News


గరిష్టాలకు నాలుగు మ్యూచువల్‌ ఫండ్స్‌ 

Wednesday 1st August 2018
personal-finance_main1533124778.png-18845

ప్రముఖ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ)లు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఆదిత్య బిర్లా, రిలయన్స్‌, ఎస్‌బీఐకి చెందిన పేరొందిన ఫండ్స్‌ ఈ ఏడాది జనవరిలో నమోదు చేసిన జీవిత కాల గరిష్ట ఎన్‌ఏవీలను చేరుకోవడానికి సమయం పట్టే పరిస్థితులు ఉంటే, చిన్న ఫండ్స్‌ సంస్థల పథకాలు ఓ నాలుగు మాత్రం ఇప్పటికే జీవిత కాల గరిష్ట స్థాయిలను చేరిపోవడం గమనార్హం. ఆకర్షణీయ విలువల వలలో పడిపోకుండా, స్థిరమైన వృద్ధి అవకాశాలున్న స్టాక్స్‌ను నమ్ముకోవడమే ఈ ఫండ్స్‌ మేనేజర్ల రాబడుల సూత్రం. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌ఐఎల్‌ స్టాక్స్‌ ర్యాలీ కూడా ఈ పథకాల పంట పండించింది.

 

యాక్సిస్‌ ఫోకస్డ్‌ 25

ఈ పథకం నిర్వహణలోని నిధులు రూ.4,217 కోట్లు. మూడేళ్ల సగటు వార్షిక రాబడులు 16.58 శాతం. జిగ్నేష్‌ గోపాని ఈ ఫండ్‌ మేనేజర్‌గా ఉన్నారు. యాక్సిస్‌ ఫోకస్డ్‌ 25 పథకం రాబడులకు అధిక క్రెడిట్‌ రేటింగ్‌ (ఏఏఏ) ఉన్న కంపెనీలను ఎంచుకోవడం గోపాని అనుసరించిన సక్సెస్‌ సూత్రాల్లో ఒకటి. ఈ కంపెనీలన్నీ సహజంగా బ్లూచిప్‌ కావడంతో ఆయా రంగాల్లో నాయకత్వ స్తాయిలో ఉండడం కలిసొచ్చింది. ఐపీవోలు, వినూత్నమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలను ఎంచుకున్నారు. మూడోది సైక్లిక్‌ థీమ్‌ను అనుసరించారు. బజాజ్‌ ఫైనాన్స్‌, ఎండ్యురన్స్‌ టెక్నాలజీస్‌, బంధన్‌ బ్యాంకు, గృహ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ మహింద్రా బ్యాంకు ఈపథకం రాబడులు మెరుగ్గా ఉండేందుకు దోహదపడ్డాయి.

 

పరాగ్‌ పారిఖ్‌ లాంగ్‌ టర్మ్‌ 

ఈ పథకం నిర్వహణలోని నిధులు రూ.1,107 కోట్లు. ఏడాది కాలంలో ఈ పథకం 16.5 శాతం రాబడులను అందించింది. మూడేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 12.7 శాతంగా ఉన్నాయి. ఐదేళ్ల రాబడులు 19.5 శాతం. రాజీవ్‌ ఠక్కర్‌, రౌనక్‌ ఆంకర్‌, రాజ్‌ మెహతా ఫండ్‌ మేనేజర్లుగా ఉన్నారు. అంతర్జాతీయ కంపెనీల్లో 35 శాతం వరకు పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తోంది. 28.1 శాతం నిధులను గూగుల్‌ మాతృ సంస్థ ఆల్భాబెట్‌, ఫేస్‌బుక్‌, సుజుకి మోటార్‌ కార్ప్‌, నెస్లే, 3ఎంలో ఇన్వెస్ట్‌ చేసి ఉంది. నాణ్యమైన స్టాక్స్‌ను, అది కూడా అధిక ధరల వద్ద కాకుండా సరసమైన ధరల వద్ద లభించే వాటిని దీర్ఘకాలిక దృష్టితో ఎంపిక చేసుకోవడం రాబడులకు కారణం. 

