STOCKS

News


మార్కెట్లో గెలవాలంటే... ‘హృతిక్‌ డాన్స్‌’ చెయ్యాల్సిందే!

Wednesday 3rd April 2019
personal-finance_main1554280339.png-24954

రిటైల్‌ ఇన్వెస్టర్ల ధృక్పథంలో మార్పు అవసరం

మార్కెట్లో రాణించాలంటే డాన్స్‌ చేయాలా! ఇంకా నయం... మా వల్ల కాదు.. అనుకుంటున్నారా..

ఒక్క నిమిషం..

డాన్స్‌ అంటే డాన్స్‌ కాదండీ, ఈ డాన్సుకు వేరే మీనింగుంది...

ఒకసారి పూర్తిగా చూడండి ..

రిటైల్‌ ఇన్వెస్టర్లు మార్కెట్లో గెలవాలంటే ‘హృతిక్‌ డాన్స్‌’ చేయాలని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సూచిస్తోంది. సాధారణంగా రిటైల్‌ మదుపరి ఫండమండెల్స్‌, టెక్నికల్‌ అనాలసిస్‌ తదితర అంశాల ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ చాలాసార్లు రిటైలర్లు సహేతుక నిర్ణయాలకు దూరమై ఎమోషన్సుకు, మందమనస్థత్వానికి లోనై ఆర్థికంగా తర్క రహిత ప్రవర్తన చూపుతారు. ఈ ప్రవర్తన కారణంగానే మార్కెట్లో భారీ కరెక‌్షన్స్‌, ర్యాలీలు వస్తుంటాయి. ముఖ్యంగా ఒకరిని చూసి మరొకరు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం, అనవసర బాంధవ్యాలు, సెంటిమెంట్లు పెంచుకొని నష్టాల పాలవడం కద్దు. ప్రస్తుత మార్కెట్లో మనకు మరోమారు ఈ విషయం అర్దమవుతుంది. నిఫ్టీ తాజాగా మరో రికార్డు గరిష్ఠాన్ని తాకింది. ఈ నేపథ్యంలో నిఫ్టీతో సమానంగా లాభాలు పొందిన రిటైలర్లు చాలా తక్కువమంది ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే మార్కెట్‌ ర్యాలీ మూడ్‌లో ఉన్నా, రిటైలర్లలో ఎక్కువమంది పైన చెప్పిన కారణాలతో సదరు ర్యాలీని అందుకోలేకపోయారు. ముఖ్యంగా నిఫ్టీ ‘హృతిక్‌ డాన్స్‌’ చేస్తున్నప్పుడు రిటైలర్లు పక్క స్టెప్పులు వేయడంతో లాభాలు పొందలేకపోయారు.
ఏమిటీ నృత్యం?
‘హృతిక్‌ డాన్స్‌’ అంటే సినిమా హీరో హృతిక్‌ రోషన్‌ డాన్స్‌ కాదు. కీలకమైన ఏడు స్టాకులు మంచి ప్రదర్శన చూపడమే ప్రస్తుత మార్కెట్లో బడా ర్యాలీకి కారణం.

‘‘ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా అనే ఏడు బ్లూచిప్స్‌ పేర్లలో తొలి అక్షరాలను కలిపితే వచ్చేదే హృతిక్‌.. ఈ ఏడు చూపే జోరు హృతిక్‌ డాన్స్‌(HRITHIK stands for the seven blue chips – HDFC Bank, Reliance Industries, Infosys, TCS, HDFC, ITC and Kotak Mahindra Bank).’’
 

