News


ఎంటర్‌ప్రెన్యూర్లకు జెఫ్‌బెజోస్‌ సలహాలు

Saturday 8th June 2019
personal-finance_main1559988083.png-26179

కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారుతున్నవారికి ప్రపంచ కుబేరుడు జెఫ్‌బెజోస్‌ రెండు సలహాలు ఇస్తున్నారు. కస్టమర్‌ను మర్చిపోవద్దని, అపజయాలకు కుంగిపోకుండా ఎదుర్కోవడం నేర్చుకోవాలని ఆయన చెబుతున్నారు. అమెజాన్‌ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారవేత్తకు కస్టమర్‌ పట్ల ఎక్కువ ధ్యాస ఉండడమే చాలా ముఖ్యమైన అంశమని ఆయన చెప్పారు. కస్లమర్లను సంపూర్ణంగా ఎలా సంతృప్తి పరచాలో తెలుసుకోవాలని సూచించారు. అమెజాన్‌ తన కస్టమర్లను నిలుపుకోవడానికి చాల ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. ఒక్కోసారి ఉత్పత్తిపై నష్టం వస్తున్నా కస్టమర్‌ కోసం ఆఫర్‌ కొనసాగిస్తుంటుంది. ప్రస్తుతం కంపెనీకి దాదాపు 10 కోట్లకుపైగా పెయిడ్‌ చందాదారులున్నారు.

కస్టమర్‌ సంతృప్తితో పాటు వ్యాపారవేత్త నేర్చుకోవాల్సిన మరో కీలక అంశం అపజయాలకు సిద్ధంగా ఉండడమని బెజోస్‌ చెప్పారు. అందరికన్నా ముందు
ఉండాలంటే వ్యాపారంలో ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాలని, ఒకోకమారు ఇలాంటి నిర్ణయాలు ఫెయిల్‌కావచ్చని చెప్పారు. అలాంటప్పుడు కుంగిపోకుండా, రిస్కంటే ఇదేనని భావించి ముందుకు సాగాలన్నారు. క్రికెట్‌లో సిక్సర్‌ కొట్టేందుకు డేర్‌ చేసినప్పుడు ఔటయ్యే ఛాన్సు కూడా ఉంటుందన్నారు. పెద్ద విజయాలు ఆశించినప్పుడు రిస్కులు కూడా భారీగానే ఉంటాయని, రెండిటినీ ఒకేలా తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఒక ప్రాజెక్టుపై పూర్తి నమ్మకం లేనప్పుడు ఆ వ్యాపారంలోకి దిగడం మంచిది కాదని చెప్పారు. మనం చేసే వ్యాపారంపై మనకు మమకారం ఉండాలని, అప్పుడే దాన్ని వృద్ది చేయగలమని చెప్పారు.

 



You may be interested

జూలైలోనే ఫెడ్‌ రేట్ల తగ్గింపు?!

Saturday 8th June 2019

మేలో యూఎస్‌ ఉద్యోగ గణాంకాలు బలహీనంగా ఉండడంతో జూలై సమీక్షలో ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఒకపక్క ప్రధాన వాణిజ్య భాగస్వామ్యులతో ట్రంప్‌ పేచీలు పడుతున్న సమయాన జాబ్‌ రిపోర్ట్‌ బలహీనంగా రావడంతో ఫెడ్‌ రేట్‌కట్‌కు తొందరపడవచ్చని అంచనా వేస్తున్నారు. మేలో పేరోల్స్‌లో 75వేల పెరుగుదల కనిపించింది. ఇది అంచనాల కన్నా తక్కువగా ఉంది. బ్లూమ్‌బర్గ్‌ సర్వేలో నిపుణులు పేరోల్స్‌ పెరుగుదల 1,75,000 వరకు ఉంటుందని అంచనా

నెమ్మదిగా కొనసాగుతున్న రేట్‌కట్‌ బదిలీ

Saturday 8th June 2019

ఆర్‌బీఐ ప్రకటిస్తున్న వడ్డీరేట్ల తగ్గింపు బ్యాంకుల ద్వారా కస్టమర్లకు చాలా నెమ్మదిగా చేరుతోందని కోటక​ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. ఆర్‌బీఐ ఆశించినంత వేగంగా రేట్‌కట్‌ బదిలీ జరగడం లేదని పేర్కొంది. అయితే నెమ్మదిగానైనా రేట్ల తగ్గింపు కస్టమర్లకు బదిలీ అవుతున్నందున ఈ ఏడాది కస్టమర్లకు అందే రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయని తెలిపింది.  ఆర్‌బీఐ గణాంకాలు పరిశీలిస్తే టర్మ్‌ డిపాజిట్‌ రేట్లలో పెద్దగా మార్పు కనిపించలేదు. 2017 నవంబర్‌ 2018 మార్చి

Most from this category