STOCKS

News


విక్రయానికి సౌర్వభౌమ బంగారం బాండ్లు

Wednesday 17th October 2018
personal-finance_main1539718573.png-21211

కేంద్ర ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను సార్వభౌమ బంగారం బాండ్ల విక్రయాన్ని ఈ నెలలోనే ప్రారంభించనుంది. ఈ నెల 19వ తేదీ వరకు కొనుగోలుకు అవకాశం ఉంది. ఈ సందర్భంగా సౌర్వభౌమ బంగారం బాండ్ల గురించి కొన్ని ముఖ్య విషయాలు...
వ్యక్తులు విడిగా, మరొకరితో కలసి జాయింట్‌గానూ ఈ బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి రూ.4 కిలోల వరకు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. మైనర్‌ పేరిటా బాండ్‌ తీసుకోవచ్చు. 

 

  • కేవలం వ్యక్తులే కాకుండా హెచ్‌యూఎఫ్‌లు, చారిటబుల్‌ ట్రస్టులు, ట్రస్ట్‌లు కూడా కొనుగోలు చేసుకోవచ్చు. 
  • ఒక గ్రాము బంగారం యూనిట్‌గా పరిగణిస్తారు. కనీస పెట్టుబడి ఒక గ్రాము.
  • ఈ బాండ్‌ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తర్వాత ముందుగా రెడీమ్‌ చేసుకోవచ్చు.
  • కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఈ బాండ్లను డీమ్యాట్‌ ఖాతాలోకి మార్చుకోవచ్చు.
  • ఈ బాండ్లను తనఖాగా ఉంచి బ్యాంకులు, ప్రైవేటు సంస్థల నుంచి రుణం తీసుకునేందుకు కూడా అవకాశం ఉంది.
  • పెట్టుబడి పెట్టిన మొత్తంపై వార్షికంగా 2.5 శాతం వడ్డీ చెల్లించడం జరుగుతుంది. ఆరు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. 
  • ఈ బాండ్లపై వచ్చే లాభం (బంగారం ధర పెరగడం ద్వారా వచ్చే లాభం)పై పన్ను లేదు. 
  • ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తే గ్రాము బాండ్‌పై రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది.
  • రూ.20,000 పెట్టుబడి వరకు నగదు చెల్లించినా తీసుకుంటారు. అంతకుమించితే మాత్రం ఎలక్ట్రానిక్‌ రూపంలో, డీడీలు, చెక్‌ల రూపంలో చెల్లించాలి. 



You may be interested

ఎన్నికల తర్వాత 44,000కు సెన్సెక్స్‌

Wednesday 17th October 2018

సమీప కాలంలో సెన్సెక్స్‌ 36,000-36,500 వరకు వెళుతుందని, వచ్చే సాధారణ ఎన్నికల అనంతరం 44,000కు చేరుకుంటుందని ఎన్‌వీఎస్‌ బ్రోకరేజ్‌ డైరెక్టర్‌ నలిన్‌షా అంచనా వ్యక్తం చేశారు. మార్కెట్‌ కరెక్షన్‌ ముగిసిందని, సెన్సెక్స్‌ 22,900 స్థాయిలో బోటమ్‌ అయినట్టు తాము భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాల ఎన్నికల చుట్టూ ఉన్న అనిశ్చితి, కేంద్రం ఎగుమతులను పెంచలేకపోవడం రూపాయిపై ఒత్తిడికి దారితీస్తాయన్నారు. ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగంలోని అగ్రగామి కంపెనీలు బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌

మెప్పించిన ఇన్ఫీ!

Tuesday 16th October 2018

బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ అంచనాలను మించిన ఫలితాలతో ఆకట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2018-19, క్యూ2) కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.4,110 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.3,726 కోట్లతో పోలిస్తే 10.3 శాతం వృద్ధి చెందింది. కంపెనీ మొత్తం ఆదాయం 17.3 శాతం ఎగబాకి రూ.17,567 కోట్ల నుం‍చి రూ.20,609 కోట్లకు చేరింది. డిజిటల్‌

Most from this category