ఇవి చూపిన జోష్‌ సూచీలను ఆవరించి పరుగులు తీయించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ ఏడు స్టాకులకు కలిపి నిఫ్టీలో దాదాపు 47.5 శాతం వెయిటేజ్‌ ఉంది. దాదాపు సగం వెయిటేజ్‌ ఉన్న ఈ స్టాకుల్లో వచ్చిన ర్యాలీ మిగిలిన స్టాకులకు, చివరకు సూచీలకు కూడా పాకింది. అయితే చాలామంది రిటైలర్లు ఈ హృతిక్‌ డాన్స్‌ మిస్సయిన కారణంగా తాజా ర్యాలీలో భారీ లాభాలు పొందలేకపోయారు. అంటే ఎక్కువమంది ఇన్వెస్టర్ల పోర్టుఫోలియోల్లో ఈ స్టాకుల్లేవని అర్ధం. ఇవన్నీ హైక్వాలిటీ, స్పష్టమైన ఎర్నింగ్స్‌ గ్రోత్‌ ఉన్న కంపెనీలు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల ప్రదర్శనను, షేరు ధర శ్రేణిని అంచనా వేయవచ్చు. ఈ రెండు అంశాల్లో సమీప భవిష్యత్‌లో భారీ రిస్కులు కనిపించవు. అదే చాలామంది పాడి ఆవుల్లాగా భావించే చాలా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల ఫలితాలను, రిస్కులను, షేరు ధర పోకడలను అంచనా వేయలేము. 
‘అస్పష్ట మార్గంలో వాహన ప్రయాణం కన్నా, స్పష్టత ఉన్న మార్గంలో కాలి నడక పయనం మేలు.’.. అన్నట్లు ఎప్పుడో మల్టీబ్యాగర్లు అవుతాయనో, లేదా భారీ లాభాలందిస్తాయనో తెలిసీ తెలియని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్లకన్నా, ఫలితాలపై ఒక స్పష్టమైన అవగాహన ఉన్న ఇలాంటి బ్లూచిప్‌ కంపెనీలపై పెట్టుబడే సత్ఫలితాలనిచ్చిందని తాజా ర్యాలీ వెల్లడిస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు చేసే అతిపెద్ద తప్పు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల ఫలితాల అంచనాలను అతిగా ఊహించుకోవడమేనని నిపుణులు చెబుతుంటారు. కానీ ఎకానమీ మందగమనంలో ఉన్నప్పుడు గత ఫలితాలను చిన్న కంపెనీలు రిపీటు చేయలేవని స్పష్టం చేస్తున్నారు. 
యావరేజ్‌ డౌన్‌ అనే తప్పటడుగు
రిటైల్‌ ఇన్వెస్టర్లు చేసే మరో ఘోర తప్పిదం యావరేజ్‌ చేయడం. ఒక స్టాకును కొని దాని ధర పతనమైతే మరలా కొన్ని కొని, ఇలా కొనుగోలు సరాసరి ధరను తగ్గించే యత్నం చేయడాన్ని యావరేజ్‌ చేయడమంటారు. కానీ క్వాలిటీ కంపెనీల విషయంలోనే ఈ సూత్రం వర్కవుటవుతుంది. అదైనా సంస్థాగత కారణాలతో ధర పతనమవుతుంటే అప్పుడు యావరేజ్‌ డౌన్‌ చేయడం పడిపోయే కత్తి కింద తలపెట్టడం లాంటిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గతేడాది స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో చాలా స్టాకులు 50 శాతానికి పైగా క్రాషయ్యాయి. వీటిలో కొన్ని బాగా పాపులర్‌ కంపెనీలున్నాయి. కానీ ఈ పాపులర్‌ కంపెనీల్లో కొన్ని సంస్థాగత కారణాలు, గవర్నె్‌న్స్‌ సమస్యలు, ఆడిటర్ల నిష్క్రమణ లాంటి సీరియస్‌ కారణాలతో డౌన్‌ట్రెండ్‌లోకి ప్రవేశించాయి. దీంతో వాటిలో పెట్టుబడులు పెట్టిన పలు ఎంఎఫ్‌లు ఒక్కమారుగా అమ్మేసి బయటపడ్డాయి. కానీ రిటైలర్లు మాత్రం యావరేజ్‌ డౌన్‌ చేసుకుంటూ చివరకు ట్రాప్‌లో ఇరుక్కుపోయారు. ఇలాంటి స్టాకుల్లో ‘హెచ్‌సీసీ, ఆర్‌నావల్‌, ఆర్‌కామ్‌, మోనెట్‌ ఇస్పాత్‌, రుచి సోయా, మన్‌పసంద్‌’ తదితరాలున్నాయి. కానీ ఇదే సమయంలో సూచీలతో పాటు పతనమైన హృతిక్‌ స్టాకులు మాత్రం వెంటనే కోలుకొని తిరిగి పరుగులు మొదలెట్టాయి. ఆ సమయంలో యావరేజ్‌ డౌన్‌ చేయకుండా హృతిక్‌ స్టాకులతో స్టెప్పు కలిపిఉంటే ఇప్పుడు మంచి లాభాలు సొంతమయ్యేవి. You may be interested

రెండోరోజూ రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు

Wednesday 3rd April 2019

స్టాక్‌ మార్కెట్లో రియల్టీ రంగ షేర్లు వరుసగా రెండో రోజూ ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ బుధవారం ట్రేడింగ్‌లో 2.50శాతం లాభపడింది. ఇండెక్స్‌ రెండురోజుల్లో 3శాతం పెరగ్గా, నెలరోజుల్లో ఏకంగా 21శాతం ర్యాలీ చేసింది. రియల్టీ రంగ షేర్లలో గోద్రేజ్‌ ప్రాపర్టీ షేరు నేటి ట్రేడింగ్‌లో 5శాతం ర్యాలీ చేసి రూ.937ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గతేడాది చివరి

ఆరు నెలల కనిష్టానికి తయారీ రంగ వృద్ధి

Wednesday 3rd April 2019

54.3 నుంచి 52.6కు నిక్కీ పీఎంఐ న్యూఢిల్లీ: దేశ తయారీ రంగ వృద్ధి మార్చి నెలలో ఆరు నెలల కనిష్ట స్థాయికి తగ్గింది. తయారీ రంగ వృద్ధిని తెలియజేసే... నిక్కీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) ఫిబ్రవరిలో 54.3గా ఉండగా, మార్చిలో 52.6 పాయింట్లకు తగ్గింది. 50 పాయింట్లకు పైన ఉంటే దాన్ని విస్తరణగానే చూస్తారు. పెరుగుదల జోరు బలహీనపడుతున్నట్టు ఇది తెలియజేస్తోందని పీఎంఐ నివేదిక పేర్కొంది. గత

Most from this category