STOCKS

News


ఫలితాల వేళ ఎలా ట్రేడ్‌ చేయాలి?

Tuesday 14th May 2019
personal-finance_main1557827700.png-25736

ఎడెల్‌వీజ్‌ సలహాలు
దేశీయ సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఫలితాలు వస్తాయి. తొలుత స్థిర ప్రభుత్వం వస్తుందన్న అంచనాలతో జోరు చూపిన మార్కెట్లు ప్రస్తుతం అస్థిర ప్రభుత్వ భయాలతో పతనమవుతున్నాయి. ముఖ్యంగా ఎన్‌డీఏ, యూపీఏలకు పూర్తి మెజార్టీ రాక, ఇతర పక్షాలపై ఆధారపడాల్సిన అవసరం వస్తుందన్న భయాలు మార్కెట్‌ను కుంగదీస్తున్నాయి. ఫలితాల సమయంలో ఈ భయాలు బాగా పెరిగిపోతాయి. ఫలితాల రోజున సూచీల్లో తీవ్ర కదలికలు నమోదవుతుంటాయి.

ఈ నేపథ్యంలో ఎవరికి ఎక్కువ ఛాన్సులున్నాయో? ఎవరు గెలిస్తే మార్కెట్‌ ఎలా ప్రవర్తిస్తుందో? ఎవరి గెలుపును దృష్టిలో ఉంచుకొని ఎలాంటి వ్యూహం అవలంబించాలో? అన్న విషయాలపై ఎడెల్‌వీజ్‌ సూచనలు ఇలా ఉన్నాయి.


- ఎన్‌డీఏ ఆధ్వర్యంలో స్థిర ప్రభుత్వం: అవకాశాలు అధికం. మార్కెట్లు 10 శాతం ర్యాలీ జరపవచ్చు. ఆప్షన్స్‌లో ఒడిదుడుకులు దిగివస్తాయి. నిఫ్టీ 12500 పాయింట్లను తాకవచ్చు. ఈక్విటీ ఎంఎఫ్‌ల వద్ద నగదు నిల్వలు బాగా ఉన్నందున కొనుగోళ్లకు దిగుతాయి. ఎన్‌డీఏ గెలుస్తుందన్న అంచనా ఉన్నవారు ఈ సమయంలో బుల్‌ కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించడం ఉత్తమం. 


- థర్డ్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం: అవకాశాలు స్వల్పం. మార్కెట్లు 10- 12 శాతం పతనమవుతాయి. ఇలాంటి ప్రభుత్వాలు ఐదేళ్లు నిలవకపోవచ్చు. ఈ అస్థిరత భయాలు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇలాంటి పరిస్థితి ఊహించేవాళ్లు ఇప్పుడే సరైన హెడ్జింగ్‌ వ్యూహ్యాన్ని ఎంచుకోవాలి. ఇందుకోసం జూన్‌ సీరిస్‌కు చెందిన సరైన పుట్‌ను కొనుగోలు చేయవచ్చు. 


- యూపీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం: అవకాశాలు అత్యంత స్వల్పం. మార్కెట్లు స్తబ్దుగా ఉంటాయి. స్వల్పంగా పాజిటివ్‌ ధోరణి ఉండొచ్చు. కచ్ఛితమైన స్టాప్‌లాస్‌లతో పొజిషన్లు కొనసాగించవచ్చు. 

 

 



You may be interested

తొమ్మిది రోజుల నష్టాలకు బ్రేక్‌

Tuesday 14th May 2019

227 పాయింట్లు పెరిగి సెన్సెక్స్‌ 11200లపై ముగిసిన నిఫ్టీ మార్కెట్‌ తొమ్మిదో రోజుల వరుస నష్టాలకు మంగళవారం ముగింపు పడింది. సెన్సెక్స్‌ 227 పాయింట్లు లాభపడి 37,318 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 11200ల పైన 11,222 వద్ద ముగిసింది. గత తొమ్మిది ట్రేడింగ్‌ సెషన్స్‌లో సూచీల వరుస పతనం కారణంగా అధిక షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గచూపారు. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 18పైసలు రికవరి

రికవరి బాటలో ఫార్మా షేర్లు

Tuesday 14th May 2019

గత ట్రేడింగ్‌ సెషన్‌లో భారీగా నష్టాలను చవిచూసిన ఫార్మా స్టాకులు మంగళవారం స్థిరమైన లాభాల్ని ఆర్జిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ ఫార్మా ఇండెక్స్‌ నేడు 2శాతం లాభపడింది. ఔషధ ధరల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై భారత్‌కు చెందిన సుమారు 20 కంపెనీలపై అమెరికాలోని 44 రాష్ట్రాలు కేసలు నమోదు చేయడంతో నిన్న ట్రేడింగ్‌లో తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ట్రేడింగ్‌ ప్రారంభం

Most from this category