STOCKS

News


ఐటీఆర్‌ ఇ-ఫైలింగ్‌.. ఈ విషయాలు తెలుసా?

Saturday 14th July 2018
personal-finance_main1531550942.png-18313

ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో గత ఏడాది కాలంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులు వేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా ఉండాలంటే ఈ మార్పుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఐటీఆర్‌ ఆసల్యంగా వేస్తే అదనపు భారం తప్పదు. ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోని ఆరు ముఖ్యమైన మార్పులను గమనిస్తే.. 

♦ ఇ-ఫైలింగ్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అయ్యేటప్పుడు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేదు. ఇదివరకు అకౌంట్‌లోకి లాగిన్‌ అవ్వాలంటే పుట్టిన తేదీ తప్పనిసరి.  
♦ ఐటీఆర్‌ సంబంధిత డాక్యుమెంట్లకు ఇప్పుడు పాస్‌వర్డ్‌ ఉండదు. ఐటీఆర్‌ ఫైలింగ్‌కు చెందిన ఫామ్‌ 26 ఏఎస్‌, ఐటీఆర్‌-వీ వంటి వాటిల్లో కూడా మార్పులు వచ్చాయి. వీటికి ఇదివరకు పాస్‌వర్డ్‌ ఉండేది. అయితే ఇప్పుడు డైరెక్ట్‌గానే ఈ డాక్యుమెంట్లు ఓపెన్‌ అవుతున్నాయి. 
♦ ఫామ్‌ 26 ఏఎస్‌ డౌన్‌లోడ్‌ ప్రక్రియ విధానంలో మార్పు వచ్చింది. ఒకప్పుడు ఫామ్‌ డౌన్‌లోడ్‌ సమయంలో ఏ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ అవ్వాలో ఆప్షన్‌ వచ్చేది. పీడీఎఫ్‌ వెర్షన్‌లో సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకునే వాళ్లం. అయితే ఈ ఏడాది నుంచి ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే.. ముందుగా దాన్ని హెచ్‌టీఎంఎల్‌లో ఓపెన్‌ చేసి, తర్వాత ఎక్స్‌పోర్ట్‌ యాజ్‌ పీడీఎఫ్‌ ఆప్షన్‌తో పీడీఎఫ్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 
♦ ఐటీఆర్‌ వెరిఫికేషన్‌ ఆప్షన్‌: ఇందులోనూ మార్పులు చేర్పులు వచ్చాయి. ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ ఇదివరకు రిటర్న్‌ సమర్పించేప్పుడు వెరిఫికేషన్‌ ఆప్షన్‌ను చూపించేది కాదు. అయితే ఇప్పుడు రిటర్న్‌ సమర్పించిన తర్వాత వెరిఫికేషన్‌ ఆప్షన్‌ను చూపిస్తుంది. దీని ద్వారా ట్యాక్స్‌ రిటర్న్‌ను మళ్లీ ఒకసారి సరిచూసుకోవచ్చు. 
♦ ఆన్‌లైన్‌ ఫైలింగ్‌లో ఆటో-పాపులేటెడ్‌ సదుపాయాన్ని కూడా తీసుకువచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి మీరు ఆన్‌లైన్‌లో ఐటీఆర్‌-1 వేయాలి అనుకుంటున్నారు. మీకు ఆటో-పాపులేటెడ్‌ అనే ఫీచర్‌ ఒకటి అందుబాటులోకి వచ్చింది. గతేడాది ఫామ్‌ 26 ఏఎస్‌ లేదా ఐటీఆర్‌ను సెలెక్ట్‌ చేసుకొని ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన బాక్స్‌లను సెలెక్ట్‌ చేసుకుంటే అప్పుడు గత ఐటీఆర్‌లోని వివరాలన్నీ ప్రస్తుత ఐటీఆర్‌లోకి వచ్చేస్తాయి. ఇందులో ఎంప్లాయి కేటగిరి, బ్యాంక్‌ వివరాలు, వేతనం, పేరు, పాన్‌, అడ్రస్‌ వంటి పలు కాలమ్స్‌ ఉన్నాయి. 
♦ టీడీఎస్‌, ఫామ్‌ 26 ఏఎస్‌ వివరాలు చెక్‌ చేసుకోండి: ఆన్‌లైన్‌లో ఐటీఆర్‌-1 ఫైలింగ్‌ చేసేటప్పుడు ఆటో-పాపులేటెడ్‌ ఫీచర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరీముఖ్యంగా టీడీఎస్‌, ఫామ్‌ 26 ఏఎస్‌ వివరాలను సరిచూసుకునేదానికి. టీడీఎస్‌ వివరాలు ఐటీఆర్‌-1లోకి ఆటో-పాపులేటెడ్‌ చేస్తే... ఈ సమాచారం ఫామ్‌ 26 ఏఎస్‌తో జతకాకపోవచ్చు. అప్పుడు తప్పులను సరిచేసుకోవచ్చు. You may be interested

క్యూ1లో పెరిగిన పాలసీ ప్రీమియంలు

Saturday 14th July 2018

ముంబై:- జీవిత బీమా సంస్థల కొత్త ప్రీమియం కలెక్షన్లు జూన్‌ క్వార్టర్‌లో రెండెంకెల వృద్ధిని నమోదు చేశాయి. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీవిత బీమా సంస్థలు మొత్తం ప్రీమియం కలెక్షన్లు 11 శాతం వృద్ధితో రూ.33,166 కోట్లను నమోదు చేశాయి. గతేడాది ఇదే క్వార్టర్లో మొత్తం వసూళ్లు రూ.33,156కోట్లగా ఉన్నాయి. ఇదే క్యూ1లో ప్రభుత్వ రంగ

ఈ ఏడాది బెస్ట్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ ఇవే..

Saturday 14th July 2018

మొత్తం షేర్ల ప్రస్తుత ధర ఆధారంగా కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ నిర్ణయమౌతుంది. ఈక్విటీ పోర్ట్‌ఫోలియో కోసం చూసేటప్పుడు కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ కూడా చూడాలి. స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌.. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా 251 ర్యాంక్‌ నుంచి మొదలయ్యే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇలాంటి ఫండ్స్‌ తన మొత్తం అసెట్స్‌లో 65 శాతం వరకు స్మాల్‌క్యాప్‌ కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో పెట్టుబడిగా పెడతాయి. ఎవరైతే ఎక్కువ రిస్క్‌ తీసుకోవడానికి

Most from this category