STOCKS

News


క్రిప్టోకరెన్సీ లావాదేవీ జరిపితే జైలుకే!?

Friday 7th June 2019
personal-finance_main1559905541.png-26164

క్రిప్టోనిషేధ బిల్లు ముసాయిదా ప్రతిపాదన
భారత్‌లో క్రిప్టోకరెన్సీ లావాదేవీలు జరిపితే పదేళ్లు జైలు శిక్ష విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. క్రిప్టోకరెన్సీ అమ్మినా, కొన్నా జైలుకు పంపాలని క్రిప్టోకరెన్సీ నిషేధ బిల్లు 2019 ముసాయిదా ప్రతి పేర్కొంది. ముసాయిదా ప్రకారం ‘ప్రత్యక్షంగా, పరోక్షంగా క్రిప్టోలను మైన్‌ చేసిన, ఉత్పత్తి చేసిన, నిల్వ ఉంచుకున, అమ్మిన, బదిలీ చేసిన, వదిలించుకున, జారీ చేసిన, ఇక ఇతర ఏ లావాదేవీ జరిపిన’వాళ్లు ఈ నిషేధ కేటగిరీలోకి వస్తారని బ్లూమ్‌బర్గ్‌ క్వింట​ నివేదిక తెలిపింది. భారత్‌లో క్రమంగా క్రిప్టోకరెన్సీని రెగ్యులరైజ్‌ చేస్తారన్న వార్తలకు భిన్నంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెగ్యులరైజేషన్‌ ఆశలు చూపి క్రిప్టోలను లావాదేవీ చేసేవారికి తాజా ప్రతిపాదనతో చెక్‌ పడనుంది. దేశంలోని పలు క్రిప్టో ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌కు ఈ చర్య అశనిపాతంగా చెప్పవచ్చు. ముసాయిదా బిల్లు రూపొందించే ప్యానెల్‌కు ఎకనమిక్‌ వ్యవహారాల కార్యదర్శి సుభాశ్‌ చంద్ర గార్గ్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో సెబి సభ్యులు, కేంద్ర విచారణా సంస్థల ప్రతినిధులు, సీబీడీటీ సభ్యులు మెంబర్లుగా ఉన్నారు. దీంతో పాటు బిల్లులో భారత్‌కు ప్రత్యేకమైన ఒక డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టే సన్నాహాలు కూడా జరుగుతున్నట్లు తెలిసింది. ఆర్‌బీఐ, సీబీటీడీతో సం‍ప్రదింపుల తర్వాత డిజిటల్‌ రూపీని ప్రవేశపెడతారని సమాచారం. 



You may be interested

స్మాల్‌క్యాప్స్‌ హవా...: రిలయన్స్‌ సెక్యూరిటీస్‌

Friday 7th June 2019

వచ్చే ఏడాది, రెండేళ్ల కాలంలో మిడ్‌క్యాప్‌, లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే స్మాల్‌క్యాప్‌ అద్భుత పనితీరు చూపిస్తాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ నవీన్‌ కులకర్ణి తెలిపారు. మార్కెట్లలో అస్థిరతలు తగ్గుముఖం పడుతున్నాయని, ఇది స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌కు చాలా మంచిదన్నారు. ద్రవ్య లభ్యత సవాళ్లను పరిష్కరించడం కీలకమైన ప్రాధాన్య అంశంగా నవీన్‌ పేర్కొన్నారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం దీన్ని పరిష్కరించగలవన్నారు. అతిపెద్ద సంస్కరణలు అన్నవి పెద్ద సవాలుగా అభివర్ణించారు.    భూముల సమీకరణ, కార్మిక సంస్కరణలు లేదా

బ్యాంకులే బెటర్‌!

Friday 7th June 2019

అజయ్‌ శ్రీవాస్తవ అభిప్రాయం దేశీయ ఎకానమీ నిజంగా వృద్ధి సాధించాలనుకుంటే అన్ని రకాల రుణాలను ఆర్‌బీఐ రెపోరేట్‌కు అనుసంధానిస్తే చాలని డైమెన్షన్స్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సీఈఓ అజయ్‌ శ్రీవాస్తవ చెప్పారు.  ప్రస్తుతం ఎకానమీలో పీఎస్‌యూలు, బ్యాంకులే బాగున్నాయని, వీటిలో పెట్టుబడులను పరిశీలించవచ్చని సూచించారు. షైలాక్‌(షేక్స్సియర్‌ నాటకంలో పాత్ర)లాగా బ్యాంకులు సంపద సృష్టిస్తూనే ఉంటాయని, అందువల్ల వీటిలో పెట్టుబడులే మంచివని చెప్పారు. లిక్విడిటీతో కదిలే ఇలాంటి మార్కెట్లు పలు అవకాశాలను ఇస్తాయని, వాటిని

Most from this category