STOCKS

News


బ్యాంకు కార్డులపై భారీ ఆఫర్లు 

Monday 5th November 2018
personal-finance_main1541393148.png-21698

అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌’... ఫ్లిప్‌కార్డ్‌ ‘ఫెస్టివ్‌ ధమాకా సేల్స్‌’... పేటీఎం ‘మహా క్యాష్‌బ్యాక్‌ సేల్‌’... వీటిలో కొనలేకపోయారా..? ఆఫర్లను మిస్‌ అయ్యామని నిరాశ పడాల్సిన పనేలేదు. ఎందుకంటే పండుగ సందర్భంగా డిస్కౌంట్‌ ఆఫర్లకు పలు ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. అటు ఆన్‌లైన్‌ సంస్థలూ కొత్త కొత్త పేర్లతో పండగల దాకా ఏదో ఒక రూపంలో ఆఫర్లు అందిస్తూనే ఉంటున్నాయి. ఇక దగ్గర్లోని  ప్రముఖ దుకాణానికి వెళ్లినా ఆఫర్లు అందుకోవచ్చు! కాకపోతే క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై చాలా బ్యాంకులు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు అందిస్తున్నాయి. వీటిని వినియోగించుకోవడం ద్వారా కొంత వరకు ఆదా చేసుకునే అవకాశముంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌, సిటీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు తమ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఉపయోగించి షాపింగ్‌ చేస్తే పండుగ ఆఫర్లను అందిస్తున్నాయి. పలు రిటైల్‌ సంస్థలతో (వీటిలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌) సంబంధం పెట్టుకుని తగ్గింపు, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను తమ ఖాతాదారులకు అందిస్తున్నాయి. కాకపోతే వీటి గురించి అంతగా ప్రచారం ఉండదు. కాబట్టి ఆయా బ్యాంకు వెబ్‌సైట్లకో, లేదంటే ఈ కామర్స్‌ వెబ్‌సైట్లకో వెళితే తప్ప తెలియదు. వాటిలో గనక ఈ ఆఫర్ల గురించి తెలుసుకుంటే... దానికి అనుగుణంగా కొనుగోళ్లు చేసుకునే వీలుంటుంది.
విభిన్న ఆఫర్లు
పండుగ ఆఫర్లు రెండు రూపాల్లో ఉంటాయి. ఒకటి క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ కాగా, రెండోది రిటైల్‌ సంస్థలు పండుగ సందర్భంగా అందిస్తున్న తగ్గింపు ధరలపై అదనపు డిస్కౌంట్‌!. ఈ అదనపు డిస్కౌంట్‌ అనేది అప్పటికప్పుడే అమలవుతుంది. క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ అయితే, ఆ మొత్తం తిరిగి కస్టమర్‌కు వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. అంటే ముందు మొత్తం చెల్లించి ఉత్పత్తి కొనుగోలు చేస్తే... నిర్ణీత తేదీన క్యాష్‌ బ్యాక్‌ జమ చేస్తారు. ఇది నెల రోజుల నుంచి మూడు నెలల వరకు ఒక్కో సంస్థను బట్టి మారిపోతుంది. పీటర్‌ ఇంగ్లండ్‌ స్టోర్లలో కొనుగోళ్లపై ఐసీఐసీఐ బ్యాంకు తన క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై 10 శాతం క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది. కాకపోతే కనీస బిల్లు మొత్తం రూ.3,500 ఉంటేనే ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌కు అర్హులు. అలాగే గరిష్ట క్యాష్‌ బ్యాక్‌ ఒక కార్డుపై రూ.750కే పరిమితం. 2019 జనవరి 31లోపు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. చాలా స్టోర్లు చాలా కార్డులపై ఇలాంటి ఆఫర్లు అందిస్తున్నాయి. 
క్యాష్‌ బ్యాక్‌, డిస్కౌంట్‌తోపాటు రివార్డు పాయింట్ల రూపంలో మరో ప్రయోజనాన్ని కూడా కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. పండుగ సీజన్లో క్రెడిట్‌ కార్డు కొనుగోళ్లపై హెచ్‌ఎస్‌బీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తదితర కొన్ని బ్యాంకులు రివార్డు పాయింట్లను అందిస్తు‍న్నాయి. ఇన్ఫీబీమ్‌లో రూ.50,000 అంతకుమించి చేసే కొనుగోళ్లపై హెచ్‌ఎస్‌బీసీ ఇతరులతో పోలిస్తే ఐదు రెట్లు అధికంగా రివార్డు పాయింట్లను ఆఫర్‌ చేస్తోంది. వస్త్రాలు, మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కొనుగోళ్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 10 రెట్లు అధికంగా రివార్డు పాయింట్లను ఇస్తోంది. కాకపోతే కనీస కొనుగోలు మొత్తం రూ.5,000 ఉండాలి. ప్రతీ రోజు సాయంత్రం 5-9 గం టల మధ్య కొనుగోలు చేసే వారికే ఈ ఆఫర్‌ పరిమితం. ఇక ఈ పండుగ సీజన్‌లో ఏం కొనుగోలు చేయవచ్చంటే... వస్త్రాలు, గృహోపకరణాలు, మొబైల్‌ ఫోన్లు, బంగారు ఆభరణాలపై ఈ ఆఫర్లు ఉన్నాయి. 
