STOCKS

News


సంపద సృష్టికి ముఖ్యమైనవి ఏవి?

Monday 13th May 2019
Markets_main1557686241.png-25690

గత ఏడాదిన్నరగా మార్కెట్లలో అస్థిరతలు పెరిగిపోయాయి. ముఖ్యంగా గత ఆరు నెలల్లో ఇవి మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లకు దూరంగా ఉండాలా లేక కొనసాగాలా అనే సందేహం చాలా మందిలో నెలకొందనడంలో సందేహం లేదు. స్వల్ప కాలంలో మంచి రాబడులు వచ్చినప్పటికీ దీర్ఘకాలం కోసం వేచి చూడాలా? లాభాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి బ్యాంకు ఎఫ్‌డీలకు ఎందుకు మార్చుకోకూడదు? అన్న ప్రశ్నలకు... తక్కువ లాభాలు గడించినప్పుడు లేదా మార్కెట్లు కరెక్షన్‌లో ఉన్నప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వల్ల వాటి వృద్ధి దెబ్బతింటుందంటున్నారు ఎడెల్‌వీజ్‌ పర్సనల్‌ వెల్త్‌ అడ్వైజరీ హెడ్‌ రాహుల్‌జైన్‌. క్రమశిక్షణతో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల సంపద సృష్టించుకోవచ్చని సూచిస్తున్నారు. మూడు పాయింట్లను ఇన్వెస్ట్‌మెంట్‌ విషయంలో అనుసరించడం మేలు చేస్తుందంటూ, వాటి గురించి తెలియజేశారు. 

 

లక్ష్య చేధన
క్రమం తప్పకుండా మధ్య మధ్యలో డబ్బులు అవసరం అనుకుంటే, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బాండ్లు, మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లు ఇందుకు వీలు కల్పిస్తాయి. అలాగే, రిస్క్‌ను బట్టి లక్ష్యాలను కేటగిరీలుగా విభజించాలి. ఉదాహరణకు ద్రవ్యోల్బణం. దీని కారణంగా విద్యా వ్యయం ఏటేటా భారీగా పెరిగిపోతోంది. ప్రీమియర్‌ బిజినెస్‌ స్కూల్లో ఈ రోజు మేనేజ్‌మెంట్‌ డిగ్రీకి అయ్యే ఖర్చు రూ.21 లక్షలు. 2008లో ఇది రూ.6లక్షలే. కోర్సు వ్యయం ఏటేటా 13 శాతం చొప్పున పెరిగిపోయింది. నేడు నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ కోర్స్‌ వ్యయం రూ.6 లక్షలు అవుతుంటే, ఇది పదేళ్ల తర్వాత రూ.24 లక్షలకు పెరగొచ్చు. అందుకే మీ లక్ష్యాలకు తగ్గ నిధులను సమకూర్చే సాధనాలను ఎంచుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌, డైరెక్ట్‌ ఈక్విటీలు ఎక్కువ రాబడులను ఇవ్వగలవు. 

 

రుణాలు తీర్చివేయడం
మీ నెట్‌వర్క్‌ ఎంతో తెలుసుకోవాలంటే అందులోంచి అప్పులు తీసివేసి చూడాలి. జీరో నెట్‌వర్త్‌ కలిగిన వారే ఎక్కువ. అందుకే ముందుగా రుణాలు తీర్చివేయడం ద్వారానే సంపదను సృష్టించుకోగలరు. రుణ రహితంగా మారడం వల్ల ఒత్తిడి లేకుండా ప్రశాంతతో సంపద సృష్టిపై దృష్టి పెట్టగలరు. 

 

దీర్ఘకాలం పాటు..
కంపెనీల తక్కువ ఎర్నింగ్స్‌ ఇటీవలి మార్కెట్‌ ప్రతికూల పనితీరుకు కారణం. కంపెనీల ఆదాయాలు పుంజుకునే విషయంలో అస్పష్టత ఉంది. కనుక ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో వ్యాల్యూషన్లే కీలక అంశం అవుతుంది. గత పదేళ్లలో బెంచ్‌మార్క్‌ సూచీలు 12-15 శాతం రాబడులు ఇచ్చాయి. ద్రవ్యోల్బణం 7-8 శాతం కంటే ఎక్కువ. రాబడులు అన్నవి సాధారణంగా జీడీపీ, ద్రవ్యోల్బణానికి పైన కొన్ని పాయింట్ల ఎగువన ఉంటాయి. నాణ్యమైన పోర్ట్‌ఫోలియో ద్వారా ఇతర సంప్రదాయ సాధనాలతో పోలిస్తే మెరుగైన రాబడులు అందుకోవచ్చు. ఇందుకు క్రమశిక్షణతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.You may be interested

చల్లబడిన డిమాండ్‌... దిగొస్తున్న ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌

Monday 13th May 2019

ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఎన్నో ఏళ్లుగా ఉత్తమ స్టాక్‌ బెట్స్‌గా కొనసాగుతూ వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్‌లో వినియోగం నిదానించడంతో ఈ షేర్లు దిగొస్తున్నాయి. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 2006 నుంచి చూస్తే ఒక్కసారే డౌన్‌ అయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ఇప్పటి వరకు ఈ షేర్లు డబుల్‌ డిజిట్‌ నష్టాల్లో ఉన్నాయి. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ కొరత వినియోగాన్ని

బంగారంపై బుల్లిష్‌!

Saturday 11th May 2019

అగ్రరాజ్యాల మధ్య వాణిజ్యయుద్ధం సమసేలా కనిపించడం లేదు. దీంతో మదుపరులు క్రమంగా రిస్కు ఎక్కువున్న అసెట్స్‌ నుంచి రిస్కు తక్కువుండే బంగారం లాంటి ఆస్తుల వైపు మరలుతున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో రికవరీ ఆరంభమైంది. మరోవైపు యూఎస్‌ వాణిజ్యలోటు మార్చిలో స్వల్పంగా పెరిగింది. యూఎస్‌ దిగుమతుల్లో 1.1 శాతం పెరుగుదల ట్రేడ్‌లోటుకు కారణమయింది. ఇంకోవైపు యూరోపియన్‌ కమీషన్‌ తన వృద్ధి అంచనాలను తగ్గించింది. జర్మనీ ప్రగతి అంచనాలను

Most from this category