STOCKS

News


చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మహర్ధశ!

Friday 21st September 2018
personal-finance_main1537504233.png-20427

న్యూఢిల్లీ: చాలా కాలం తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది. ఎన్‌ఎస్‌సీ, పీపీఎఫ్‌ తదితర పథకాల్లో డిపాజిట్లపై 0.30-0.40 శాతం వరకు పెంచింది. ఈ మేరకు అక్డోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికి అమల్లో ఉండే వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. ఇంత కాలం వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన కేంద్రం... ఆర్‌బీఐ కీలక రేట్లను పెంపు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకులు సైతం పలు డిపాజిట్లు, రుణాలపై రేట్లను పెంచుతూ నిర్ణయాలను ప్రకటించాయి. చిన్న మొత్తాల పొదుపు, వృద్ధులు, ఆడపిల్లల సంక్షేమానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు రేట్లను సవరించింది. వాస్తవానికి 2012 ఏప్రిల్‌ 1 నుంచి వడ్డీ రేట్లు తగ్గుతూ వచ్చిన విషయం గమనార్హం.
నూతన రేట్లు
నూతన వడ్డీ రేట్లు అక్టోబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు అమల్లో ఉంటాయి. ఈ సవరణ తర్వాత సుకన్య సమృద్ధి యోజన పథకంలో వడ్డీ రేటు 8.1 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ రేటు 8.3 శాతం నుంచి 8.7 శాతానికి చేరింది. పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ పథకాల్లో 7.6 శాతం నుంచి 8 శాతానికి, కిసాన్‌ వికాస్‌ పత్ర రేటు 7.3 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగాయి. దీంతో కిసాన్‌ వికాస్‌పత్ర పథకంలో ఇప్పటి వరకు డిపాజిట్‌ 118 నెలల్లో రెట్టింపు అవుతుండగా, 112 నెలలకు తగ్గింది. ఐదేళ్ల టైమ్‌ డిపాజిట్‌పై రేటు 7.8 శాతానికి, ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్‌ రేటు 7.3 శాతానికి చేరాయి. పోస్టాఫీసు సేవింగ్స్‌ డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేటు 4 శాతంగానే కొనసాగుతుంది. అలాగే, ఏడాది నుంచి మూడేళ్ల వరకు కాల వ్యవధి టైమ్‌ డిపాజిట్లపై 0.30 శాతం అధికంగా వడ్డీ రేటు లభించనుంది. 
పొదుపును ప్రోత్సహించేందుకే: జైట్లీ
చిన్న మొత్తంలో పొదుపు చేసే వారిని ప్రోత్సహించేందుకే ఈ చర్య అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ట్వీట్‌ చేశారు. ‘‘ఇది ఆడపిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహిస్తుంది. వృద్ధుల ఆర్థిక భద్రతను మెరుగుపరుస్తుంది’’ అని జైట్లీ పేర్కొన్నారు. 
================ కావాలునుకుంటే బాక్స్‌ ================
పథకం    వడ్డీ రేటు (సెప్టెంబర్‌ 30 వరకు)    వడ్డీ రేటు (అక్టోబర్‌-డిసెంబర్‌)    కాంపౌండింగ్‌
సేవింగ్స్‌ డిపాజిట్‌    4    4    వార్షికంగా
ఏడాది టైమ్‌ డిపాజిట్‌    6.6    6.9    త్రైమాసికవారీ
రెండేళ్ల టైమ్‌ డిపాజిట్‌    6.7    7    త్రైమాసికవారీ
మూడేళ్ల టైమ్‌ డిపాజిట్‌    6.9    7.2    త్రైమాసికవారీ
ఐదేళ్ల టైమ్‌ డిపాజిట్‌    7.4    7.8    త్రైమాసికవారీ
ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్‌    6.9    7.3    త్రైమాసికవారీ
సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌    8.3    8.7    త్రైమాసికోసారి చెల్లింపు
నెలసరి ఆదాయ పథకం    7.3    7.7    నెలవారీ చెల్లింపు
ఎన్‌ఎస్‌సీ    7.6    8    వార్షికంగా
పీపీఎఫ్‌    7.6    8    వార్షికంగా
కిసాన్‌ వికాస్‌పత్ర    7.3    7.7    వార్షికంగా
సుకన్య సమృద్ధి యోజన    8.1    8.5    వార్షికంగా     You may be interested

వాట్సాప్‌నకు మూడో నోటీసుపై కేంద్రం యోచన

Friday 21st September 2018

న్యూఢిల్లీ: మెసేజీల జాడ కనుక్కునే సాంకేతికతను అమలు చేయాలంటూ మెసెంజర్‌ సేవల సంస్థ వాట్సాప్‌నకు మూడోసారి నోటీసు ఇవ్వాలని కేంద్ర ఐటీ శాఖ యోచిస్తోంది. దీనిపై అంతర్గతంగా చర్చ జరిగినట్లు, వచ్చే వారం, పది రోజుల్లో వాట్సాప్‌నకు మూడోసారి నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాట్సాప్‌లో వైరల్‌గా మారుతున్న తప్పుడు వార్తలు, మెసేజీలు పలు సందర్భాల్లో హింసకు దారి తీస్తున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై ప్రత్యేకంగా

ఎన్‌పీఏగా నాగార్జున ఫెర్టిలైజర్స్‌ లోన్స్‌

Friday 21st September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎరువుల తయారీ కంపెనీ నాగార్జున ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ (ఎన్‌ఎఫ్‌సీఎల్‌) ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) జాబితాలోకి వెళ్లినట్టు సమాచారం. మార్చి 31 నాటికి ఎన్‌ఎఫ్‌సీఎల్‌ మొత్తం రుణం రూ.1,450 కోట్లకుపైగా ఉందని తెలుస్తోంది. సెప్టెంబరు త్రైమాసికంలో తాజా ఎన్‌పీఏల లిస్టులో ఎన్‌ఎఫ్‌సీఎల్‌ చేరిందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మూలధనం లేకపోవడంతో మరికొంత కాలం ప్లాంటు మూసివేత కొనసాగించనున్నట్టు కంపెనీ

Most from this category