ఉంది. కంపెనీ యూరప్‌ అనుబంధ విభాగాలు బలమైన ప్రదర్శన చూపుతున్నాయి. దేశీయంగా కొన్ని సవాళ్లున్నా పరిశ్రమ కన్నా అధిక వృద్ధి సాధించే సత్తా ఉంది. 
5. స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌: దేశీయ ఆప్టిక్‌ ఫైబర్‌ మార్కెట్లో 40 శాతం వాటా ఉంది. డేటా వినియోగం పెరిగే కొద్దీ ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ డిమాండ్‌ మరింత పెరగనుంది. ఇందుకు తగ్గట్లే కంపెనీ సామర్ధ్యవిస్తరణ పనులు చేపట్టింది. ఇటీవలే ఇటలీకి చెందిన మెటలర్జికాను కొనుగోలు చేసింది.
6. సుప్రీమ్‌ ఇండస్ట్రీస్‌: ఇటీవలి కాలంలో వాల్యూంలు మందగించడం, పెరిగిన ధరలను కస్టమర్లపైకి మరలించడంలో విఫలం కావడంతో కంపెనీ కాస్త వెనుకంజ వేసింది. అయితే తాజాగా మార్జిన్ల పెంపుదల దిశగా బలమైన చర్యలు చేపట్టడం ఆరంభించింది. ఉత్పత్తుల్లో కూడా వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్ వాటా పెంచనుంది. 
7. రామ్‌కో సిమెంట్స్‌: ప్రభుత్వం చేపట్టిన గృహనిర్మాణ కార్యక్రమాలు, రోడ్ల విస్తరణ కార్యక్రమాలు కంపెనీకి కీలకంగా మారాయి. ఇసుక లభ్యత పెరగడం కూడా కంపెనీకి కలసివచ్చే అంశం. డిమాండ్‌ పెరిగే వేళ దక్షిణాదిన బడా కంపెనీల సామర్ధ్య విస్తరణ మందగిస్తుండడం కంపెనీకి పాజిటివ్‌ అంశం. కంపెనీ బ్రాండ్‌కు బలమైన ఆదరణ ఉంది. ఇటీవల కాలంలో వాల్యూషన్లు సైతం బాగా ఆకర్షణీయంగా మారాయి. You may be interested

కార్పోరేట్‌ లెండింగ్‌ బ్యాంకుల ర్యాలీ... రిటైల్‌ బ్యాంకు డీలా

Monday 29th October 2018

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సంతరం రెండో త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు ఉండటంతో సోమవారం కార్పోరేట్‌ లెండింగ్‌ బ్యాంకు షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. కార్పోరేట్‌ లెండింగ్‌ బ్యాంకులుగా పిలువబడే ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఎస్‌బీఐ బ్యాంకుల షేర్లు 9 నుంచి 5శాతం లాభపడ్డాయి. ఈ మూడు షేర్లు ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయిర్‌లో మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. 

10250 దాటితేనే!

Monday 29th October 2018

దేశీయ మార్కెట్లో ప్రస్తుతానికి పెరిగినప్పుడు అమ్ము సూత్రమే వర్తిస్తుందని నార్నోలియా బ్రోకింగ్‌ సంస్థ అభిప్రాయపడింది. గతవారం నిఫ్టీ రెండు శాతం మేర నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండడంతో దేశీయ సూచీలు సైతం డీలా పడ్డాయి. దీంతో నిఫ్టీ 10100 పాయింట్ల దిగువకు వచ్చింది. ప్రస్తుతం 10150 పాయింట్ల వద్ద నిరోధం ఉందని, దీన్ని దాటితే నెమ్మదిగా 10250 పాయింట్ల వరకు పుల్‌బ్యాక్‌ ఉండొచ్చని నార్నోలియా తెలిపింది. 10250 పాయింట్లపైన

Most from this category