News


60ల తర్వాతి జీవితం కోసం... కొద్ది మందే పొదుపు

Sunday 9th September 2018
personal-finance_main1536516835.png-20098

ఉద్యోగ జీవితం మహా అంటే 58-60 వరకే. ఆ తర్వాత మహా అంటే మరో ఐదేళ్లు పార్ట్‌ టైమ్‌గా చేయగలరు. 60 ఏళ్లకు సీనియర్‌ సిటిజన్‌గా మారే వారు, ఆ తర్వాత జీవితం కోసం ముందు నుంచే తగిన నిధిని సమకూర్చుకోవడం ఎంతైనా అవసరం. పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులు, అదే సమయంలో మెరుగైన, అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటు ఫలితంగా సగటు జీవన కాలం పెరిగిపోతోంది. కనుక ఎంతలేదనుకున్నా 60ల తర్వాత కనీసం మరో 20 ఏళ్ల జీవనం కోసం ప్రణాళిక వేసుకోవాలి. వయసు మీద పడే సమయంలో ఎక్కువ మొత్తమే కావాల్సి ఉంటుంది. కానీ, మన దేశంలో రిటైర్మెంట్‌ జీవితం కోసం పొదుపు చేస్తున్న వారు 33 శాతం మందే. హెచ్‌ఎస్‌బీసీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఓ సర్వే చేసి అభిప్రాయాల ఆధారంగా ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ రిటైర్మెంట్‌: బ్రిడ్జింగ్‌ ద గ్యాప్‌’ అంటూ ఓ నివేదిక విడుదల చేసింది. 

 

‘‘చాలా మందికి రిటైర్మెంట్‌ అనేది కొద్ది కాలమే ఉండదు. సుదీర్ఘకాలంతో వ్యక్తిగత జీవితంలో ఎంతో ముఖ్యమైనది. 64 ఏళ్ల వయసులో అవసరాలకు, 75 లేదా 85 ఏళ్ల వయసులో ఆర్థిక అవసరాలకు ఎంతో తేడా ఉంది’’ అని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా రిటైల్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ ఎస్‌.రామకృష్ణ తెలిపారు. హెచ్‌ఎస్‌బీసీ తరఫున ఇప్సాస్‌ అనే సంస్థ ఆన్‌లైన్‌లో ఈ సర్వే నిర్వహించింది. మన దేశంతోపాటు, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, సింగపూర్‌, తైవాన్‌, హాంగ్‌కాంగ్‌, ఇండోనేషియా, యూకే, యూఎస్‌ఏ తదితర దేశాలకు చెందిన 16,000 మంది అభిప్రాయాలను సమీకరించింది.  

 

గమనించిన అంశాలు

  • 33 శాతం మందే రిటైర్మెంట్‌ జీవితం కోసం పొదుపు చేస్తున్నారు. మూడింట రెండొంతుల మంది అసలు విశ్రాంత జీవనం కోసం పొదుపు గురించే ఆలోచిండం లేదు. 69 శాతం మంది పనిచేసే వయసులో ఉన్నవారు రిటైర్మెంట్‌ వయసులోనూ పనిచేస్తామని భావిస్తున్నారు. 54 శాతం మంది అయితే ఆ వయసులో వ్యాపారం ప్రారంభించగలమనే ఆశావాదంతో ఉండడం గమనార్హం.
  • 19 శాతం మంది ఉద్యోగ వయసులోని వారు భవిష్యత్తు అవసరాల కోసం (నర్సింగ్‌, ఇల్లు తదితర) పొదుపు చేస్తున్నారు. అయినప్పటికీ, రిటైర్మెంట్‌ సమయంలో ఇంటి గురించి ఆలోచిస్తామని 51 శాతం మంది చెప్పారు.
  • ఉద్యోగ వయసులోని వారిలో 56 శాతం మంది రోజువారీ ఆర్థిక అవసరాలకు అనుగుణంగానే జీవిస్తామని చెప్పారు. స్వల్ప కాల అవసరాలకు పొదుపు చేస్తామని 53 శాతం మందే చెప్పారు.
  • భవిష్యత్తు కోసం పొదుపు చేయడం కంటే ఈ రోజు ఎంజాయ్‌ చేయడం కోసమే ఖర్చు చేస్తామని 45 శాతం మంది చెప్పడం గమనార్హం.You may be interested

ఈ కంపెనీల్లో మీకు ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉన్నాయా?

Sunday 9th September 2018

ఎన్‌ఎస్‌ఈ 36 కంపెనీలకు నోటీసులను జారీ చేసింది. త్రైమాసిక ఫలితాల వివరాలను స్టాక్‌ ఎక్సేంజ్‌కు ఫైల్‌ చేయకపోవడంతో నోటీసులను జారీ చేసింది. గీతాంజలి జెమ్స్‌, ఏబీజీ షిప్‌యార్డ్‌ కంపెనీలు జూన్‌ క్వార్టర్‌ త్రైమాసిక ఫలితాలను నిర్ణీత గడువులోపు సమర్పించలేదని సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ తెలిపింది. క్వాలిటీ లిమిటెడ్‌, యూనిటెక్‌, ఆమ్టెక్‌ ఆటో, ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్‌, మోసర్‌ బేర్‌ ఇండియా, ఎస్‌ఆర్‌ఎస్‌, జేవీఎల్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌, భారతి డిఫెన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌,

యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈఓగా అమితాబ్‌ చౌదురీ

Saturday 8th September 2018

నెలల తరబడి ఊహాగానాలకు తెరవేస్తూ కొత్త సీఈఓ, ఎండీని యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఎండీగా పనిచేస్తున్న అమితాబ్‌ చౌదురీని తమ కొత్త సీఈఓ, ఎండీగా ఎంచుకున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. 2021 డిసెంబర్‌ 31వరకు ఆయన యాక్సిస్‌బ్యాంక్‌ను నడిపిస్తారు. చౌదురీ నియామకానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపిందని యాక్సిస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. యాక్సిస్‌బ్యాంక్‌

Most from this category