STOCKS

News


‘ఐఎల్‌ఎఫ్‌ఎస్‌’ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసిన ఎంఎఫ్‌ ఫథకాలు

Thursday 13th September 2018
personal-finance_main1536777662.png-20206

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు సంస్థల డెట్‌ సెక్యూరిటీల రేటింగ్‌లను రేటింగ్‌ ఏజెన్సీలు తగ్గించడం... ఈ కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల రాబడులను దెబ్బతీసే ప్రమాదం ఏర్పడింది. దీంతో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేవారు తమ పథకాలు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టాయా, లేదా అన్నది తెలుసుకోవడం అవసరం. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కార్పొరేట్‌ కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం సర్వసాధారణం. మరి ఈ విధంగా చూసినప్పుడు ఆగస్ట్‌ చివరికి 13 అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు) సుమారు 34 డెట్‌, హైబ్రిడ్‌ పథకాల ద్వారా ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు డెట్‌ సెక్యూరిటీల్లో రూ.2,900 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌ చేశాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు లిస్టెడ్‌ కాగా, వీటి మాతృ సంస్థే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌ఎఫ్‌ఎస్‌). ఇది ఇప్పటికే ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ను కోల్పోయింది. సెక్యూరిటీలకు సంబంధించిన చెల్లింపుల్లో విఫలం కావడమే సమస్యకు మూలం. 

 

ఏఎంసీ వారీగా...
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు పరిధిలో ఏడు సంస్థలు జారీ చేసిన సెక్యూరిటీల్లో, వివిధ ఏఎంసీలు పలు పథకాల ద్వారా (ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్లు, లిక్విడ్‌ ఫండ్స్‌, కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌, క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌, మీడియం, అల్ట్రా షార్ట్‌, లో డ్యురేషన్‌ ఫండ్స్‌) ఎక్స్‌పోజర్‌ తీసుకున్నాయి. ఎల్‌ఐసీకి చెందిన లిక్విడ్‌ ఫండ్‌ సుమారుగా 697 కోట్లను ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సెక్యూరిటీస్‌ సర్వీసెస్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కమర్షియల్‌ పేపర్లలో ఇన్వెస్ట్‌ చేసింది. శాతం వారీగా చూస్తే 4.19 శాతం మేర ఈ కంపెనీలకు నిధులను కేటాయించింది. ఈ సెక్యూరిటీలు ఈ నెలలోనే గడువు తీరనుండడం గమనార్హం. డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ కూడా రూ.628 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సైతం ఆరు పథకాల ద్వారా రూ.607 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. ఇవి 2020లో గడువు తీరతాయి. టాటా ఏఎంసీ (రూ.240 కోట్లు) ప్రిన్సిపల్‌ (రూ.124 కోట్లు), హెచ్‌ఎస్‌బీసీ మ్యూచువల్‌ ఫండ్స్‌(రూ.105 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసినవే. యూనియన్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌, కోటక్‌, మిరే, యూటీఐ, ఇన్వెస్కో సంస్థలకూ రూ.30 నుంచి 99 కోట్ల మధ్య ఎక్స్‌పోజర్‌ ఉంది. 

 

ఈ పథకాలకు ఎక్కువ
డీఎస్‌పీ ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ సిరీస్‌ 196(37 నెలలు) 10 శాతం మేర పెట్టుబడులు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టింది. అలాగే, డీఎస్‌పీ ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ సిరీస్‌ 195 (36 నెలలు) 9.94 శాతం మేర, మోతీలాల్‌ ఓస్వాల్‌ షార్ట్‌ టర్మ్‌ ఫండ్‌ 9.87 శాతం, ప్రిన్సిపల్‌ క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ 9.81 శాతం, ఆదిత్య బిర్లా ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్లాన్‌ సిరీస్‌ ఓడబ్ల్యూ (1245 రోజులు) 9.33 శాతం, కోటక్‌ ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ సిరీస్‌ 194 (1099 రోజులు) 8.52 శాతం, ఇన్వెస్కో ఇండియా క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌ 7.73 శాతం, ప్రిన్సిపల్‌ అల్ట్రా షార్ట్‌టర్మ్‌ ఫండ్‌ 7.59 శాతం, కోటక్‌ ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ సిరీస్‌ 183 7.36 శాతం మేర పెట్టుబడులు పెట్టాయి.You may be interested

భారీ విస్తరణ దిశగా ఐవోసీ అడుగులు

Thursday 13th September 2018

ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ఐవోసీ తన ఫ్యూయల్‌ రిటైల్‌ అవుట్‌లెట్ల సంఖ్యను రానున్న మూడేళ్లలో రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ప్రస్తుతం 27,000 ఉండగా, మూడేళ్లలో 52,000 పెంచాలనుకుంటోంది. దేశంలో అత్యధిక రిటైల్‌ ఫ్యూయల్‌ స్టేషన్లు ఐవోసీకే ఉన్నాయి. ప్రైవేటు సంస్థలు ఈ విభాగంలోకి ప్రవేశించినప్పటికీ 44 శాతం వాటా ఈ సంస్థ చేతుల్లోనే ఉంది. ‘‘ఐవోసీ రిటైల్‌ విభాగంలోనూ ఇన్వెస్ట్‌ చేయనుంది. రానున్న కొన్ని సంవత్సరాల్లో కొత్తగా

రూపాయి రికవరీతో నష్టాలకు బ్రేక్‌..!

Wednesday 12th September 2018

300 పాయింట్ల లాభపడి సెన్సెక్స్‌ రూపాయి అనూహ్య రికవరీ కారణంగా మార్కెట్‌ రెండు రోజుల భారీ పతనానికి బుధవారం బ్రేక్‌ పడింది. దీనికి తోడు హెవీ వెయిట్‌ షేర్లైన ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల ర్యాలీ, ఆగస్ట్‌ నెల వాణిజ్యలోటు స్వల్పంగా తగ్గిందనే వార్తలు కూడా లాభాల సూచీల లాభాల ముగింపునకు కారణమయ్యాయి. ముఖ్యంగా మిడ్‌సెషన్‌ నుంచి  బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంజీసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, ఫార్మా రంగ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో

Most from this category