STOCKS

News


అధిక రాబడులను ఆఫర్‌ చేస్తున్న ఎన్‌సీడీలు

Tuesday 1st January 2019
personal-finance_main1546367332.png-23350

ముడి చమురు ధరలు తిరిగి తక్కువ స్థాయిలకు చేరాయి. ద్రవ్యోల్బణం సౌకర్య స్థాయి 4 శాతం మార్క్‌నకు దిగువకు చేరింది. దీంతో రానున్న రోజుల్లో తక్కువ వడ్డీ రేట్లకు అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు, అధిక వడ్డీ రేటు ఆశించే వారి ముందు రెండు నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌ (ఎన్‌సీడీ) ఇష్యూలు ఉన్నాయి. అవి కూడా పేరున్న సంస్థలు మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఆఫర్‌ చేస్తున్నవి కావడం గమనార్హం. 

 

శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ ఎన్‌సీడీ 9.7 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తుంటే, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎన్‌సీడీపై 9.5 శాతం రేటును నిర్ణయించింది. ఈ ఇష్యూలు ఈ నెల 4న ప్రారంభమై, 7వ తేదీన ముగుస్తాయి. రిటైల్‌ విభాగంలో ఒక్కో ఇన్వెస్టర్‌ గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రూ.500 కోట్లను సమీకరించాలనుకుంటోంది. అవసరమైతే అదనంగా రూ.3,000 కోట్లను సమీకరించే గ్రీన్‌షూ ఆప్షన్‌ పెట్టుకుంది. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ రూ.200 కోట్లను సమీకరించాలనుకుంటోంది. రూ.500 కోట్లు గ్రీన్‌షూ ఆప్షన్‌ కలిగి ఉంది. ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 39 నెలలు, ఐదేళ్లు, ఎనిమిదేళ్లు, పదేళ్ల కాల వ్యవధిపై అన్‌ సెక్యూర్డ్‌ ఎన్‌సీడీలను ఆఫర్‌ చేస్తోంది. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ మాత్రం మూడు, ఐదేళ్లు, పదేళ్ల కాల వ్యవధులకు సెక్యూర్డ్‌ ఎన్‌సీడీలను ఆఫర్‌ చేస్తుండడం గమనార్హం. అన్‌సెక్యూర్డ్‌తో పోలిస్తే సెక్యూర్డ్‌ ఎన్‌సీడీలు భద్రత కలిగినవి.

 

రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు తిరిగి తగ్గుముఖం పట్టే పరిస్థితులు కనిపిస్తున్న తరుణంలో... అధిక వడ్డీ రేటుతో కూడిన దీర్ఘకాలిక సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం తెలివైన నిర్ణయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘10 ఏళ్ల బెంచ్‌మార్క్‌ 7.3 శాతం వద్ద ట్రేడ్‌ అవుతోంది. దీనికంటే రెండు శాతం అధిక వడ్డీ రేటుతో ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ ఏఏఏ- రేటెడ్‌ ఎన్‌సీడీ పేపర్‌ ఆఫర్‌ చేస్తోంది. 2.4 శాతం అధికంగా శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ ఎన్‌సీడీలో లభిస్తోంది. ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశం’’ అని సినర్జీ క్యాపిటల్‌ ఎండీ విక్రమ్‌దలాల్‌ అభిప్రాయపడ్డారు. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎన్‌సీడీ ఏఏఏ రేటింగ్‌ కలిగి ఉండడం, అధిక వడ్డీ రేటు ఆఫర్‌ చేస్తున్నందున తాను అయితే దీనికే ప్రాధాన్యమిస్తానని ఆయన చెప్పారు. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 7 శాతం అటు, ఇటుగా ఉన్నందున స్వల్ప రిస్క్‌ తీసుకునే వారు వీటిని పరిశీలించొచ్చు.You may be interested

2019లో ఎన్నో అవకాశాలు

Wednesday 2nd January 2019

కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం... ఈ ఏడాది అయినా లాభాలు తీసుకోకపోతామా...? అనే ఆశ ఇన్వెస్టర్లలో సహజంగానే ఉంటుంది. అయితే, ఎక్కువ మంది అనలిస్టులు ఈ ఏడాది లాభాలకే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ధరలు భారీగా తగ్గడంతో ఆకర్షణీయంగా ఉన్నందున కొనుగోలుకు అవకాశంగానూ భావిస్తున్నారు. ప్రముఖ ఇన్వెస్టర్‌, సంవితి క్యాపిటల్‌ సహ వ్యవస్థాపకుడు ప్రభాకర్‌ కుద్వా మాట్లాడుతూ... ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు ఈ దశలో

మార్కెట్లను మెప్పించని మారుతి డిసెంబర్‌ అమ్మకాలు

Tuesday 1st January 2019

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి డిసెంబర్‌ అమ్మకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోయాయి. కంపెనీ ఈ డిసెంబర్‌లో మొత్తం 1.28 లక్షల వాహన విక్రయాలు జరిగాయి. అయితే నోమురా సంస్థ డిసెంబర్‌లో 1.30లక్షల వాహన విక్రయాలు జరగవచ్చని అంచనావేసింది. గతేడాది ఇదే నెలలో జరిగిన దేశీయంగా అమ్మకాలతో పోలిస్తే స్వల్పంగా 1.8శాతం పెరిగాయి. ఈ నెలలో మొత్తం 1.21 లక్షలుగా నమోదయ్యాయి. అయితే విదేశాలకు ఎగుమతులు మాత్రం 36.4శాతం

Most from this category