STOCKS

News


సలహాల వెనుక వారి ప్రయోజనం ఏ మేరకు?

Tuesday 11th December 2018
personal-finance_main1544467409.png-22810

మార్కెట్లలో పెట్టుబడులు, జీవిత బీమాలకు సంబంధించి సలహాలు, సూచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. స్నేహితులు, బంధువులు, సహచర ఉద్యోగుల సూచనలను కూడా పాటిస్తుంటారు. అలాగే, వివిధ పెట్టుబడి సాధనాలకు సంబంధించి ఉచితంగా, డబ్బులు తీసుకుని సలహాలు, సిఫారసులు ఇచ్చే వారూ ఉన్నారు. వారి సలహాల వెనుక ప్రయోజనం ఎవరికి, ఏ మేరకో తెలుసా...?

 

మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు
మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు యాధృచ్చికమైన సలహాలను ఇస్తుంటారు. అవి కూడా ఎంపిక చేసిన పథకాలవే అయి ఉంటాయి. వీరు సలహాలకు గాను ఎటువంటి ఫీజులు వసూలు చేయరు. కాకపోతే వారిచ్చిన సూచనలతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడితే వాటిపై కమీషన్‌ ముడుతుంది. సలహాల కోసం ఫీజులు భరించలేని వారు వీరిని అనుసరిస్తుంటారు.
బీమా ఏజెంట్లు
ఇన్సూరెన్స్‌ ఏజెంట్ల విషయానికొస్తే ఇండివిడ్యువల్‌ ఏజెంట్లు అయితే వారు ఒక కంపెనీ ఉత్పత్తులను మార్కెట్‌ చేస్తుంటారు. అదే కార్పొరేట్‌ ఏజెంట్లు అయితే ఒకటికి మించిన బీమా కంపెనీల ఉత్పత్తులను మార్కెట్‌ చేస్తుంటారు. వీరు సైతం సలహాలు, సూచనలకు ఎటువంటి ఫీజులు వసూలు చేయరు. పెట్టుబడులపై వీరికి కూడా కమీషన్‌ ముడుతుంది. 
బ్యాంకు రిలేషన్‌షిప్‌ మేనేజర్లు
బ్యాంకుల్లోని రిలేషన్‌షిప్‌ మేనేజర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా పాలసీలను విక్రయించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఏఎంసీలు, బీమా కంపెనీలతో సదరు బ్యాంకుకు ఉన్న ఒప్పందాల మేరకు ఉత్పత్తులను మార్కెట్‌ చేస్తారు. వీటిపై ఆయా బ్యాంకులకు కంపెనీలు కమీషన్‌ చెల్లిస్తాయి.
స్టాక్‌ బ్రోకర్లు
ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను అందించడంతోపాటు ఏ స్టాక్స్‌ను కొనగోలు చేయవచ్చు, విక్రయించొచ్చు, ఏ ధరల వద్ద అన్న సూచనలను స్టాక్‌ బ్రోకర్లు అందిస్తుంటారు. ఇన్వెస్టర్లు కొన్నా, విక్రయించినా గానీ బ్రోకర్లకు కమీషన్‌ లభిస్తుంది. చాలా బ్రోకింగ్‌ సంస్థలు మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులను కూడా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
వెల్త్‌ మేనేజర్లు
గతంలో రూ.కోటి అంతకంటే విలువైన పోర్ట్‌ఫోలియో నిర్వహించే వారిని వెల్త్‌ మేనేజర్లుగా పేర్కొనేవారు. ఇప్పుడు రూ.25 లక్షల పోర్ట్‌పోలియో నిర్వహిస్తున్న వారిని కూడా వెల్త్‌ మేనేజర్‌గా పరిగణింపబడుతున్నారు. ఆస్తుల నిర్వహణపై ఏటా పావు శాతం నుంచి అర శాతం కమీషన్‌గా తీసుకుంటారు. కొంత మంది వెల్త్‌ మేనేజర్లు తాము విక్రయించే ఉత్పత్తులపైనా కమీషన్‌ పొందుతారు. 
రోబో అడ్వైజర్లు
చిన్న ఇన్వెస్టర్లకు ఈ రోబో అడ్వైజర్లు అన్నవి ఈ మధ్య కాలంలో అందుబాటులోకి వచ్చినవి. కంప్యూటర్‌ ఆల్గోరిథమ్స్‌ ద్వారా సూచనలు ఇస్తుంటారు. ఏడాదికి చార్జీ రూ.1,000 నుంచి రూ.12,000 వరకు ఉంటుంది. విడిగా ఇన్వెస్టర్‌ వారీగా సూచనలు అందవు.
పెయిడ్‌ అడ్వైజర్లు
వీరు కమీషన్‌ తీసుకునే వారు కాదు. క్లయింట్లకు సూచనలు ఇచ్చి ఫ్లాట్‌గా ఇంతని ఫీజు తీసుకునే వారు. వీరిని రిజిస్టర్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్లుగా (ఆర్‌ఐఏ) పేర్కొంటారు. కమీషన్‌ తీసుకోరు గనుక ప్రయోజన వైరుధ్యం ఏమీ ఉండదు. అయితే, మీకు సూచన ఇస్తున్న పెయిడ్‌ అడ్వైజర్‌ సొంతంగా తాను ఏదైనా బీమా ఏజెన్సీ లేదా మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నారా? అన్నది చెక్‌ చేసుకుంటే మంచిది. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ భారీ పతనం

Tuesday 11th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం భారీ నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 155 పాయింట్ల నష్టంతో 10,363 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,514 పాయింట్లతో పోలిస్తే 151 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ మంగళవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

రూపీ గమనం ఈ కంపెనీలకు కీలకం

Tuesday 11th December 2018

దేశీ కరెన్సీ విలువ డాలర్‌తో గత నెల రోజులుగా కాస్త స్థిరంగా చలిస్తోంది. అంతకుముందు డాలర్‌తో చారిత్రక కనిష్ట స్థాయి 74.39ని నమోదు చేసింది. ఆ స్థాయి నుంచి 5 శాతం రికవరీ కావడం కాస్త ఉపశమనం ఇచ్చింది. రూపాయి విలువ గడిచిన ఏడాదిలో పది శాతం వరకు నష్టపోయింది. రూపాయి విలువ క్షీణించడం మన ఆర్థిక రంగానికి లాభం కంటే నష్టమే ఎక్కువ కలిగిస్తుంది. ఎందుకంటే మన దేశం

Most from this category