STOCKS

News


బడ్జెట్‌ అనంతరం పెట్టుబడుల ప్లానింగ్‌

Saturday 2nd February 2019
personal-finance_main1549099519.png-23964

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాగు ఆదాయం పెంచేందుకు పలు చర్యలు ప్రకటించారు. మధ్యతరగతిపై పన్ను భారం తగ్గించే యత్నాలు చేశారు. బడ్జెట్‌లో కురిపించిన వరాలు తమ ప్రభుత్వాన్ని మరోమారు గద్దెనెక్కిస్తాయని బీజేపీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో కీలకాంశాలకు అనుగుణంగా లాంగ్‌టర్మ్‌ పెట్టుబడులను ఎలా ప్లాన్‌ చేసుకోవచ్చనే అంశంపై  నిపుణుల సూచనలు, సలహాలు ఇలా ఉన్నాయి...
- రూరల్‌ ఇండియా: గ్రామీణ భారతానికి బడ్జెట్లో 1.35 లక్షల కోట్ల ఉద్దీపనలు ప్రకటించారు. రైతులకు నేరుగా నగదు బదిలీని ప్రవేశపెట్టారు. ఉపాధిహామీకి రూ. 60వేల కోట్లు కేటాయించారు. ఇవన్నీ కలిపి ప్రజల వినిమయ శక్తిని పెంచుతాయని అంచనా. ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌, వ్యవసాయ ఉత్పాదకాల తయారీకంపెనీలు లాభపడతాయి.
- ఇ. మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌: ఇకపై అన్ని పీఎస్‌యూ, ప్రభుత్వ సంస్థలు తమ లావాదేవీలను గవర్నమెంట్‌ ఇ- మార్కెట్ల ద్వారా జరపాల్సిఉంటుందని బడ్జెట్లో ప్రకటించారు. జీఈఎంలపై ఏటా దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు జరుగుతాయని అంచనా. ఇన్ఫీబీమ్‌కు లాభదాయకం. 
- డిజిటల్‌ విలేజెస్‌: నూతనంగా లక్ష డిజిటల్‌ విలేజ్‌ల ఏర్పాటు. దీంతో ఆర్‌జియో, స్టెరిలైట్‌ టెక్‌లాంటి కంపెనీలకు మేలు జరుగుతుంది.
- క్యాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌ మినహాయింపు: రెండో ఇల్లు కొనుగోలుపై సీజీ మినహాయింపుతో హౌసింగ్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు లబ్ది చేకూరనుంది.
ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో మార్కెట్లు ద్వితియార్ధం ఆరంభం వరకు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల అనంతరం సూచీలు మంచి లాభాలను ఇచ్చే ఛాన్సులున్నాయంటున్నారు. ఆటో, ఆటో యాన్సిలరీ, బీఎఫ్‌ఎస్‌ఐ, క్యాపిటల్‌గూడ్స్‌, ఐటీ రంగాలకు చెందిన నాణ్యమైన షేర్లను ఎన్నికల పోర్టుఫోలియోలో చేర్చుకోవచ్చని సూచించారు. You may be interested

నిఫ్టీ చార్టుల్లో హైవేవ్‌ క్యాండిల్‌

Saturday 2nd February 2019

శుక్రవారం ఒకదశలో 11వేల పాయింట్లను దాటేందుకు యత్నించిన నిఫ్టీ చివరకు 10900 పాయింట్ల వద్ద సెటిలైంది. డైలీ చార్టుల్లో నిఫ్టీ హైవేవ్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. క్యాండిల్‌కు ఉన్న పొడవైన అప్పర్‌విక్‌ సూచీల్లో అమ్మకాల ఒత్తిడిని తెలియజేస్తోంది. గరిష్ఠాలకు చేరగానే అమ్మకాలు వెల్లువెత్తుతున్న సంగతిని ఈ క్యాండిల్‌ చూపుతోంది. దీన్నిబట్టి చూస్తే నిఫ్టీకి 1085-10990 రేంజ్‌ ఇంకా బలమైన నిరోధంగానే పనిచేయబోతుందని అంచనా. దిగువన 10820 స్థాయి కొంత మద్దతునిచ్చే ఛాన్సులున్నాయి.

బేర్‌ మార్కెట్‌ మంచిదే!

Saturday 2nd February 2019

షేర్‌ మార్కెట్లో బుల్స్‌, బేర్స్‌ రెండూ అవసరమేనని ప్రముఖ ఇన్వెస్టర్‌ శంకర్‌ శర్మ చెప్పారు. బేర్‌ మార్కెట్‌ ఎథికల్‌ హ్యాకర్‌ లాంటిదని, దీని కారణంగా వ్యవస్థలో దాగున్న లొసుగులు బయటపడతాయని అభిప్రాయపడ్డారు. బేర్‌ మార్కెట్‌ కారణంగా సిస్టమ్‌ క్లీనవుతుందని, అప్పుడు తిరిగి ర్యాలీకి ఛాన్సులుంటాయని చెప్పారు. పెద్ద పెద్ద స్కామ్‌లు బయటపడాలంటే బేర్‌మార్కెట్‌ తప్పక రావాలన్నారు. ఇలాంటి స్కాములను బుల్‌ మార్కెట్‌ కప్పిపెడుతుందని చెప్పారు. అందువల్ల బేర్స్‌ పాత్ర చాలా

Most from this category