STOCKS

News


పెట్టుబడి నిరంతర ప్రక్రియ!

Saturday 15th December 2018
personal-finance_main1544876547.png-22975

ఇన్వెస్ట్‌మెంట్‌ అనేది ఒకసారి చేసి అపే ప్రక్రియ కాదు. మన మనుగడ బాగుండాలంటే నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగించాలి. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయని గుర్తించి పెట్టుబడి ప్రక్రియను మరవకుండా కొనసాగించాలి. అలాగే ఇన్వెస్ట్‌మెంట్‌కు లక్ష్యం తప్పనిసరి. లక్ష్యం లేకుంటే ఎంత కాలం మదుపు చేయాలి, ఎంత మొత్తం చేయాలన్న స్పష్టత ఉండదు. భవిష్యత్తు అవసరాలే లక్ష్యం అయితే ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా అధిక రాబడులను అందుకోవచ్చు. అదే స్వల్ప కాల అవసరాలు అయితే స్థిరమైన రాబడులను ఇచ్చే వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. లక్ష్యాలకు అనుగుణంగా మదుపు కొనసాగనప్పుడు అవసరాలకు తగిన నిధి సమకూరడం కష్టతరమవుతుంది. అందుకే ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి.  
ఆర్జనతో ఆరంభం
పెట్టుబడి అనేదిఆర్జనతోపాటే ప్రారంభం కావాలి. ఎంత ముందుగా మొదలైతే అవసరాలకు కావాల్సిన నిధిని అంత సులభంగా సమకూర్చుకోవచ్చు. అదే సమయంలో ఆర్థిక ప్రణాళికల విషయంలో పొరపాట్లకు అవకాశం లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఇన్వెస్ట్‌మెంట్‌ విజయవంతం అవుతుంది. పెట్టుబడులు అవసరాలను తీర్చేలా ఉండాలి. అవసరమైనప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకునే వెసులుబాటూ ఉండాలి. అధిక రిస్క్‌ పనికిరాదు. 

పెట్టుబడి పెట్టేందుకు సమయం కోసం వేచి చూడకూడదు. క్రమానుగతంగా పెట్టుబడి పెడుతూ వెళ్లడమే ఇన్వెస్టర్‌గా చేయాల్సింది. మార్కెట్‌ దిగువ స్థాయికి వచ్చినప్పుడే పెట్టుబడి పెట్టాలని కాచుక్కూర్చుంటే... అది ఎప్పుడు వస్తుంది...? ఏ స్థాయిలో స్థిరపడుతుందన్నది? గుర్తించలేకపోవచ్చు. గుర్తించేలోపే తిరిగి ధరలు పెరిగిపోవచ్చు. అదే సమయంలో గరిష్ట స్థాయిలోనే విక్రయించాలనుకోవడం కూడా అవగాహన రాహిత్యమే అవుతుంది. ఎందుకంటే ఇది గరిష్ట స్థాయి అని గుర్తించడం అన్ని వేళలా సాధ్యం కాదు? అందుకే క్రమానుగతంగా విక్రయించడం మొదలు పెట్టాలి. చక్కని పనితీరున్న వాటిల్లోనే పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన సరైనదే. కానీ, ఇందుకు గతేడాది కాలంలో అత్యుత్తమ పనితీరు చూపిన వాటిని ఎంచుకోకుండా ఐదేళ్లు, పదేళ్లు ఇలా దీర్ఘకాల పనితీరును పెట్టుబడులకు ప్రాథమిక సూత్రంగా తీసుకోవాలి. అప్పుడే నమ్మకమైన రాబడులకు అవకాశం ఉంటుంది.
వైవిధ్యభరితమైన పెట్టుబడి
పెట్టుబడికి షేర్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఇలా ఎంపిక ఏదైనా కానీయండి. కేవలం ఏదో ఒక అంశానికి పరిమితమై ఫలానా దానిలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవడం తప్పటడుగే అవుతుంది. ఉదాహరణకు అధిక వడ్డీ రేటు వస్తుందని కంపెనీ డిబెంచర్‌ కొనుగోలు చేశారనుకుందాం. కానీ, అవసరమైనప్పడు నగదుగా మార్చుకునే సౌలభ్యత తక్కువగా ఉంటుంది. పైగా డిబెంచర్‌ చెల్లింపుల్లో కంపెనీలు విఫలమయ్యే పరిస్థితీ రావచ్చు.

