News


సరైన ధర.. అంటే?

Friday 14th December 2018
personal-finance_main1544783903.png-22941

మార్కెట్లో కాస్తో కూస్తో ట్రేడింగ్‌ చేసే ప్రతిఒక్కరికీ సరైన ధర వద్ద షేర్లు కొనమనే సూచనలు తెలిసే ఉంటాయి. ప్రతి అనలిస్టూ ఇదే సలహా ఇస్తుంటారు. అసలింతకీ ఒక షేరుకు సరైన ధర అంటే ఎలా నిర్ధారిస్తారు? అనేది ప్రతిఒక్కరికీ వచ్చే సందేహం. దీన్ని తీర్చుకోవాలంటే కాస్త విపులంగా చర్చించుకోవాలి.
ఒక షేరు వాల్యూ(విలువ)కు, (ప్రైస్‌)ధరకు మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు కొనుగోలు చేయాలన్నది ఈక్విటీ మార్కెట్లో సాధారణ సూత్రం. వారెన్‌ బఫెట్‌ ప్రకారం ‘మనం చెల్లించేది ధర, మనకు  దక్కేది విలువ’. అందువల్ల ఒక కంపెనీకి చెందిన షేరు విలువను సరిగ్గా మదింపు చేయడం ఒక ఎత్తు. ప్రస్తుతం ఆ షేరు ధరను గతంలో ధరతో పోల్చి చూడడం మరో ఎత్తు. ఈ రెండింటి కలిపి చూడడం చివరి ఎత్తు. అప్పుడు మనకు షేరుపై పూర్తి అవగాహన వస్తుంది. దాని నిజవిలువ కన్నా షేరు ధర తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా తెలుస్తుంది.


ఒక సెక్యూరిటీ నిజ విలువ కన్నా దాని ప్రస్తుత ధర తక్కువగా ఉంటే దాన్ని సరైన విలువ అనుకోవచ్చు. 


నిజానికి షేరు విలువ అనేది ఒక సాపేక్ష భావన. అది మారుతూ ఉంటుంది. స్థిరమైన విషయం సదరు సెక్యూరిటీ విలువ. విలువ కన్నా ధర తక్కువగా ఉంటే వాల్యూషన్లు తక్కువగా ఉన్నట్లు లెక్క. మార్కెట్లు సాధారణంగా అతి ఊహల మీద ఆధారపడుతుంటాయి. ఉదాహరణకు ఒక కంపెనీ వృద్ధి రేటు బాగుందంటే భవిష్యత్‌లో సదరు కంపెనీ గ్రోత్‌ను బాగా ఎక్కువ చేసి ఊహిస్తాయి. దీంతో వాల్యూషన్లు ఎక్కువతుంటాయి. ఈ సూత్రాలన్నీ ఒకే రంగంలోని కంపెనీలను పరిశీలించడానికి సరిపోతాయి. కానీ విభిన్న రంగాలకు చెందిన విభిన్న కంపెనీలను పోల్చిచూడడం ఈ నమూనాలో సాధ్యం కాదు. ఇలా భిన్న రంగాల స్టాకులను పోల్చిచూడడం ఒక రకంగా కష్టం, ఈ విధమైన పోలికతో వచ్చే ఫలితం కూడా అంతంతమాత్రగానే ఉంటుంది.
ప్రైస్‌ టు ఎర్నింగ్స్‌ గ్రోత్‌(పీఈజీ) ఆధారంగా నాణ్యమైన స్టాకులను ఎంచుకునే వీలుంది. స్టాకు పీఈజీ 1 కన్నా  తక్కువగా ఉంటే దాన్ని కొనుగోలు చేయవచ్చని, పీఈజీ 2, 3కు చేరిన వాటినే తక్షణమే వదిలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. You may be interested

ఎన్‌బీఎఫ్‌సీల్లోకి పెరిగిన ఎఫ్‌పీఐ పెట్టుబడులు

Friday 14th December 2018

దేశీయ నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై విదేశీ మదుపరులకు మక్కువ పెరిగింది. ఈ షేర్లలోకి గత ఎనిమిదినెలల తర్వాత తొలిసారి ఎఫ్‌పీఐ నిధులు ప్రవహించాయి. రెండు నెలల అమ్మకాల అనంతరం ఇటీవలే ఎఫ్‌పీఐలు దేశీయ ఈక్విటీల్లో కొనుగోళ్లు ఆరంభించిన సంగతి తెలిసిందే. గత నెల ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో ఎఫ్‌పీఐలు 35.2 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. లిక్విడిటీ పెంచేందుకు ఆర్‌బీఐ సుముఖత వ్యక్తం చేయడంతో ఎన్‌బీఎఫ్‌సీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఈ రంగంలోని

బ్యాడ్‌న్యూస్‌.. బ్రహ్మాండమైన అవకాశం..

Friday 14th December 2018

ఇన్వెస్టర్లకు సెంట్రమ్‌ సూచన ప్రపంచ క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రను పరిశీలిస్తే బ్యాడ్‌న్యూస్‌ వచ్చినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌కు మంచి అవకాశమని నిరూపితమైందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ రిసెర్చ్‌ హెడ్‌ జగన్నాధ్‌ తూనుగుంట్ల చెప్పారు. స్వల్పకాలిక ఆటుపోట్లను తట్టుకునే నాణ్యమైన స్టాకులను పరిశీలించడం మంచిదని సూచించారు. గత మూడునెలలుగా ఎన్‌బీఎఫ్‌సీలు, లిక్విడిటీ, రియల్టీ, క్రూడాయిల్‌ ధర, ఆర్‌బీఐ, ఎన్నికల ఫలితాలు.. ఇలా అనేక దుర్వార్తలు మార్కెట్‌ను చుట్టుముట్టాయి. దీంతో నిఫ్టీ దాదాపు 10 శాతం పతనమైంది. కొన్ని

Most from this category