STOCKS

News


రూ.1కే బంగారం!!

Tuesday 18th December 2018
personal-finance_main1545122847.png-23045

బంగారంపై భారతీయులకు మక్కువ ఎక్కువే. గ్రాము బంగారం ధర ప్రస్తుతం దాదాపు రూ.3,200 ఉంది. ఏదైనా జువెలరీ ఔట్‌లెట్‌కు వెళ్లి బంగారం కొనుగోలు చేయాలంటే కనీసం రూ.3,200 వెచ్చించాలి. జువెలరీ షాపులలో గ్రాము కన్నా తక్కువ పరిమాణంలో బంగారాన్ని కొనుగోలు చేయడం వీలుపడకపోవచ్చు. అందువల్ల ఒకేసారి రూ.3 వేలకు పైగా పెట్టి బంగారం కొనుగోలు చేయాలంటే అందరికీ సాధ్య పడకపోవచ్చు. అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఒక్క రూపాయి దగ్గరి నుంచి బంగారాన్ని కొని దాచుకోవచ్చు. 

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ జోరు
సేఫ్‌గోల్డ్‌, ఆగ్మాంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌, పేటీఎం వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ బంగారం మార్కెట్‌లో వాటా పెంచుకునేందకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇవి సామాన్య ప్రజలకు చేరువ అయ్యేందుకు అతితక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలును ఆప్షన్స్‌ను అందుబాటులో ఉంచాయి. ఆగ్మాంట్‌ ప్లాట్‌ఫామ్‌ బంగారం, వెండి నాణేలను, బార్స్‌ విక్రయిస్తోంది. 100 మిల్లీగ్రాముల నుంచి కొనుగోలు చేయవచ్చు. రిటైల్‌ ఔట్‌లెట్స్‌తో పోలిస్తే తక్కువ పరిమాణంలో, ఆమోదయోగ్యమైన ధరకే ఆన్‌లైన్‌లో బంగారం అందుబాటులో ఉండటం వల్ల ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోందని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ సేఫ్‌గోల్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ మాథూర్‌ పేర్కొన్నారు. యువత ఇప్పుడు స్టోర్లకు వెళ్లడం కన్నా ఈ-కామర్స్‌ సైట్స్‌, యాప్స్‌ ద్వారా బంగారం కొనుగోలు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నాయని తెలిపారు. దీని వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. ‘ఈ-కామర్స్‌ మార్కెట్‌లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భవిష్యత్‌లో బంగారం కొనుగోలు విషయానికి వస్తే డిజిటల్‌ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది’ అని ఆగ్మాంట్‌ డైరెక్టర్‌ సచిన్‌ కొఠారి తెలిపారు. 

ఆన్‌లైన్‌లో కొనుగోలు చాలా సులభం
ఒక్క రూపాయి చెల్లించి బంగారాన్ని కొనుగోలు చేసే వారు చాలా మందే ఉన్నారని గౌరవ్‌ మాథూర్‌ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే యాప్‌తో ఇది భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘కనీసం రూపాయి చెల్లించి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. రూపాయికి సమానమైన పరిమాణంలోని బంగారం మీ అకౌంట్‌లో జమవుతుంది. ఇలా మీరు ఎన్ని సార్లు కొంటే అన్ని సార్లు మీ బంగారం మీ అకౌంట్‌లో జమవుతూ ఉంటుంది. మీ అకౌంట్‌లోని బంగారం పరిమాణం ఒక గ్రాముకు సమానమైనప్పుడు మీ గ్రాము బంగారం మీకు డెలివరీ అవుతుంది’ అని గౌరవ్‌ మాథూర్‌ తెలిపారు. ప్రస్తుతం గ్రాము బంగారం ధర దాదాపు రూ.3,200 ఉంది. ‘బయట మార్కెట్‌లో బంగారం కొనుగోలు చేయాలంటే కనీసం ఒక గ్రాము కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే ఆన్‌లైన్‌లో అయితే ఒక్క రూపాయితో కూడా కొనేయచ్చు. అలాగే సులభంగా ఆన్‌లైన్‌లో బంగారం కొనొచ్చు. సరళ లావాదేవీలు మరొక సానుకూల అంశం’ అని గౌరవ్‌ మాథూర్‌ పేర్కొన్నారు. గతేడాది సేవలు ప్రారంభించామని, 30 లక్షల మంది తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేశారని, వీరి సంఖ్యను వచ్చే ఏడాదిలో 1.5 కోట్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. 

పసిడి వన్నె తగ్గుతోంది..
బంగారం వినియోగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో పుత్తడి డిమాండ్‌ ఇటీవల కాలంలో తగ్గుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోన్న పలు చర్యలు, ఆకాశన్నంటే ధరలు, యువత బంగారం వైపు పెద్దగా ఆకర్షితులు కాకపోవడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం. బంగారం డిమాండ్‌ క్షీణిస్తున్న నేపథ్యంలో జువెలర్లు.. కస్టమర్లను ఆకర్షించేందుకు ఆన్‌లైన్‌ బాట పడుతున్నారు. వాణిజ్య లోటు తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల బంగారం దిగుమతులు తగ్గుతున్నాయి. మన దేశం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటోన్న విషయం తెలిసిందే. 2010లో బంగారానికి అధిక డిమాండ్‌ నమోదయ్యింది. అప్పటి నుంచి చూస్తే గతేడాది బంగారం డిమాండ్‌ దాదాపు 23 శాతం మేర పడిపోయింది. 



You may be interested

పతనానికి ముందు పెట్టుబడులు?

Tuesday 18th December 2018

ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఎల్‌ఐసీ నిర్ణయాలు ఇటీవల కాలంలో భారీగా పతనమైన పలు స్టాకుల్లో సదరు పతనానికి కాస్త ముందుగా ఎల్‌ఐసీ భారీగా వాటాలు కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి చిన్న కంపెనీల్లో పెద్దగా పెట్టుబడులు పెట్టకూడదని ఎల్‌ఐసీ నిర్ణయించుకుంది. కానీ ఈ నిర్ణయానికి భిన్నంగా కొన్ని చిన్న కంపెనీల్లో వాటాలు పెంచుకోవడం, వెనువెంటనే సదరు స్టాకులు క్రాష్‌ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఇలా ఎల్‌ఐసీ అనూహ్య పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో

ఐటీ షేర్లకు రూపీ పోటు

Tuesday 18th December 2018

డాలర్ల రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లకు మంగళవారం రూపీ పోటు తగిలింది. ఎన్‌ఎస్‌ఈ ఎక్చ్సేంజ్‌లో అధిక వెయిటేజీ కలిగిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 1.50శాతం నష్టపోయింది. డాలర్‌ మారకంలో రూపాయి రికవరి ఇందుకు కారణమైంది. ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ రేట్ల సమావేశ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో డాలర్‌ బలహీన ట్రేడింగ్‌ దేశీయ రూపాయికి కలిసొస్తుంది. ఫలితంగా ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 71.16స్థాయిని బలపడింది.

Most from this category