STOCKS

News


ఈక్విటీల కంటే ఈ ఎన్‌సీడీలు మెరుగా...?!

Saturday 12th January 2019
personal-finance_main1547231939.png-23539

ఈక్విటీల్లో రాబడుల అవకాశాలు దీర్ఘకాలంలో మెరుగ్గా ఉంటాయనే విషయంలో ఎక్కువ మందికి సందేహం లేదు. కానీ, స్వల్ప కాలం, మధ్య కాలానికి రాబడుల విషయంలో రిస్క్‌ చాలా ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. ఏడాది, మూడేళ్ల కాలం కోసం కాస్త అధిక రాబడులు ఆశించే వారు కూడా మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. మరి వీరికి ప్రత్యామ్నాయంగా మెరుగైన రాబడి ఇచ్చే సాధనాలు ఏమున్నాయి? అని పరిశీలిస్తే... తాజాగా ఇష్యూ ప్రారంభించిన మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ ఎన్‌సీడీలు కనిపిస్తాయి. ఇవి 9 శాతానికి పైనే వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నాయి. దేశీయ కంపెనీలు ఎన్‌సీడీల రూపంలో 2018లో రూ.29,300 కోట్ల మేర నిధులను సమీకరించాయి. ఈ ఏడాది మరింత పెద్ద మొత్తంలో నిధుల సమీకరణ ప్రయత్నాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

ఎన్‌సీడీలు అంటే?
కంపెనీలు తమ విస్తరణ ‍ప్రణాళికల కోసం, మూలధన అవసరాలు, రుణాలు తగ్గించుకునేందుకు నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ)ల ఇష్యూలకు వస్తుంటాయి. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే అధిక రేటును ఆఫర్‌ చేస్తాయి. అదే సమయంలో అవి తీసుకునే రుణాలతో పోలిస్తే... ఎన్‌సీడీలపై ఇచ్చే రేటు కాస్త తక్కువగానే ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ ఎఫ్‌డీలపై ఇచ్చే వడ్డీ రేటు కేవలం 6.75 శాతం. 

 

భద్రత
ఎన్‌సీడీల్లో రిస్క్‌ ఎక్కువే ఉంటుంది. వీటికి క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలు రేటింగ్‌ కూడా ఇస్తుంటాయి. సంబంధిత ఎన్‌సీడీలో భద్రత ఎంత అన్నది రేటింగ్‌ తెలియజేస్తుంది. అందుకే ఎన్‌సీడీ ఆఫర్‌ డాక్యుమెంట్లను తప్పకుండా చదవాలి. అందులో రేటింగ్‌, ఆ రేటింగ్‌కు ఉండే రిస్క్‌ వివరాలు కూడా ఉంటాయి. ఒకటికి మించిన ఏజెన్సీలు రేటింగ్‌ ఇస్తే, కంపెనీలు అన్ని వివరాలను డాక్యుమెంట్లలో తెలియజేయాల్సి ఉంటుంది. వీటిల్లో సెక్యూర్డ్‌ ఎన్‌సీడీలు, అన్‌ సెక్యూర్డ్‌ ఎన్‌సీడీలు ఉంటాయి. సెక్యూర్డ్‌ ఎన్‌సీడీలు అయితే... కంపెనీ దివాలా దశకు వస్తే ఆస్తులను విక్రయించి వచ్చిన నిధులను ముందుగా సెక్యూర్డ్‌ ఎన్‌సీడీ హోల్డర్లకు చెల్లింపులు చేస్తారు. అన్‌ సెక్యూర్డ్‌ ఎన్‌సీడీల్లో ఈ హామీ ఉండదు. ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎన్‌సీడీకి ఏఏఏ స్టెబెల్‌ రేటింగ్‌ను కేర్‌ రేటింగ్స్‌, ఇండియా రేటింగ్స్‌ ఏజెన్సీలు ఇచ్చాయి. కానీ, ఇది అన్‌ సెక్యూర్డ్‌ ఎన్‌సీడీ. అయినప్పటికీ భద్రత అధికమేనని రేటింగ్‌ తెలియజేస్తుంది. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ ఆఫర్‌ చేస్తున్నది సెక్యూర్డ్‌ ఎన్‌సీడీ. 

 

స్థిరమైన రాబడులు కోరుకునే వారు వీటిని పరిశీలించొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తమ పెట్టుబడులను డైవర్సిఫై చేసుకునేందుకు ఇవి ఉపకరిస్తాయంటున్నారు. ఎన్‌సీడీలను స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్‌ చేస్తారు. కనుక తర్వాత స్టాక్‌ ఎక్సేంజ్‌ల ద్వారా అవసరమైతే అమ్ముకునేందుకు, కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏడాది లోపు విక్రయిస్తే మూలధన లాభాల పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ‘‘ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్‌ చేసే ముందు తమ పన్ను అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం రాబడుల పరంగా ఎన్‌సీడీలు మెరుగైన ఆప్షన్‌. పన్ను అనంతర రాబడులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి’’ అని లాడ్రప్‌ ఫైనాన్స్‌ ఎండీ రాఘవేంద్రనాథ్‌ సూచించారు. తక్కువ పన్ను పరిధిలో ఉన్న వారు వీటిని పరిశీలించొచ్చన్నారు.
 You may be interested

మరి అమెజాన్‌ పరిస్థితేంటి?

Saturday 12th January 2019

- బెజోస్‌ విడాకులతో కంపెనీ భవితపై నీలినీడలు - కంపెనీ మీద నియంత్రణాధికారాలపై సందేహాలు - అత్యంత సంపన్నురాలిగా మారనున్న మెకంజీ - బిల్‌గేట్స్‌ తరవాత రెండోస్థానంలోకి జెఫ్‌ బెజోస్‌ న్యూయార్క్‌: అమెరికా ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ విడాకుల వ్యవహారం కంపెనీ భవితవ్యంపై సందేహాలను రేకెత్తిస్తోంది. దాదాపు 136 బిలియన్‌ డాలర్ల బెజోస్‌ సంపదను భార్యభర్తలిద్దరూ ఎలా పంచుకుంటారు? కంపెనీలో బెజోస్‌ భార్య మెకెంజీకి కూడా ఆయనతో సమానంగా వాటా లభిస్తుందా?

కొత్త ఇన్వెస్టర్లు... స్టాక్‌ ఇన్వెస్టింగ్‌ ఎలా?

Saturday 12th January 2019

ఈ ప్రశ్న... కొత్తగా స్టాక్‌ మార్కెట్లలోకి అడుగు పెట్టే ప్రతీ ఇన్వెస్టర్‌ నుంచి ఎదురయ్యేదే. స్టాక్‌ మార్కెట్లో స్వల్ప కాలంలోనే భారీ లాభాలు, నష్టాలు వస్తాయని తెలుసు. కానీ, లాభాలు ఎలా, నష్టాలు ఎలా అన్నది వివరంగా తెలిసిన వారు కొద్ది మందే ఉంటారు. ‘స్టాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ను నేను ఎక్కడ ఆరంభించాలి...? నాకు ఏ మాత్రం విషయ జ్ఞానం లేదు...’ అంటూ ఓ ఔత్సాహిక ఇన్వెస్టర్‌ వేసిన ప్రశ్నకు... చార్టర్డ్‌

Most from this category