STOCKS

News


పెట్టుబడులను రక్షించే వ్యూహమేంటి?

Saturday 20th April 2019
personal-finance_main1555756518.png-25246

ఎన్నికల సందర్భంగా ఒకపక్క ఎఫ్‌ఐఐల నిధుల కుమ్మరింపు, మరోపక్క డీఐఐల అమ్మకాలతో మార్కెట్లో రిటైలర్‌కు ఎటూపాలుపోని స్థితి కనిపిస్తోంది. ఎఫ్‌ఐఐలు సాధారణంగా స్థిరప్రభుత్వం ఉన్న దేశాల మార్కెట్లలో పెట్టుబడులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. గతేడాది చివర్లో ప్రధాని మోదీకి జనాకర్షణ తగ్గినట్లు కనిపించింది, కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి చూసింది. దీంతో మార్కెట్లో భయాలు ఎక్కువయ్యాయి. గతంలోలాగా కిచిడీ ప్రభుత్వాలు వస్తాయన్న భయాలు మహాఘట్భంధన్‌తో మరింత పెరిగాయి. ఒకవేళ యూపీఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పటి ప్రభుత్వ పాలసీలన్నీ సమీక్షకు గురైతాయన్న భయాలు పెరిగాయి. దీంతో మార్కెట్లు గత ఏడాది చివరకు వచ్చేసరికి కరెక‌్షన్‌ మూడ్‌లోకి జారాయి. కానీ ఫిబ్రవరిలో జరిగిన వైమానికదాడులు దేశంలో మోదీ కరిష్మాను మరలా పెంచాయని ఎఫ్‌ఐఐలు భావించాయి. దీంతో మార్చిలో ఒక్కమారుగా సూచీల్లోకి విదేశీ నిధుల వెల్లువ వచ్చింది. ప్రస్తుతం ఈ ఉధృతి కాస్త నెమ్మదించి సూచీలు స్వల్ప రేంజ్‌లో కదలాడుతున్నాయి. వచ్చే నాలుగైదు వారాలు సూచీల్లో భారీ ఆటుపోట్లుండవచ్చు. ఇప్పటికైతే మార్కెట్‌వర్గాలు మోదీ ప్రభుత్వం మరలా వస్తుందని అంచనా వేస్తున్నాయి. కానీ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయని 2004 నిరూపించింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టరు ఎలాంటి పరిణామానికైనా సిద్దపడి ఉండాలి. ప్రస్తుతానికి మే మధ్యవరకు బుల్లిష్‌సెంటిమెంట్‌ కొనసాగవచ్చు. మే 19న ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు, 23న నిజ ఫలితాలు మార్కెట్‌ గతిని డిసైడ్‌ చేస్తాయి. ఎన్నికల అనంతరం మహాకూటమి ప్రభుత్వం వస్తే ఏడాది చివరవరకు సుదీర్ఘమైన పతనాన్ని చూడవచ్చు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం వస్తే చిన్న పాటి కరెక‌్షన్‌ వచ్చినా తిరిగి సూచీలు సర్దుకుంటాయి. అందరూ ఊహించినట్లు మోదీ మరలా గద్దెనెక్కితే ఒకమోస్తరు ర్యాలీ ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్‌కు ముందు పోర్టుఫోలియో పొజిషన్లలో పాక్షిక లాభాలు స్వీకరించడం మంచిది. తుది ఫలితాల అనంతరం వచ్చే తాత్కాలిక ఊపులో మిగిలిన పొజిషన్లను విక్రయించి బయటపడాలి. దీంతో అనుకోని ఫలితాలు వచ్చినా భారీ నష్టాలు రాకుండా జాగ్రత్త పడినట్లు అవుతుంది. అనుకున్న ఫలితాలు వచ్చినా, ర్యాలీ తాత్కాలికమే కాబట్టి సూచీలు వెనుకంజ వేసినప్పుడు మంచి షేర్లతో పోర్టుఫోలియో నిర్మించుకునేందుకు తగిన లిక్విడిటీ మీ చేతులో ఉంటుంది. You may be interested

వాల్యూ పిక్స్‌ కావాలా..

Saturday 20th April 2019

క్యాపిటల్‌ గూడ్స్‌ స్టాక్స్‌ను ఎంచుకోండి నిపుణుల సలహా గత కొన్నేళ్లుగా ప్రధాన మార్కెట్‌తో పోలిస్తే పేలవ ప్రదర్శన చూపుతున్న క్యాపిటల్‌ గూడ్స్‌ కంపెనీల స్టాకులపై పెట్టుబడులు పెట్టవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఏబీబీ, సీమెన్స్‌, కమిన్స్‌ ఇండియా, థెర్మాక్స్‌ లాంటి క్యాపిటల్‌ గూడ్స్‌ స్టాకుల వాల్యూషన్లు వాటి చారిత్రక సరాసరిల కన్నా తక్కువగా ఉన్నాయని, పెట్టుబడుల వలయం పుంజుకునే ఈ తరుణంలో ఇకపై ఈ కంపెనీలు సత్తా చూపుతాయని విశ్లేషిస్తున్నారు. వచ్చే ఐదేళ్ల

ఓపెన్‌ మార్కెట్లో స్పెక్ట్రం కొనేందుకు జియో సిద్ధం!

Saturday 20th April 2019

టెలికం సేవలు అంతరాయాలు లేకుండా అందించేందుకు ఓపెన్‌ మార్కెట్లో స్పెక్ట్రం కొనుగోలు చేయాలని రిలయన్స్‌ జియో భావిస్తోంది. ప్రస్తుతం జియోకు 30 కోట్ల సభ్యులున్నారు. నెలకు కొత్తగా కోటిమందిని చేర్చుకుంటోంది. గత త్రైమాసికంలో కంపెనీ ఆర్‌కామ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని టెలికం శాఖ అభ్యంతరాల కారణంగా రద్దు చేసుకుంది. ఆర్‌కామ్‌ నుంచి స్పెక్ట్రం కొనుగోలు చేయాలని జియో భావించినా, ఆర్‌కామ్‌ బకాయిల విషయంలో డీఓటీ పెట్టిన షరతులను ఒప్పుకోలేక ఒప్పందం రద్దు

Most from this category