ఎక్కడెక్కడ...
రిలయన్స్‌ ట్రెండ్స్‌, పాంటలూన్‌, వెస్ట్‌ సైడ్‌, మ్యాక్స్‌, మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్స్‌ తదితర ప్రముఖ రిటైల్‌ వస్త్ర దుకాణాలు ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకుతో టై అప్‌ అయ్యాయి. తమ కార్డులతో కొనుగోళ్లపై క్యాష్‌ బ్యాక్‌, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. దాదాపు అన్ని స్టోర్లలోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల విషయంలో మాత్రం క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌ కనీసం రూ.10,000 కొనుగోలుపై 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. అదే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుతో క్రోమాలో చేసే కొనుగోళ్లపై రూ.2,000 వరకు క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు. తనిష్క్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు కొనుగోళ్లపై 5 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌ ఉంది. రూ.50,000-1,00,000 కొనుగోళ్లపై అందుకునే గరిష్ట క్యాష్‌బ్యాక్‌ రూ.2,500. రూ.లక్షపైన కొనుగోలుపై గరిష్ట క్యాష్‌ బ్యాక్‌ రూ.5,000. 
కొన్ని పరిమితులు కూడా...
ఈ ఆఫర్లు దాదాపు అన్ని అవుట్‌లెట్లలో అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయనేది గుర్తించాలి. ఉదాహరణకు... పాంటలూన్‌ రిటైల్‌ దుకాణాల్లో ఎస్‌బీఐ అందించే 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌, తూర్పు ప్రాంతంలోని స్టోర్లకు అమలు కాదు. రిలయన్స్‌ ట్రెండ్స్‌లో ఐసీఐసీఐ 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌, అసోం, పశ్చిమబెంగాల్‌, బిహార్‌ సహా తొమ్మిది రాష్ట్రాల్లో అందుబాటులో లేదు. ఇక మరో అంశం... బ్యాంకు నిర్దేశించిన కనీస మొత్తం కొనుగోలుపైనే ఆఫర్లు అమలవుతాయి. అంతేకాదు గరిష్ట తగ్గింపు, క్యాష్‌ బ్యాక్‌పైనా పరిమితి ఉంటుంది. ఈ వివరాలను బ్యాంకు వెబ్‌సైట్లు, సంబంధిత రిటైల్‌ దుకాణాల్లో విచారించి తెలుసుకోవచ్చు. యాక్సిస్‌ బ్యాంకు, కోటక్‌బ్యాంకు, సిటీబ్యాంకులు రిలయన్స్‌ డిజిటల్‌ అవుట్‌లెట్లలో తమ క్రెడిట్‌ కార్డులతో చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. కాకపోతే కనీస కొనుగోలు రూ.10,000 ఉండాలి. గరిష్ట క్యాష్‌ బ్యాక్‌ రూ.2,000. రిటైల్‌ దుకాణాల్లో కార్డు స్వైప్‌ చేసే ముందు కూడా అక్కడి సిబ్బందికి విషయం తెలియజేయడం మంచిది. సరైన కార్డునే వినియోగిస్తున్నదీ, లేనిదీ పరిశీలనకు అవకాశం ఉంటుంది. ఇక రిటైల్‌ కార్డులపైనే ఈ ఆఫర్లన్నీ. కార్పొరేట్‌ కమర్షియల్‌ కార్డులకు వర్తించవు. 
ముందస్తు జాగ్రత్తలు
పండుగల సమయాల్లో షాపింగ్‌ కోసం ఎక్కువ ఖర్చు చేయడం సాధారణంగా జరిగేదే. క్రెడిట్‌ కార్డు వినియోగం వల్ల వడ్డీ రహిత రుణాన్ని కొన్ని రోజులకు తీసుకునే అవకాశం లభిస్తుంది. కాకపోతే వడ్డీ రహిత కాల వ్యవధి (20-50 రోజుల మధ్య) ముగిసేలోపు ఆ మొత్తాన్ని తిరిగి కార్డులోకి జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే భారీగా వడ్డీ పడుతుంది. ప్రతీ నెలా 2.5-3 శాతం వరకు వడ్డీ ఉంటుంది. అంటే వార్షిక వడ్డీ 30-36 శాతం వరకు. అందుకే తిరిగి వడ్డీ రహిత కాల వ్యవధిలోపు చెల్లించగలిగే వారు, పండుగ ఆఫర్ల కోసమే క్రెడిట్‌ కార్డును వాడుకోవడానికి పరిమితం కావడం మంచిదే. 
 

