STOCKS

News


ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ లావాదేవీలపై రుసుముల తొలగింపు

Thursday 6th June 2019
personal-finance_main1559815891.png-26139

ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసే బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త ప్రకటించింది. ఆర్టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా చేసే నగదు బదిలీలపై ఛార్జీలను తొలగిస్తున్నట్లు తెలిపింది. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, బ్యాంకులు ఈ ప్రయోజనాలను తమ ఖాతాదారులకు బదిలీ చేయాలని ఆదేశించామని తెలిపింది.  దీంతో పాటు ఏటీఎం ఛార్జీలను కూడా పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. పెద్ద మొత్తంలో నగదు బదిలీ కోసం రియల్ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌(ఆర్టీజీఎస్‌)ను, రూ. 2లక్షల వరకు నగదు లావాదేవీల కోసం నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌(ఎన్‌ఈఎఫ్‌టీ) వ్యవస్థను ఆన్‌లైన్‌ ఖాతాదారులు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ విధానాల ద్వారా నగదు బదిలీలు చేసినప్పుడు బ్యాంకులు కొంత ఛార్జీలు తీసుకుంటాయి. ప్రభుత్వరంగంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలపై రూ. 1 నుంచి రూ. 5 వరకు, ఆర్టీజీఎస్‌ లావాదేవీలపై రూ. 5 నుంచి రూ. 50 వరకు ఛార్జీలు వసూలు చేస్తోంది. సాధారణంగా బ్యాంకులు ఆర్‌టీజీఎస్‌ లావాదేవీపై 2- 10 రూపాయలు, నెఫ్ట్‌ లావాదేవీపై 2.5- 25 రూపాయల వరకు చార్జీలు వసూలు చేస్తున్నాయి. తాజా ఆదేశాలతో ఈ చార్జీలు తొలగిపోనున్నాయి. ఇందుకు సంబంధించి వారంలోగా అన్ని బ్యాంకులకు సూచనలు జారీ చేస్తామని ఆర్‌బీఐ తెలిపింది. 



You may be interested

ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్‌: సెన్సెక్స్‌ 554 పాయింట్లు డౌన్‌

Thursday 6th June 2019

  178 పాయింట్లను కోల్పోయిన నిఫ్టీ ఆర్‌బీఐ పాలసీలో మార్కెట్‌ను ఆశ్చర్యపర్చే అంశాలేవీ లేకపోవడం, లిక్విడిటీ సంక్షోభ నివారణకు స్పష్టమైన చర్యల్నిప్రకటించకపోవడంతో నిరుత్సాహానికి గురైన మార్కెట్‌ గురువారం భారీ నష్టంతో ముగిసింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే పావుశాతం మాత్రమే వడ్డీరేట్ల కోతను ఆర్‌బీఐ ప్రకటించడం, ఆ అంశాన్ని ఇప్పటికే మార్కెట్లు డిస్కౌంట్‌ చేసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు రేట్ల ప్రభావిత షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిపారు. మరోవైపు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌...చెల్లింపుల్లో డిఫాల్డ్‌కావడం

జీడీపీ అంచనాలు తగ్గించిన ఆర్‌బీఐ

Thursday 6th June 2019

2019-20 సంవత్సరానికి 7 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరజీడీపీ అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ జూన్‌ సమీక్షా సమావేశంలో ప్రకటించింది. 2019-20 సంవత్సరానికి జీడీపీ అంచనాను 7.2 శాతానికి తగ్గిస్తున్నట్లు ఏప్రిల్‌ సమావేశంలో ఆర్‌బీఐ తెలిపింది. తాజాగా మారోమారు జీడీపీ అంచనాలను ఆర్‌బీఐ తగ్గించింది. దేశీయ పెట్టుబడి కార్యకలాపాల్లో మందగమనం ఉత్పత్తి, దిగుమతుల్లో కనిపిస్తోందని ఆర్‌బీఐ వ్యాఖ్యానించింది. ఈ సంవత్సరం ప్రథమార్ధానికి

Most from this category