STOCKS

News


ఈ రెండు స్టాక్స్‌పై ఫండ్స్‌లో ఎంతో ఆసక్తి

Wednesday 12th September 2018
personal-finance_main1536691918.png-20171

మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు వేలాది స్టాక్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు ఎన్నో అంశాలను పరిశోధించి, అధ్యయనం చేసిన తర్వాత, వృద్ధి అవకాశాల ఆధారంగానే స్టాక్స్‌ ఎంపిక చేస్తుంటారు. మరి మ్యూచువల్‌ ఫండ్స్‌ ఓ రెండు స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ పట్ల ఎంతో నమ్మకం ప్రదర్శిస్తున్నాయంటే, ఆ కంపెనీల్లో వృద్ధి సామర్థ్యాలు దండిగా ఉన్నాయనే భావించాల్సి ఉంటుంది. అవి డిక్సన్‌ టెక్నాలజీస్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌. ఫండ్స్‌ మేనేజర్లు, బ్రోకరేజీలు వీటి పట్ల ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. 

 

డిక్సన్‌ టెక్నాలజీస్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఈ రెండూ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ కంపెనీలు. ప్రముఖ కంపెనీలకు ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తుంటాయి. డిక్సన్‌ టీవీల తయారీలో ఉంటే, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఏసీల తయారీలో ఉంది. అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఈ ఏడాది జవనరిలో మార్కెట్లో లిస్ట్‌ కాగా, ఇష్యూ ధర 859తో పోలిస్తే, కేవలం 10 శాతం పైన (రూ.944) లభిస్తోంది. డిక్సన్‌ టెక్నాలజీస్‌ గతేడాది సెప్టెంబర్‌లో స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్‌ కాగా, ఇష్యూ ధర రూ.1,766తో పోలిస్తే 54 శాతం అధిక ధర (రూ.2,713) వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా మల్టీబ్యాగర్‌ కాగలిన స్టాక్స్‌ను గుర్తించేందుకు ఇన్వెస్టర్లు అదే పనిగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే, మల్టీబ్యాగర్లను చివరి దశలో ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లే గుర్తించే పనిలో ఉంటారని మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయం. ఈ స్టాక్స్‌లో పదికి పైగా మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఆదిత్య బిర్లా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ, కోటక్‌ మహింద్రా ఏఎంసీ, బీవోఐ ఆక్సా, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి. ప్రజల ఆదాయాలు పెరగడం ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కొనుగోళ్లకు లాభించే అంశం. ఇదే జరిగితే ఈ రెండు కంపెనీలకూ భారీగానే ప్రయోజనం కలుగుతుంది. 

 

డిక్సన్‌ టెక్నాలజీస్‌
వాషింగ్‌ మెషిన్లు, టీవీలు, లైటింగ్‌ విభాగాల్లో తయారీ కంపెనీగా ఉంది. 2018-2021 మధ్య షేరు వారీ ఆర్జన వార్షికంగా 35 శాతం కాంపౌండెడ్‌గా వృద్ధి ఉంటుందని కంపెనీ అంచనాలను ప్రకటించింది. అదే సమయంలో ఆదాయాంలో ఏటా 19 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తోంది. రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ 24 శాతంగా ఉంది. లాభాలు మంచి స్థితిలో ఉన్నాయి. ఎల్‌ఈడీ టెలివిజన్లు, వాషింగ్‌ మెషిన్లు, లైటింగ్‌ విభాగాల్లో ప్రముఖ కంపెనీలు ఈ కంపెనీ క్లయింట్లుగా ఉన్నాయి. 

 

అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌
రూమ్‌ ఏసీల తయారీ అవుట్‌సోర్స్‌ వ్యాపారంలో ప్రముఖ సంస్థ. 2018-21 మధ్య షేరు వారీ ఆ‍ర్జన వార్షికంగా 39 శాతం చొప్పున, ఆదాయం 18 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని, మార్జిన్ల విస్తరణ 65 బేసిస్‌ పాయింట్ల మేర ఉంటుందని అంచనా. అయితే, ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ మాత్రం... పెరుగుతున్న మార్కెట్‌ వాటాతో ఆదాయాలు 44 శాతం, ఎబిట్డా 25 శాతం చొప్పున 2018-2021 మధ్య వృద్ధి చెందుతాయని అంచనా వేస్తోంది. You may be interested

రూపాయి, మార్కెట్ల పతనం... ఏంటి కర్తవ్యం?

Wednesday 12th September 2018

రూపాయి విలువ అంతకంతకూ దిగజారిపోతుండడం, దేశీయ స్టాక్‌ మార్కెట్లను కుదేలు చేస్తోంది. ఈ సమయంలో అంత రిస్క్‌ భరించలేని ఇన్వెస్టర్లు ఎఫ్‌ఎంసీజీ, డ్యూరబుల్స్‌, ఆటోమొబైల్‌, ఫైనాన్షియల్స్‌, రిటైల్‌ ప్రైవేటు బ్యాంకులను పరిశీలించొచ్చని ఏఎస్‌కే ఇన్వెస్ట్‌మెంట్స్‌ బిజినెస్‌ హెడ్‌, సీఐవో ప్రతీక్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. తాము సైతం ఇన్వెస్ట్‌మెంట్‌లో సంప్రదాయవాదులమేనంటూ, పెట్టుబడుల విషయంలో ఈ రంగాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు.    రూపాయి స్థిరపడాలి రూపాయి స్థిరపడిన తర్వాతే పరిస్థితులు కుదుటపడతాయని భావిస్తున్నట్టు ప్రతీక్‌ అగర్వాల్‌

థైరోకేర్‌ షేర్ల బైబ్యాక్‌ వెనుక కారణం?

Wednesday 12th September 2018

రోగ నిర్ధారణ పరీక్షల సేవలను అందించే ప్రముఖ సంస్థ  థైరోకేర్‌ టెక్నాలజీస్‌ షేర్ల బైబ్యాక్‌ ప్రకటించింది. స్టాక్‌ ఎక్సేంజ్‌ల ద్వారా రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును గరిష్టంగా రూ.730 వరకు చెల్లించి కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.63 కోట్లను కేటాయించింది. 8,63,013 షేర్ల వరకు కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. ఈ బైబ్యాక్‌కు కారణాల గురించి కంపెనీ సీఎండీ, సీఈవో ఏ వేలుమణి ఓ మీడియా

Most from this category