STOCKS

News


ఫారం 26ఏఎస్‌ తప్పుల తడకైతే.. 

Monday 6th August 2018
personal-finance_main1533530900.png-18975

ఆదాయ పన్ను శాఖ నిర్వహించే వెబ్‌సైట్‌లో మీకు సంబంధించిన ఆదాయ పన్నుల రికార్డును ఫారం 26ఏఎస్‌ అంటారు. మీరు చెల్లించే టీడీఎస్‌, అడ్వాన్స్‌ ట్యాక్స్‌, సెల్ఫ్‌ అస్సెస్‌మెంట్‌ ట్యాక్స్‌ ఈ రికార్డులో నమోదవుతుంది. స్వయంగా చెల్లించే ముందస్తు పన్ను, ఆ తరువాత సెల్ఫ్‌ అస్సెస్‌మెంట్‌ ట్యాక్స్‌ వివరాలతో పాటు మీ పేరు, చిరునామా, పాన్‌ కార్డ్‌ నెంబర్‌ వివరాలు ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు బ్యాంకులో జమచేసిన మొత్తం ఆ బ్యాంకు సిబ్బంది సాఫ్ట్‌వేర్‌ ద్వారా డిపార్ట్‌మెంట్‌కు చేరవేయడం ద్వారా వివరాలు ఈ రికార్డులో వెంటనే నమోదవుతుండగా.. టీడీఎస్‌, టీసీఎస్‌ వివరాలు మాత్రం తత్సంబంధిత అధికార కేంద్రాల ద్వారా అప్‌లోడ్‌ అవుతాయి. ఈ క్రమంలో ఎన్నో తప్పులు జరగడం పరిపాటిగా మారిపోయింది. నైపుణ్యత లేని సిబ్బంది, పని ఒత్తిడి లాంటి అనేక కారణాల వల్ల తప్పులు జరుగుతూనే ఉన్నాయి. 

తప్పులు ఏవైవుండచ్చు...
♦ పాన్‌ నెంబర్‌ తప్పు రాయడం
♦ టాన్‌ నెంబర్‌ తప్పు రాయడం
♦ చలాన్‌ నెంబర్‌ సరిగ్గా రాయకపోవడం
♦ డేటా ఎంట్రీలో తప్పులు
♦ తప్పు చలాన్‌ కట్టడం
♦ పూర్తి సమాచారం లేకపోవడం
♦ తప్పుడు సమాచారం
♦ జమ చేసిన మొత్తం/చెల్లించిన మొత్తంలో తప్పులు రాయడం
♦ చివరి 3 నెలలు పన్ను రికవరీ చేసి ఆ సమాచారంతో పాటు కేవలం 3 నెలల జీతం/పెన్షన్‌ మాత్రమే అప్‌లోడ్‌ చేసి మిగిలిన 9 నెలల ఆదాయం వివరాలు అప్‌లోడ్‌ చేయకపోవడం
♦ 194సీ, 194జే వంటి సెక్షన్‌ వివరాలు తప్పులు రాయడం
♦ మినహాయింపులు, తగ్గింపు విషయాలను ప్రస్తావించకుండా పూర్తి ఆదాయాన్ని రాసి.. ఫారం 16లో నికర ఆదాయం రాయడం వల్ల ఈ రెండూ ఒకదానితో ఒకటి కలవకపోవడం..
ఇలాంటివి అనేక తప్పులు రావడం సర్వసాధారణంగా మారిపోయినందున మీరు రిటర్నులు దాఖలుచేసే రోజున ఫారం 26ఏఎస్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఒకసారి సరిచూసుకోవడం మంచిది. 

వివరాలు సరిగా లేకపోతే...
♦ డిడక్టర్‌, యజమాని, బ్యాంకు, ఇతరుల వద్దకు వెళ్లి తప్పులు సరిదిద్దించండి
♦ అసలు ఆ వ్యవహారాలు మీవేనేమో చూడండి
♦ రెండు సార్లు పేమెంట్లు ఉన్నాయోమో చూసుకోండి
♦ మీరు చెల్లించినవి నమోదైనవో లేదో చూడండి
♦ ఏ మాత్రం తేడా ఉన్నా వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి సరిదిద్దుకోండి
మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అన్నీ సరిగ్గా ఉండి.. ఫారం 26ఏఎస్‌లో ఆ వివరాలు అప్‌లోడ్‌ కాకపోతే గడువుతేదీ వరకు వేచి ఉండకండి. అన్ని కాగితాలు సమకూర్చుకుని, సరిదిద్దుకుని, సరిచేసుకుని రిటర్నులు వేయండి.. 

తప్పు దిద్దుకోడానికి మూడు సూత్రాలు.. 
1. డిడెక్టర్‌ని సంప్రదించండి
2. టిన్‌ కాల్‌ సెంటర్‌, నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌, 3 ఫ్లోర్‌, సఫైర్‌ ఛాంబర్స్ బనీర్‌ టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ సమీపం, పూణే - 411045 అడ్రస్‌ను ఆశ్రయించండి. 020– 27218080 నెంబర్‌కు కాల్‌ చేయండి. టిన్‌ఇన్‌ఫో@ఎన్‌ఎస్‌డీఎల్‌ డాట్‌ కో డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌ను ద్వారా సంప్రదించవచ్చు.
3. ఆన్‌లైన్‌ ద్వారా కానీ స్వయంగా అధికారులను కానీ అభ్యర్థించండి. వాళ్లు మీకు కలిగిన ఇబ్బంది గురించి వింటారు. మీకు ఉపశమనం దొరుకుతుంది.



You may be interested

నెలలో 12 శాతం రాబడి అందించే స్టాక్స్‌..

Monday 6th August 2018

మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు కొంగొత్త స్థాయిలను తాకాయి. మరి ఇలాంటప్పుడు ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదనే ఆలోచన మీకు వచ్చే ఉంటుంది. ఒక నెలలో 6-12 శాతం రాబడి అందించే 9 స్టాక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు మార్కెట్‌ నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం..  అనలిస్ట్‌: ఏంజెల్‌ బ్రోకింగ్‌ (డేరివేటివ్స్‌, టెక్నికల్స్‌) చీఫ్‌ అనలిస్ట్‌ సమీత్‌ చావన్‌ స్టాక్‌: అరవింద్‌ ప్రస్తుత ధర: 432 టార్గెట్‌ ప్రైస్‌: రూ.469 స్టాప్‌ లాస్‌: రూ.

మిడ్‌క్యాప్‌లో మంచి ట్రాక్‌ రికార్డు 

Monday 6th August 2018

ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఫండ్‌ మిడ్‌ క్యాప్‌ విభాగం రిస్క్‌ అధికంగా ఉన్నా, దీర్ఘకాలంలో అధిక రాబడులను ఇచ్చే సామర్థ్యం కలది. ఈ విభాగంలో కాస్తంత భద్రత, అదే సమయంలో స్థిరమైన రాబడులను అందించే పథకాల్లో ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఫండ్‌ కూడా ఒకటి. కనీసం ఐదేళ్లు, ఆపై కాల వ్యవధి కోసం, మెరుగైన రాబడులను ఆశించే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఈ పథకం ప్రారంభించి 25 ఏళ్లు అయింది.

Most from this category