STOCKS

News


ముంచుకొస్తున్న ఐదు సంక్షోభాలు

Wednesday 2nd January 2019
personal-finance_main1546421980.png-23371

ఈ ఏడాది ఎకానమీల్లో తీవ్ర ఇబ్బందులకు అవకాశం
చేతిలో వీలయినంత నగదు ఉంచుకోవడం ఉత్తమం
నిపుణుల సలహా
అంతర్జాతీయంగా ఉద్దీపనల ఉపసంహరణ వేగవంతమవుతున్న వేళ మార్కెట్లలో భయాలు పెరిగిపోతున్నాయి. ఉద్దీపనల ఉపసంహరణ పరిణామాలు మరిన్ని ప్రతికూలాంశాలకు దారి తీస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు డౌన్‌సైడ్‌ షాకులు తట్టుకునేందుకు తయారుగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఒకదాని కారణంగా ఒకటిలాగా ఐదు అంశాలు మార్కెట్లలో ప్రత్యక్షమవుతుంటాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి అంతఃసంబంధం కలిగి మొత్తం వ్యవస్థను అతలాకుతలం చేస్తాయి.
1. తొలి మెట్టు: ముందుగా స్టాకులు, బాండ్లు, ఆస్తులు మరియు వీటి డెరివేటివ్స్‌ విలువ క్షీణిస్తుంది. దీంతో మార్జిన్‌ కాల్స్‌ ట్రిగ్గరవుతాయి. దీంతో పొజిషన్లు నిలుపుకునేందుకు, విలువ కాపాడేందుకు మరిన్ని నిధులను వెచ్చించాల్సివస్తుంది. దీంతో లిక్విడేషన్‌ మందగించి ఇతర సెక్యూరిటీలు సైతం ప్రభావితమవుతాయి. లిక్విడిటీ సమస్య పెరిగిన కొద్దీ భారీ పతనాలు నమోదవుతుంటాయి. ఈ పతనం ఆగకుండా దిగువ స్థాయిల్లో ఒక సమతుల్య స్థాయి సాధించే వరకు కొనసాగుతుంది.
2. హెడ్జింగ్‌ ఇక్కట్లు: డెరివేటివ్స్‌ విలువ వేగంగా పతనమవుతుంటే దీన్ని తట్టుకునేందుకు ఇన్వెస్టర్లు షార్ట్స్‌ చేయడం, పుట్స్‌ కొనడం చేస్తుంటారు. మార్కెట్‌ పరిస్థితులు పూర్తి గందరగోళంగా మారితే ఇన్వెస్టర్లు ఇతర సెక్యూరిటీలు, కరెన్సీలు, కమోడిటీలవైపు భద్రత కోసం చూస్తారు. దీంతో వీటిలో కూడా లిక్విడిటీ సంక్షోభం అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. 
3. సావరిన్‌ సంక్షోభం: బ్యాంకులు, ఇతర విత్త సంస్థల్లో హెడ్జింగ్‌ కారణంగా ఇక్కట్లు ప్రారంభం కాగానే ఈ సంక్షోభం క్రమంగా సార్వభౌమత్వ(సావరిన్‌) రిస్కుగా మారుతుందది. 2007 నుంచి బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనడం ఎక్కువైంది. యూఎస్‌ ఫెడ్‌ చేపట్టిన క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ లాంటి కేంద్ర బ్యాంకుల పథకాలతో విత్త సంస్థలు కేంద్ర బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేశాయి. ప్రభుత్వ సెక్యూరిటీలను రిస్కు ఫ్రీగా భావించి వాటి హెడ్జింగ్‌కు కనీస మొత్తాలను కూడా కేటాయించకుండా వదిలేయడం జరిగింది. దీని వల్ల మంచి ఆర్‌ఓఈ వచ్చింది కానీ ఎప్పుడైతే రేట్లు పెరగడం ఆరంభమైందో బ్యాంకులకు నష్టాలు మొదలయ్యాయి. ఇవి కొనుగోలు చేసిన సెక్యూరిటీల విలువ పరిరక్షిస్తూ వీటికి తగిన లిక్విడిటీ సమకూర్చాల్సి రావడంతో ప్రభుత్వాలపై సావరిన్‌ ఒత్తిళ్లు బాగా పెరిగాయి. ముఖ్యంగా యూరప్‌లో ఈ సమస్య బాగా కనిపించింది. ఉదాహరణకు ఇటలీ బ్యాంకులు దాదాపు 40000 కోట్ల యూరోల విలువైన బాండ్లను కలిగిఉన్నాయి. ఎప్పుడైతే అక్కడ రేట్లు పెరిగాయో బ్యాంకులకు ఇక్కట్లు ఎక్కువయ్యాయి. ఒక దేశం దివాలా తీయడం జరగదు కానీ ఈ ఒత్తిడి కారణంగా ఆ దేశ కరెన్సీ పడిపోవడం, సావరిన్‌ రేటింగ్‌ కోతకు గురవడం జరుగుతుంది. ఇవి ఆ దేశ కేంద్ర బ్యాంకుకు మరిన్ని కష్టాలు తెస్తాయి. అనుకున్న విధంగా ఎకానమీని ఆదుకోనీయకుండా సావరిన్‌ రిస్కులు సెంట్రల్‌ బ్యాంకులను నిస్సహాయంగా మారుస్తాయి.