 

ఎడెల్వీజ్‌ లార్జ్‌క్యాప్‌

పథకం పరిధిలో నిధులు రూ.133 కోట్లు. భారత్‌ లహోటి ఫండ్‌ మేనేజర్‌. ఏడాది కాలంలో 15 శాతం రాబడులను ఇస్తే ఐదేళ్లలో వార్షిక సగటు రాబడులు 17.49 శాతంగా ఉన్నాయి. చక్కని వృద్ధి అవకాశాలున్న కంపెనీలను ఎంచుకోవడమే ఈ పథకం మెరుగైన పనితీరుకు నిదర్శనం. లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ విభాగంలో అత్యంత తక్కువ ఎక్స్‌పెన్స్‌ రేషియో ఉన్న పథకం. రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లో తగినంత ఇన్వెస్ట్‌ చేసింది. 

 

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫోకస్డ్‌ 25

ఈ పథకం నిర్వహణలో ఉన్న నిధులు రూ.1,112 కోట్లు. ఏడాది కాలంలో 9 శాతం రాబడులను ఇస్తే, మూడేళ్లలో 9 శాతం, ఐదేళ్లలో సగటున ఏటా 18 శాతం రాబడులను ఇచ్చింది. సిద్ధార్థ బోత్రా ఫండ్‌ మేనేజర్‌. నాణ్యమైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడమనే విధానాన్ని ఫండ్‌ మేనేజర్‌ పాటిస్తున్నారు. పోర్ట్‌ఫోలియోలో 25 స్టాక్స్‌ మించకుండా పెట్టుబడులు పెడుతుంది. దీంతో ఆయా స్టాక్స్‌పై మరింత పరిశీలనకు అవకాశం ఉంటుంది. బాటమ్‌అప్‌ విధానాన్ని స్టాక్స్‌ ఎంపికకు అనుసరిస్తారు. You may be interested

ఆర్బిట్రేషన్‌ తీర్పును సవాల్‌ చేయనున్న కేంద్రం!

Thursday 2nd August 2018

న్యూఢిల్లీ: కేజీ డీ6 క్షేత్ర నిర్వాహక కంపెనీగా ఆర్‌ఐఎల్‌, భాగస్వామ్య కంపెనీలు సమీప ఓఎన్‌జీసీ క్షేత్రాల నుంచి అక్రమంగా గ్యాస్‌ను తవ్వి తీయడంపై 1.55 బిలియన్‌ డాలర్లు చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ డిమాండ్‌ను... అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌ తోసిపుచ్చడంతో, దీనిపై కేంద్రం సవాల్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పందం ప్రకారం రిలయన్స్‌ తన గ్యాస్‌ క్షేత్రానికి సమీపంలోకి వ్యాపించిన గ్యాస్‌ను వెలికితీసి, విక్రయించుకోవచ్చని, అందుకోసం ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం

మీ డబ్బులు బీమా కంపెనీ వద్దే ఉండిపోయాయా?

Wednesday 1st August 2018

దేశంలోని 23 బీమా సంస్థల వద్ద పాలసీదారులు క్లెయిమ్‌ చేసుకోని నిధులు రూ.15,157 కోట్లు ఉన్నట్టు ఐఆర్‌డీఏ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ఎల్‌ఐసీ వద్దే రూ.10,509 కోట్లు ఉన్నాయి. మిగిలిన 22 ప్రైవేటు బీమా సంస్థల వద్ద ఉన్న అన్‌ క్లెయిమ్డ్‌ మొత్తం రూ.4,657 కోట్లు. ఈ ఏడాది మార్చి నాటికి అందుబాటులో ఉన్న గణాంకాలు ఇవి.    క్లెయిమ్‌ చేయని నిధుల పరిస్థితి? క్లెయిమ్‌ చేయకుండా పదేళ్లు దాటిన పాలసీల

Most from this category