STOCKS

News


డెబిట్‌ కార్డు కేవలం ఏటీఎం కోసమే కాదు..!

Monday 28th January 2019
personal-finance_main1548699742.png-23854

డెటిట్‌ కార్డును మన దేశంలో ఇప్పటికీ ఎక్కువ మంది ఏటీఎం కార్డుగానే భావిస్తున్నారు. కేవలం ఏటీఎంల నుంచి డబ్బుల ఉపసంహరణ కోసమే వినియోగిస్తున్నారు. డెబిట్‌ కార్డులను అన్ని రకాల డిజిటల్‌ లావాదేవీలు, కొనుగోళ్లకు వినియోగించుకోవచ్చన్న విషయం తెలిసిన వారు తక్కువే! ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం మన దేశంలో 99 కోట్లకు పైగా డెబిట్‌ కార్డులు వినియోగంలో ఉన్నాయి. ఇందులో 70 శాతం కార్డులు అంటే సుమారు 70 కోట్ల కార్డులను కేవలం ఏటీఎంల్లో లావాదేవీల కోసమే వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. 

 

డెబిట్‌ కార్డును తీసుకెళ్లి ఏటీఎం నుంచి డబ్బులను ఉపసంహరించుకుని ఖర్చు పెట్టాల్సినంత శ్రమ నేటి రోజుల్లో అవసరం లేదు. నేడు డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల ద్వారా  చెల్లింపులు చేసే అవకాశం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. డెబిట్‌ కార్డులతో ఆన్‌లైన్‌లో బిల్లుల చెల్లింపులు చేయవచ్చు. మాల్‌కు వెళ్లి కావాల్సినవి కొనుగోలు చేసి బిల్లు చెల్లింపును డెబిట్‌కార్డుతో చేసేయవచ్చు. అన్ని వేళలా వ్యాలెట్‌లో నగదు ఉండకపోవచ్చు. సమీపంలో ఏటీఎం కేంద్రం లేకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో అయినా డెబిట్‌ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. తొలుత ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ కోసమే కార్డులు తీసుకొచ్చినప్పటికీ తర్వాత ఈ కార్డులను విస్తృతంగా వినియోగించుకునే విధానాలను ఆచరణలోకి తీసుకొచ్చారు. దుకాణాల్లో పీఓఎస్‌ మెషిన్లలో స్వైప్‌ చేయడం దగ్గర్నుంచి, ఆన్‌లైన్‌లో కార్డు నంబర్‌ ఆధారంగా చెల్లింపుల వరకు డెబిట్‌ కార్డులను విస్తృతంగా వినియోగించుకోవచ్చు. పైగా ప్రతీ లావాదేవీ సమాచారం మీ బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌లో రికార్డు కూడా అవుతుంది. ఆ వివరాల ఆధారంగా ఖర్చులను నియంత్రణలో ఉంచుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. 

 

సురక్షితమైనా?
డెబిట్‌ కార్డులను ఏటీఎంలు మినహా ఇతర లావాదేవీలకు వినియోగించకపోవడానికి ఉన్న కారణాల్లో భద్రతకు సంబంధించిన ఆందోళనలు ఒకటి. పీవోఎస్‌ మెషిన్లలో వీటిని స్వైప్‌ చేస్తే కార్డులోని సున్నిత సమాచారం చోరీకి గురవుతందన్న భయం ఉండొచ్చు. ఇటువంటి ఘటనలు కొన్ని గతంలో చోటు చేసుకున్నాయి కూడా. అయితే, పీవోఎస్‌ మెషిన్లపై లావాదేవీ పూర్తి చేయడానికి ఖాతాదారుడు తప్పనిసరిగా నాలుగు అంకెల సీక్రేట్‌ పిన్‌ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే లావాదేవీ పూర్తవుతుంది. ఈ పిను హ్యాక్‌ చేయకుండా ఉండేందుకు గాను టోకెనైజేషన్‌ను ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ ఇటీవలే ఆదేశించింది. ప్రస్తుతమున్న మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌ ఆధారిత కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్‌ కార్డులలను బ్యాంకులు ఖాతాదారులకు మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. 2016 నాటికి దేశంలో 2 లక్షల పీఓఎస్‌ టెర్మినల్స్‌ ఉండగా, వాటి సంఖ్య 34 లక్షలను ప్రస్తుతం దాటిపోయింది. ‘‘చెల్లింపుల వసతులు క్రమంగా పెరుగుతున్నాయి. టచ్‌ పాయింట్ల ద్వారా కార్డులతో చెల్లింపులు చేయవవచ్చు. డిజిటల్‌ చెల్లింపులను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వీటిని సమర్థవంతంగా వినియోగించే బాధ్యత మనపైన ఉంది’’ అని వీసా దక్షిణాసియా మేనేజర్‌ టీఆర్‌ రామచంద్రన్‌ పేర్కొన్నారు. You may be interested

ఎన్నికల ముఖచిత్రం మారుతోందా... మరి మార్కెట్ల పరిస్థితి?

Monday 28th January 2019

దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో మారుతున్న సమీకరణాలు... ఇన్వెస్టర్లలో అప్పుడే ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్రంలో అస్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశాల సంకేతాలు, ఇటీవలి కీలక రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ఒత్తిడికి దారితీయవచ్చని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రభుదాస్‌ లీలాధర్‌ మార్కెట్‌ పట్ల అప్రమత్త ధోరణి వ్యక్తం చేసింది. హంగ్‌ ప్రభుత్వం, బలహీన భాగస్వాములతో ఏర్పడవచ్చని... థర్డ్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అయితే, ప్రతీ

2–3 వారాలకు ఈ షేర్లు చూడొచ్చు

Monday 28th January 2019

2–3 వారాల్లో రాబడులకు అవకాశం వున్న   షేర్లపై వివిధ అనలిస్టులు రూపొందించిన అంచనాలివే.. అనలిస్ట్‌: మజార్‌ మహ్మద్, చీఫ్‌ స్ట్రాటజిస్ట్, చార్ట్‌వ్యూ ఇండియా దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ సిఫార్సు: బై,  టార్గెట్‌: రూ. 135, స్టాప్‌లాస్‌: రూ. 104  కొద్ది వారాలుగా రూ. 147 స్థాయి నుంచి రూ. 104 వరకూ నిలువునా పతనమైన దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ ఇటీవల ఓవర్‌సోల్డ్‌ స్థాయి నుంచి బ్రేక్‌అవుట్‌ సాధించింది. ట్రేడర్లు ప్రస్తుత ధరలోగానీ, లేదా స్వల్పంగా తగ్గినపుడుగానీ కొనుగోలు

Most from this category