4. ఇంటర్మీడియరీ ఇబ్బందులు: పైన చెప్పిన సంక్షోభాలన్నీ మార్కెట్లో పూర్తిగా లిక్విడిటీని తుడిచిపెడతాయి. క్రెడిట్‌ లభ్యత క్షీణిస్తుంది. ఒక బ్యాంకు పరిస్థితి బలహీనపడితే ఆటోమేటిగ్గా అది దానితో సంబంధాలున్న ఇతర విత్త సంస్థల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. దీంతో ఒకదానితో ఒకటి సంబంధాలు పెట్టుకునేందుకు విత్త సం‍స్థలు భయపడతాయి. ఇది లిక్విడిటీని పూర్తిగా ఆవిరి చేస్తుంది. దీంతో బ్యాంకుల నష్టాలు పెరిగిపోతాయి. దీంతో డివిడెండ్లు తగ్గిపోతాయి. ఇది ఇన్వెస్టరు రాబడిని తగ్గిస్తుంది. దీంతో భారీగా సదరు షేరును అమ్మడం మొదలవుతుంది. ఈ పరిస్థితిలో బ్యాంకుపై నమ్మకం పోవడంతో కొత్త క్యాపిటల్‌ సమీకరణ జరగదు. ఇది పరిస్థితిని పూర్తిగా క్షీణింపజేస్తుంది.
5. ఎకానమీలో నిజ సంక్షోభం: పైన చెప్పిన ఇబ్బందులు, సమస్యలు అన్నీ కలిసి పూర్తిస్థాయిలో ఆర్థికవ్యవస్థను దెబ్బతీస్తాయి. బ్యాంకులతో పాటు ఇతర కంపెనీల బాలెన్సు షీట్లు సైతం తలకిందులవుతాయి. అప్పులు తీర్చుకోవడానికి ఉన్నపాటున ఆస్తులు అమ్మడం ఆరంభమై ఆస్తుల ధరలు భారీగా పతనమవుతాయి. ఎంత చేసిన లిక్విడిటీ చాలకపోవడంతో ఎకానమీ మందగిస్తుంది. బ్యాంకులకు ప్రభుత్వం సాయం చేయాల్సిన పరిస్థితి మరలా తలెత్తుంది. సంక్షోభ పరిష్కారానికి తగిన పాలసీలు కనిపించవు. దీంతో ఆర్ధిక వ్యవస్థ అస్థ
వ్యస్థం అవుతుంది.
ఈ దశలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇదే వరుసలోకాకపోయినా కాస్త అటుఇటుగా మరోమారు ఆరంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వీలయినంత క్యాపిటల్‌ను చేతిలో ఉంచుకోవడమే ఉత్తమమార్గమని సలహా ఇస్తున్నారు. You may be interested

36 వేల దిగువకు సెన్సెక్స్‌

Wednesday 2nd January 2019

10800దిగువకు నిఫ్టీ సూచీలను దెబ్బతీసిన మెటల్, అటో షేర్ల పతనం అటో, మెటల్‌ రంగ షేర్ల పతనంతో బుధవారం మార్కెట్‌ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్‌ 36వేల మార్కును, నిఫ్టీ 10800 స్థాయిని కోల్పోయింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న మన మార్కెట్‌ నేడు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి క్రమంగా నష్టాలను నమోదు చేసింది.డిసెంబర్‌లో వాహన విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడం అటో రంగ షేర్లు, చైనా ఉత్పాదక రంగం క్షీణించడంతో

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Wednesday 2nd January 2019

మార్కెట్‌ పతనంలో భాగంగా బుధవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంక్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో 1శాతానికి పైగా నష్టపోయింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల పతనం ఇండెక్స్‌ను దెబ్బతీసింది. మధ్యాహ్నం గం.2:45ని.కు ఇండెక్స్‌ గత ముగింపు(27,392.40)తో పోలిస్తే అరశాతానికి పైగా నష్టపోయి 27,190.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.50శాతం నష్టపోయింది.

Most from this category