STOCKS

News


ఐఓబీ వడ్డీరేట్లు పెరిగాయ్‌

Saturday 10th November 2018
personal-finance_main1541828880.png-21849

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌(ఐఓబీ) బెంచ్‌ మార్క్‌ లెండింగ్‌రేట్‌ను 5 బేసిస్‌ పాయింట్లు పెంచింది.దీంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్‌డ్‌ లెండింగ్‌రేట్‌(ఎమ్‌సీఎల్‌ఆర్‌)ను 0.05 శాతం పెంచుతున్నామని ఐఓబీ తెలిపింది. ఈ పెరుగుదల నేటి(శనివారం) నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. రెండేళ్ల కాల పరిమితి ఉన్న రుణాలపై వడ్డీరేటు 8.8 శాతం నుంచి 8.85 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. అలాగే మూడేళ్ల రుణాలపై వడ్డీ రేట్లు 8.95 శాతానికి పెరుగుతుందని వివరించింది. బేస్‌ రేట్‌కు ప్రత్యామ్నాయంగా ఎమ్‌సీఎల్‌ఆర్‌ విధానాన్ని ఆర్‌బీఐ 2016, ఏప్రిల్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానంలో బ్యాంక్‌లు కొత్త రుణాలను ఈ రేటు కంటే తక్కువకు ఇవ్వడానికి లేదు. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్ కూడా ఎమ్‌సీఎల్‌ఆర్‌ను పెంచింది. ఎమ్‌సీఎల్‌ఆర్‌ను 0.15 శాతం పెంచామని, ఈ పెంపు నేటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. 



You may be interested

అమరరాజా మధ్యంతర డివిడెండు 200 శాతం

Saturday 10th November 2018

అమరరాజా బ్యాటరీస్‌ సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.127 కోట్ల నుంచి రూ.120 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.1,440 కోట్ల నుంచి రూ.1,767 కోట్లకు ఎగసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2 మధ్యంతర డివిడెండు చెల్లించాలని నిర్ణయించింది. డిసెంబరు 9 లోగా ఈ మొత్తాన్ని చెల్లించనుంది. రూ.540 కోట్ల మూలధన వ్యయానికి బోర్డు సమ్మతించింది. ఈ

ఎన్‌హెచ్‌పీసీ షేర్ల బైబ్యాక్‌

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జలవిద్యుదుత్పత్తి కంపెనీ ఎన్‌హెచ్‌పీసీ... షేర్లను బైబ్యాక్‌ చేసే అవకాశాలున్నాయి. ఈ నెల 14న(వచ్చే బుధవారం) జరిగే బోర్డ్‌ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. అయితే ఎన్ని షేర్లను ఎంత సంఖ్యలో కొనుగోలు చేసేదీ, ఎంత మొత్తానికి కొనుగోలు చేసేది తదితర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి ఎన్‌హెచ్‌పీసీలో కేంద్ర ప్రభుత్వానికి 73.67 శాతం వాటా ఉంది.

Most from this category