STOCKS

News


ఐఐఎఫ్‌ఎల్‌ ఎన్‌సీడీ ఇష్యూ... ఎంతో ఆకర్షణీయం!

Tuesday 22nd January 2019
personal-finance_main1548096880.png-23709

ఇండియా ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌ఎల్‌) ఎన్‌సీడీ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభం కాబోతుంది. ఈ నెల మొదట్లో మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ ఎన్‌సీడీలు ప్రారంభమయ్యాయి. తాజాగా వీటి సరసన ఐఐఎఫ్‌ఎల్‌ ఎన్‌సీడీ కూడా చేరింది. అయితే, ఈ కంపెనీ ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తుండడం ఆసక్తికరం. ఈ నేపథ్యంలో ఈ ఎన్‌సీడీలో ఇన్వెస్ట్‌ చేసుకోవడంపై అనలిస్టుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. 

 

ఓ నిర్ణీత కాల వ్యవధితో కూడినదే నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌ (ఎన్‌సీడీ). ఇందులో సెక్యూర్డ్‌, అన్‌సెక్యూర్డ్‌ ఉంటాయి. ఈ రెండు రకాలను ఐఐఎఫ్‌ఎల్‌ ఆఫర్‌ చేస్తోంది. ఐదేళ్ల ఎన్‌సీడీపై 10.20 శాతం, పదేళ్ల కాల ఎన్‌సీడీపై 10.50 శాతం, 39 నెలల ఎన్‌సీడీపై 9.60 శాతం వడ్డీని కంపెనీ ఖరారు చేసింది. ఈ ఎన్‌సీడీ ఇష్యూకి ‘ఏఏ స్టెబెల్‌ రేటింగ్‌’ను క్రిసిల్‌ ఇచ్చింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీల ఎన్‌సీడీల కంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉంది. అయితే ఈ సంస్థలతో పోలిస్తే క్రెడిట్‌ రేటింగ్‌ ఐఐఎఫ్‌ఎల్‌ ఎన్‌సీడీకి తక్కువగా ఉండడమే అధిక వడ్డీ రేటు ఆఫర్‌ చేయడానికి కారణం. నెలవారీగా, వార్షికంగా వడ్డీ చెల్లింపు ఆప్షన్లు కూడా ఉన్నాయి. సకాలంలో వడ్డీ చెల్లించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

 

ఇన్వెస్ట్‌ చేయవచ్చా?
ఐఐఎఫ్‌ఎల్‌ ఆఫర్‌ చేస్తున్న మూడు కాల వ్యవధుల ఎన్‌సీడీల్లో పదేళ్ల కాల వ్యవధి ఎన్‌సీడీ అన్‌సెక్యూర్డ్‌ కావడం గమనించాల్సిన విషయం. పదేళ్లు అంటే ఎక్కువ కాలమే. పైగా అన్‌సెక్యూర్డ్‌. 39 నెలలు, 60 నెలల ఎన్‌సీడీలు సెక్యూర్డ్‌వి. అంటే కంపెనీ భవిష్యత్తులో సమస్యల్లో చిక్కుకుని చెల్లింపులు చేయలేకపోతే... కంపెనీ ఆస్తులు విక్రయించి ముందుగా చెల్లింపులు చేసేది సెక్యూర్డ్‌ ఇన్వెస్టర్లకే. అప్పుడు మిగిలి ఉంటే అన్‌సెక్యూర్డ్‌ ఇన్వెస్టర్ల చేతికి పెట్టుబడులు లభిస్తాయి. 39 నెలల కాలం వడ్డీ రేట్ల పరంగా రిస్క్‌కు సంబంధించిందని, కనుక ఈ అంశాల నేపథ్యంలో ఐదేళ్ల ఎన్‌సీడీ ఆకర్షణీయమైనదిగా విశ్లేషకులు సూచిస్తున్నారు. దీనిపై 10.20 శాతం రాబడి అందుకోవచ్చు. మరో ముఖ్యమైన అంశం... కాల్‌ ఆప్షన్‌. అంటే నిర్ణీత కాలం కంటే మధ్యలోనే  కంపెనీ ఎన్‌సీడీలను రద్దు చేసి డబ్బులను వెనక్కి ఇచ్చే అవకాశాన్ని కలిగి ఉంటుంది. 39 నెలల ఎన్‌సీడీని 24 నెలల తర్వాత, 60 నెలల ఎన్‌సీడీని 30 నెలల తర్వాత, 120 నెలల ఎన్‌సీడీని 66 నెలల తర్వాత వెనక్కి ఇచ్చేయవచ్చు. భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గాయనుకుంటే... మరోసారి తక్కువ వడ్డీ రేట్లపై తాజా ఎన్‌సీడీ ఇష్యూతో నిధులు సమీకరించి ముందస్తు ఎన్‌సీడీల హోల్డర్లకు చెల్లింపులు చేయగలదు. అలా చేస్తే అది ఇన్వెస్టర్ల కోణంలో ప్రయోజనాలకు గండికొట్టేదే. You may be interested

సన్‌ ఫార్మా షేరు కొంటున్నారా...? తొందరొద్దు!

Tuesday 22nd January 2019

సన్‌ ఫార్మా షేరు ధర కేవలం మూడున్నర నెలల వ్యవధిలోనే 40 శాతం క్షీణించింది. దీంతో చౌకగా దొరుకుతుంది కదా అని వెంటనే కొనుగోలు చేద్దామనుకునే వారు కాస్త ఆగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్‌ కరెక్షన్‌ ఇంకా ముగిసినట్టు సంకేతాలేవీ కనిపించడం లేదని పేర్కొంటున్నారు.   షేరు అధిక వ్యాల్యూషన్లలో ఉండడం, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అంశాలు, అమెరికా మార్కెట్ల నుంచి ఉత్పత్తులను రీకాల్‌ చేయడం వంటివి సన్‌ ఫార్మా విషయంలో గమనించొచ్చు. సన్‌ఫార్మా

క్యాష్‌లెస్‌ చెల్లింపులపై ఫ్లిప్‌కార్ట్‌ అదనపు డిస్కౌంట్‌

Tuesday 22nd January 2019

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తన ప్లాట్‌ఫామ్‌పై డిజిటల్‌ చెల్లింపుల కొనుగోళ్లను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలు, వస్త్రాలు సహా అన్ని విభాగాల్లో కొనుగోళ్లకు డిజిటల్‌ రూపంలో పేమెంట్‌ చేస్తే అదనంగా 5 శాతం తగ్గింపు ఇస్తోంది. డెబిట్‌ కార్డు/ క్రెడిట్‌కార్డు/ నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఈ నెల 11-31వ తేదీల మధ్య కొనుగోళ్లకు చెల్లింపులు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు అమ్మకందారులకు ఇచ్చిన సమాచారంలో

Most from this category