పెన్షన్ సమస్య? పరిష్కారముంది..
By Sakshi

మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్నారా? మీకు పెన్షన్‌కు సంబంధించి ఏమైనా సమస్యలున్నాయా? మీ సమస్యను ఫిర్యాదు చేసినా అది పరిష్కారం కాలేదా? ప్రభుత్వ విభాగం కానీ, బ్యాంక్ ఉద్యోగులు కానీ స్పందించడం లేదా? లేకపోతే సమస్యను ఎవరికి తెలియజేయాలో తెలియడం లేదా? అయితే మీరు www.pensionersportal.gov.in వెబ్సైట్ చూడండి. ఇందులో మీ సమస్యను ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ మీరు చేసిన ఫిర్యాదు సంబంధిత విభాగానికి చెందిన సీనియర్ అధికారులకు వెళుతుంది. అయితే వెబ్సైట్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఎన్ని రోజులకు మీకు పరిష్కారం లభిస్తుందో చెప్పడానికి నిర్ణీత కాలమంటూ ఏమీ లేదు. అయితే మీ సమస్య 60 రోజులైనా పరిష్కారం కాకపోతే.. అప్పుడు సంబంధిత విభాగానికి/మంత్రిత్వ శాఖకు రిమైండర్ పంపడానికి వెబ్సైట్లో ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. మీరు సమస్యను ఫిర్యాదు చేసిన తర్వాత దాని స్టేటస్‌ను చూసుకోవచ్చు. ఇందులో మీ సమస్యను పరిశీలించే విభాగం వివరాలు, అధికారి పేరు, వారి కాంటక్ట్ సమాచారం, హోదా వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదు పరిష్కారంతో మీరు సంతృప్తి చెందకపోతే మళ్లీ ఫిర్యాదు చేయవచ్చు.
You may be interested
10800పైన ఉన్నంత వరకు సేఫే!
Saturday 14th July 2018నిఫ్టీపై నిపుణుల అంచనా చాలా రోజుల తర్వాత నిఫ్టీ 11వేల పాయింట్ల పైన ముగిసింది. గత ఆల్‌టైమ్ హైకి దగ్గరలో ట్రేడవుతోంది. మరో జీవితకాల గరిష్ఠానికి నిఫ్టీ చేరుతుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. అయితే పైస్థాయిలో నెలకొన్న నిరోధం చాలా బలంగా కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం కొన్ని స్టాకులపై ఆధారపడి జరుగుతున్న ప్రస్తుత ర్యాలీకి అంత బలం ఉండకపోవచ్చని వీరి భావన. నిఫ్టీ గతవారం చూపిన జోరు చూస్తే వచ్చే
ట్రేడ్‌వార్‌తో వీటికి లాభం!
Saturday 14th July 2018మేడ్ ఇన్ ఇండియాకు జోరంటున్న నిపుణులు యూఎస్ ఆరంభించిన వాణిజ్యయుద్దం పరోక్షంగా ‘మేక్ ఇన్ ఇండియా’కు వరంలాంటిదని ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం చైనా దాదాపు 50వేల కోట్ల డాలర్ల విలువైన ఎలక్ట్రిక్ మెషినరీ, 38వేల కోట్ల డాలర్ల విలువైన కంప్యూటర్ మెషనరీ, 8900 కోట్ల డాలర్ల విలువైన ఫర్నిచర్ బెడ్డింగ్, లైటింగ్‌ను, 15వేల కోట్ల డాలర్ల విలువైన క్లోతింగ్, యాక్సెసరీస్‌ను, 7000 కోట్ల డాలర్ల విలువైన మెడికల్ సామాగ్రిని, అంతే