బ్యాంకు    ఏ ఉత్పత్తిపై    ఆఫర్‌ ఎంత    ఏ రూపంలో    కార్డు రకం    కనీస బిల్లు (రూ.లో)    గరిష్ట ప్రయోజనం(రూ.లో)
ఐసీఐసీఐ    వస్త్రాలు    5-10%    క్యాష్‌బ్యాక్‌/డిస్కౌంట్‌    క్రెడిట్‌/డెబిట్‌    3,500-6,000    750-1,000
ఐసీఐసీఐ    మొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌    5%    క్యాష్‌బ్యాక్‌    క్రెడిట్‌    10,000    2,500
ఐసీఐసీఐ    ఆన్‌లైన్‌ కొనుగోళ్లు    10%    డిస్కౌంట్‌    క్రెడిట్‌/డెబిట్‌    2,000-3,000    1,000
ఎస్‌బీఐ    వస్త్రాలు    5%    క్యాష్‌బ్యాక్‌    క్రెడిట్‌    3,500    750
ఎస్‌బీఐ    మొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌    5%    క్రెడిట్‌    11,990-12,990    1,750
హెచ్‌డీఎఫ్‌సీ    వస్త్రాలు    10%    క్యాష్‌బ్యాక్‌    క్రెడిట్‌/డెబిట్‌    5,000-7,500    రూ.750
హెచ్‌డీఎఫ్‌సీ    మొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌    55    క్యాష్‌బ్యాక్‌    క్రెడిట్‌/డెబిట్‌    10,000    2,000
హెచ్‌డీఎఫ్‌సీ    ఆన్‌లైన్‌ కొనుగోళ్లు    5-10%    క్యాష్‌బ్యాక్‌/డిస్కౌంట్‌    క్రెడిట్‌/డెబిట్‌    2,000-3,000    500-4,000
యాక్సిస్‌    వస్త్రాలు    5-10%    క్యాష్‌బ్యాక్‌/డిస్కౌంట్‌    క్రెడిట్‌/డెబిట్‌    5,000    1,000-1,500
యాక్సిస్‌    మొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌    5-10%    క్యాష్‌బ్యాక్‌    క్రెడిట్‌/డెబిట్‌    10,000-15,000    2,000



You may be interested

సిప్‌ పెట్టుబడులు ఆపకండి 

Monday 5th November 2018

ప్ర: మార్కెట్‌ తగ్గుతున్నప్పుడు సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)లను కొనసాగించి, మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు వాటిని ఆపేయడం ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగిద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? -ఇజాజ్‌, హైదరాబాద్‌  జ:  ఇది ఏ మాత్రం సరైన నిర్ణయం కాదు. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) అసలు ఉద్దేశాలు రెండు..మొదటిది,  మీరు క్రమపద్థతిలో ఇన్వెస్ట్‌ చేయడం, రెండోది... మార్కెట్‌ ఒడిదుడుకులతో నిమిత్తం లేకుండా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడం.  రిటైర్మెంట్‌  నిధి ఏర్పాటు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం,

చీకట్లో చిరుదివ్వెలు...

Monday 5th November 2018

మన స్టాక్‌ మార్కెట్‌ ఈ ఏడాది ఎన్నడూ చూడనంత తీవ్రమైన ఒడిడుదుకులను చవిచూస్తోంది. ఆగస్టు వరకూ ఆకాశమే హద్దుగా చెలరేగి రోజుకో కొత్త ఆల్‌టైమ్‌ గరిష్టాలను తాకిన దేశీ సూచీలు... ఆ తర్వాత హఠాత్తుగా కుప్పకూలి ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం రూపంలో మార్కెట్లను తాకిన సునామీ దెబ్బకి బ్లూచిప్స్‌ షేర్లు కూడా 20–50 శాతం దాకా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లలో మరింత ఇన్వెస్ట్‌ చేయాలా? మార్కెట్లు

Most from this category