రాబడి హెచ్చుగా ఉంటుందని షేర్‌లో మదుపు చేశారనుకుందాం. దాని పనితీరు మార్కెట్‌ ఆటుపోట్లు, కంపెనీ యాజమాన్యం నిర్వహణ ఇలా ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే కాల వ్యవధి, ఆశిస్తున్న రాబడి, రిస్క్‌ సామర్థ్యం ఇలా ఎన్నో అంశాలనూ పరిశీలించిన తర్వాతే తగిన సాధనాలను ఎంచుకోవాలి.   పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకటే అస్సెట్‌ క్లాస్‌లో పెట్టరాదు. చాలా మందికి బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం అలవాటు. ఇందులో 6-7 శాతం మించి రాబడులు రావు. పెట్టుబడంతా తీసుకెళ్లి డెట్‌ మార్కెట్లో పెడితే, ఈక్విటీ, కమోడిటీ మార్కెట్లలో ఉన్న అవకాశాల ప్రయోజనాలను అందుకోలేరు. అందుకే పెట్టుబడుల్లో వైవిధ్యం (డైవర్సిఫికేషన్‌) అవసరం. అది కూడా అవసరమైనంతే.

స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, డిపాజిట్లు, బాండ్లు, ఇలా లెక్కకు మించిన సాధనాల్లో ఇన్వెస్ట్‌మెంట్లు ఉన్నాయనుకోండి. అప్పుడు డైవర్సిఫికేషన్‌ ఎక్కువైనట్టే. లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో కొంత పెట్టుబడులు పెట్టి, అదే సమయంలో బ్లూచిప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లోనూ పెట్టుబడి పెడితే అది డూప్లికేషన్‌ అవుతుంది. ఇలా లేకుండా చూసుకోవాలి. పెట్టుబడులకు వైవిధ్యం అవసరం కదా అని ఎక్కువ వాటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తే... వాటి పనితీరును ట్రాక్‌ చేయడం కష్టతరమవుతుంది. ఇక పెట్టుబడుల్లో భిన్నత్వం అన్నది ప్రతీ విభాగంలోనూ ఉండాలి. ఉదాహరణకు ఈక్విటీల్లో పెట్టుబడులన్నవి లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, మల్టీ క్యాప్‌ ఇలా అనమాట. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఈ తరహా డైవర్సిఫైడ్‌ పథకాలను ఆఫర్‌ చేస్తున్నాయి.​You may be interested

వచ్చే వారం ఎలా ఉండొచ్చు?

Saturday 15th December 2018

ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా వారాంతానికి దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి. దీంతో రాజకీయ అంశాలు మార్కెట్లపై తాత్కాలిక ప్రభావాన్ని మాత్రమే చూపుతాయని మరోమారు నిరూపితమైంది. ఈ వారం చివరకు నిఫ్టీ దాదాపు ఒక శాతం లాభంతో 10805 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారం 10333పాయింట్ల కనిష్ఠం నుంచి నిఫ్టీ దాదాపు 500 పాయింట్ల ర్యాలీ జరిపింది. అయితే ఇప్పటికీ నిఫ్టీ తాత్కాలిక టాప్‌ 10940 పాయింట్ల దిగువనే ఉంది. ఈ

క్రూడాయిల్‌ నేల చూపులు

Saturday 15th December 2018

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 60.28 డాలర్లకు దిగివచ్చింది. ఒపెక్‌, దాని మిత్ర దేశాలు ఉత్పత్తిలో కోత విధిస్తామని ప్రకటించినా క్రూడాయిల్‌ ధరలో జోరు రాలేదు. యూఎస్‌ షేల్‌గ్యాస్‌ ఉత్పత్తి పెరగడంతో ఒపెక్‌ కోత ప్రభావం ఉండదని, అందువల్ల వచ్చే ఏడాది డిమాండ్‌ పెద్దగా పెరగకపోవచ్చని ట్రేడర్లు భావించడంతో క్రూడాయిల్‌ ధర పెరగలేదు. పైగా గత వారంతో పోలిస్తే ఒక డాలర్‌ తగ్గింది. రోజూవారి ఉత్పత్తిలో 12 లక్షల

Most from this category