STOCKS

News


40 శాతం మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు బాలేదు

Wednesday 10th July 2019
personal-finance_main1562781653.png-26960

మన దేశంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఆదరణ ఇటీవలి సంవత్సరాల్లోనే పెరిగింది. ప్యాసివ్‌గా పనిచేసే (ఇండెక్స్‌ ఫండ్స్‌)వాటితో పోలిస్తే యాక్టివ్‌గా పనిచేసే పథకాల్లోకి ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ యాక్టివ్‌ ఫండ్‌ మేనేజర్లు తమ ప్రతిభతో సూచీలకు మించి అధిక రాబడులు తెచ్చిపెడతారన్న నమ్మకం వల్లే. కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ యాక్టివ్‌ పథకాల్లో 40 శాతం పథకాలు గత ఐదేళ్లలో తమ పోటీ సూచీల కంటే పనితీరులో చతికిలపడడం గమనార్హం. ఇక మూడేళ్ల కాలంలో చూసుకుంటే, ఏకంగా 67 శాతం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు బెంచ్‌ మార్క్‌ సూచీల స్థాయిలో రాబడులను ఇవ్వలేకపోయాయి. ఏడాది కాలంలో 65 శాతం పథకాలు ఈ విషయంలో వెనుకబడినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది.  

 

లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌, మల్టీక్యాప్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, వ్యాల్యూ మ్యూచువల్‌ ఫండ్స్‌ అన్నింటినీ పరిశీలించగా ఈ విషయాలే తెలిశాయి. అత్యంత చెత్త పనితీరు లార్జ్‌క్యాప్‌ పథకాల్లోనే ఉండడం గమనార్హం. 57 శాతం యాక్టివ్‌ లార్జ్‌క్యాప్‌ పథకాలు రాబడుల విషయంలో తమ బెంచ్ మార్క్‌ సూచీలతో వెనుకబడ్డాయి. మల్టీక్యాప్‌ పథకాల్లో 48 శాతం, మల్టీక్యాప్‌ పథకాల మాదిరే పనిచేసే ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో 47 శాతం, తమ బెంచ్‌ మార్క్‌ సూచీలను మించి రాబడులు ఇవ్వలేకపోయాయి. మిడ్‌క్యాప్‌ విభాగంలో పావు వంతు పథకాలు తక్కువ పనితీరు చూపించాయి. 

మచ్చుకు కొన్ని...

పథకం                                   ఏడాది రాబడులు    ఐదేళ్లు        ఐదేళ్లలో సూచీలతో పోలిస్తే

హెచ్‌డీఎఫ్‌సీ గ్రోత్‌ అపార్చునిటీస్‌   7.51                   7.12          -4.86
రిలయన్స్‌ విజన్‌ ఫండ్‌               7                        7.78          -3.35
యూటీఐ వ్యాల్యూ                     3.94                   7.83          -3.19
ఐసీఐసీఐ ప్రు.లార్జ్‌, మిడ్‌క్యాప్‌      8.19                   9.03          -2.94 
రిలయన్స్‌ ట్యాక్స్‌ సేవర్‌               3.18                  7.70           -2.83
హెచ్‌డీఎఫ్‌సీ ట్యా‍క్స్‌సేవర్‌             7.70                  8.14           -2.52
డీఎస్‌పీ టాప్‌100                      7.56                  8.33           -2.20
ఐడీఎఫ్‌సీ ఫోకస్డ్‌                       -5.41                  8.54           -2.05 
ఫ్రాంక్లిన్‌ ఇండియా బ్లూచిప్‌           4.41                  9.39           -1.53



You may be interested

ఎంఎన్‌సీ కంపెనీల డీలిస్టింగ్‌కు అవకాశం!

Wednesday 10th July 2019

లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రజల కనీస వాటా 25 శాతం ఉండాలన్నది ప్రస్తుత నిబంధన. దీన్ని 35 శాతం పెంచేందుకు సెబీ చర్యలు తీసుకోవాలని తాజా బడ్జెట్‌ ప్రతిపాదనల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పేర్కొన్నారు. అయితే, ఈ ప్రతిపాదన వల్ల 65 శాతానికి పైగా ప్రమోటర్ల వాటాలు ఉన్న కొన్ని బహుళజాతి సంస్థలు (ఎంఎన్‌సీలు) భారత స్టాక్‌ ఎక్సేంజ్‌ల నుంచి తమ షేర్లను డీలిస్ట్‌ చేసే అంశాన్ని పరిశీలించొచ్చని నిపుణులు

జులై 18న సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఆరవ విడత

Wednesday 10th July 2019

కేంద్ర ప్రభుత్వం సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌(సెంట్రల్‌ పబ్లిక్‌  సెక్టార్‌ ఎంటర్‌ ప్రైజస్‌ ఎక్సెంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) ఆరవ విడతను జులై 18న ప్రారంభించనుంది. దీని ద్వారా రూ.18,000 కోట్లను సమీకరించాలని భావిస్తుంది.  ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఐఓసీ, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్ప్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్ప్‌, భారతి ఎలక్ట్రానిక్స్‌, ఆయిల్‌ ఇండియా, ఎన్‌బీసీసీ ఇండియా, ఎన్‌ఎల్‌సీ ఇండియా, ఎస్‌జేవీఎన్‌ వంటి 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలలోని షేర్లను సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌

Most from this category