STOCKS

News


రుణాలకు ఇకపై ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేటు

Thursday 6th December 2018
personal-finance_main1544074780.png-22683

ముంబై: రుణాలపై వడ్డీ రేట్ల పరంగా మరింత పారదర్శకత తీసుకొచ్చే చర్యల్ని ఆర్‌బీఐ ప్రకటించింది. గృహ, ఆటో, పర్సనల్‌ లోన్‌, ఎంఎస్‌ఈ సంస్థల రుణాలపై ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లను, అది కూడా ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లు అయిన రెపో లేదా ట్రెజరీ ఈల్డ్‌తో అనుసంధానించనుంది. ప్రస్తుతం ఈ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో బ్యాంకులు అంతర్గత బెంచ్‌ మార్క్‌ రేట్ల విధానాలు ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌ (పీఎల్‌ఆర్‌), బెంచ్‌ మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌ (బీపీఎల్‌ఆర్‌), మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ లెండింగ్‌ రేట్‌ (ఎంసీఎల్‌ఆర్‌)ను అనుసరిస్తున్నాయి. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేట్లతో వడ్డీ రేట్ల అనుసంధానంపై తుది నోటిఫికేషన్‌ను ఈ నెలాఖరులోపు విడుదల చేయనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఎంసీఎల్‌ఆర్‌ విధానంపై సమీక్ష కోసం ఏర్పాటైన కమిటీ సూచనల మేరకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌తో ముడిపడిన రుణాలను ఇతర రుణాలకూ అమలు చేసే స్వేచ్ఛను బ్యాంకులకు కల్పిస్తున్నట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ‘‘రుణదాతలు రుణ ఉత్పత్తులను సులభంగా అర్థం చేసుకునేందుకు, పారదర్శకత కోసం బ్యాంకులు ఒక రుణ విభాగంలో ఒకే తరహా ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేటును అనుసరించడం తప్పనిసరి. ఒకే రుణ విభాగంలో ఒకటికి మించిన బెంచ్‌మార్క్‌ రేట్లను అనుసరించేందుకు అనుమతి లేదు’’అని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 



You may be interested

థియేటర్లలో నో లైట్స్‌ ఆఫ్‌!

Thursday 6th December 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చిత్ర పరిశ్రమలో కొత్త శకం ప్రారంభమైంది. ఇక థియేటర్‌లో సినిమా చూడాలంటే లైట్లు ఆపేయాల్సిన అవసరం లేదు. దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ ‘ఓనిక్స్‌’ పేరిట ఎల్‌ఈడీ తెరలను అభివృద్ధి చేసింది. అమెరికా, మెక్సికో, థాయ్‌ల్యాండ్, చైనా వంటి దేశాల్లో అందుబాటులో ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్లను తొలిసారిగా మన దేశంలో విడుదల చేసింది. మల్టిప్లెక్స్‌ ఆపరేటర్‌ ఐనాక్స్‌ లీజర్స్‌తో ఒప్పందం చేసుకొని బుధవారం

వ్యాపారులందరికీ పాన్‌ తప్పనిసరి!

Thursday 6th December 2018

న్యూఢిల్లీ: ఇకపై వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ పాన్‌ (పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌) తీసుకోవాల్సిందే. రోడ్డు పక్కన, మార్కెట్లలో, ఆఖరికి తోపుడు బండ్లపై వ్యాపారం చేసేవారు కూడా ఇక పాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇకపై ఏడాదికి రూ.2.5 లక్షలకు మించి వ్యాపారం చేసే వారంతా పాన్‌ తప్పనిసరిగా తీసుకోవాలంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసిది. వార్షికంగా రూ.2.5 లక్షలంటే... నెలకు దాదాపు రూ.20వేలు. అంటే

Most from this category