STOCKS

News


అమిత్‌షాకు షేర్లు.. రాహుల్‌కు ఎంఎఫ్‌లు..

Saturday 6th April 2019
personal-finance_main1554547772.png-24997

ప్రధాన పార్టీల అధ్యక్షుల పెట్టుబడుల వివరాలు
ఎన్నికల సందర్భంగా ప్రతి అభ్యర్ధి తన ఆస్తులు, పెట్టుబడుల వివరాలను బహిర్గతం చేయాల్సిఉంటుంది. ప్రస్తుతం హోరా హోరీగా తలపడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌ అధ్యక్షులిద్దరి ఆస్తుల అఫిడవిట్‌లో మార్కెట్‌ మదుపుకు సంబంధించి ఆసక్తికర అంశాలు తెలిశాయి.

బీజేపీ ప్రెసిడెంట్‌ అమిత్‌ షాకు సొంతంగా షేర్లలో పెట్టుబడులు పెట్టడం మక్కువ కాగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాత్రం మూ‍్యచువల్‌ ఫండ్స్‌ ద్వారా మాత్రమే మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.


అమిత్‌ షా: పలు లిస్టెడ్‌, అన్‌లిస్టెడ్‌ కంపెనీల షేర్లున్నాయని తెలిపారు. కీలక కంపెనీల్లో టీసీఎస్‌, ఆర్‌ఐఎల్‌, బజాజ్‌ ఆటో, కాల్‌గేట్‌ పామోలివ్‌, గ్రాసిమ్‌, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎస్‌బీఐ, ఐటీసీ తదితరాలున్నాయి. మొత్తం 17.69 కోట్ల రూపాయల విలువైన లిస్టెడ్‌ షేర్లు తన వద్ద ఉన్నట్లు అఫిడవిట్‌లో చెప్పారు. ఇవి కాక రూ. 3.08 లక్షల రూపాయల విలువైన అన్‌లిస్టెడ్‌ షేర్లున్నాయన్నారు. ఆయన భార్య వద్ద రూ. 4.35 కోట్ల విలువైన లిస్టెడ్‌, రూ. 1.58 లక్షల విలువైన అన్‌లిస్టెడ్‌ షేర్లున్నాయి. మొత్తం షా ఆస్తుల విలువ రూ. 30.49 కోట్లు, ఆయన భార్య సోనాల్‌బెన్‌ షా ఆస్తుల విలువ రూ. 8.35 కోట్లని వెల్లడించారు. షా పోర్టుఫోలియోలో అదానీ గ్రూప్‌ కంపెనీలకు చెందిన ఒక్క షేరు కూడా లేదు. కానీ అనీల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌, ఆర్‌క్యాపిటల్‌, ఆర్‌ఇన్‌ఫ్రా, ఆర్‌హోమ్‌ఫైనాన్స్‌ షేర్లున్నట్లు తెలిపారు. 
రాహుల్‌గాంధీ: ఈక్విటీల్లో సొంతంగా పెట్టుబడులు పెట్టకుండా మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా పెట్టుబడులకు ఎక్కువ మొగ్గు చూపారు. మొత్తం 10 ఎంఎఫ్‌ల్లో రూ. 5.19 కోట్ల పెట్టుబడులున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఇతర చరాస్థులు కలిపి మొత్తం రూ. 5.80 కోట్లున్నాయని చెప్పారు. స్థిరాస్థుల విలువ రూ. 10.08 కోట్లుగా వెల్లడించారు. 



You may be interested

షేర్ల బైబ్యాక్‌ అన్ని సమయాల్లోనూ మంచిదేనా?

Monday 8th April 2019

షేర్ల బైబ్యాక్‌ (వాటాలను తిరిగి కొనుగోలు) ఇన్వె‍స్టర్లకు ఎప్పుడూ మంచిదేనన్న అభిప్రాయం ఒకటి ఉంది. కంపెనీ పనితీరు చక్కగా ఉందన్న సంకేతాన్ని ఇది ఇస్తుందనుకుంటారు. కానీ, బైబ్యాక్‌లు అన్నింటినీ ఒకే గాటన కట్టొద్దు. షేర్ల బైబ్యాక్‌ నిజంగా ఇన్వెస్టర్లకు మేలు చేసేదేనా? అన్నది తెలుసుకోవాలంటే ఉద్దేశ్యాలు అర్థం చేసుకోవాలి.     షేరు ధర చౌకగా ఉండడమే కంపెనీలు బైబ్యాక్‌ నిర్ణయం తీసుకునేందుకు ప్రోత్సాహకరమని వారెన్‌ బఫెట్‌ అంటారు. ‘‘30-40 ఏళ్ల క్రితం

మందగమనమే అసలు సమస్య!

Saturday 6th April 2019

వచ్చే వారం మార్కెట్‌ రివ్యూ ఈ వారం నిఫ్టీ ప్రాఫిట్‌ బుకింగ్‌ జోన్‌లోకి ప్రవేశించింది. ఇదే సమయంలో ఆర్‌బీఐ పాలసీ నిర్ణయంతో వృద్ధికి స్థూల అంశాలు సహకరించడం లేదని తెలుస్తోంది. వరుసగా మూడు త్రైమాసికాలుగా ఎకానమీలో మందగమనం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రోత్‌ ఇంజన్లు అలసినట్లున్నాయి. దీంతో పలు కేంద్రబ్యాంకులు ఒక్కమారుగా తమ విధానాన్ని సడలీకరించుకుంటున్నాయి. రేట్ల పెంపు ఆలోచనను పక్కనబెట్టి రేట్‌కట్‌ దిశగా మరలుతున్నాయి.

Most from this category