STOCKS

News


విదేశాల్లో క్రెడిట్‌ కార్డులు వాడడం మంచిది కాదా?

Monday 3rd September 2018
personal-finance_main1535915496.png-19890

క్రెడిట్‌ కార్డు ఎక్కడైనా పనిచేసే సాధనమే. దేశంలోనే కాదు, విదేశాలకు వెళ్లినప్పుడు సైతం ఇది మంచి సాధనమే. కానీ, క్రెడిట్‌ కార్డు సేవలు ఉచితం అయితే కాదు. ఎక్కడ పడితే అక్కడ వాడితే చార్జీలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే క్రెడిట్‌ కార్డు వాడే వారు తప్పకుండా చార్జీల గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎందుకైనా మంచిది.

 

విదేశాల్లో ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌ ఎక్కడ క్రెడిట్‌ కార్డును వినియోగించినా గానీ నెట్‌వర్క్‌ ఆధారిత చార్జీలను భరించాల్సి ఉంటుంది. మార్కప్‌ ఫీజులు లేదా ఫారీన్‌ కరెన్సీ లావాదేవీల రుసుం, క్యాష్‌ అడ్వాన్స్‌ ఫీజులు ఉంటాయి. లావాదేవీల విలువపై ఈ మొత్తం చార్జీ చేస్తారు. మార్కప్‌ చార్జీ అన్నది ఇన్‌పుట్‌ కాస్ట్‌, ఫైనల్‌ అవుట్‌పుట్‌ కాస్ట్‌ మధ్య ఉండే తేడా. ఇదే కంపెనీకి లాభం. కనుక మొత్తం మీద విదేశాల్లో ‍క్రెడిట్‌ కార్డుల వినియోగంపై చార్జీల భారం ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. ‘‘కార్డును జారీ చేసిన దేశంలో దాన్ని వినియోగించడం వల్ల ఎటువంటి చార్జీ చెల్లించక్కర్లేదు. ఒకవేళ విదేశాల్లో వాడితే ఆ దేశ కరెన్సీలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో కరెన్సీ మార్పిడి ఫీజు అమలవుతుంది. కార్డు నెట్‌వర్క్‌ 1-2 శాతం వరకు విదేశీ కరెన్సీ మార్పిడిపై వసూలు చేస్తుంది. దీనికి అదనంగా కార్డు సంస్థలు ఫారీన్‌ లావాదేవీ చార్జీ కూడా వసూలు చేస్తాయి. ఇది కూడా 1.5 శాతం నుంచి 3.5 శాతం వరకు లావాదేవీ విలువపై ఉంటుంది. చిన్న లావాదేవీలపై ఇది పెద్దగా అనిపించదు. కానీ లావాదేవీ పెద్ద మొత్తంలో ఉంటే ఈ చార్జీ వేలాది రూపాయల్లోకి వెళుతుంది’’ అని బ్యాంక్‌ బజార్‌ సీబీడీవో నవీన్‌చందాని తెలిపారు. నగదు ఉపసంహరణలపైనా చార్జీ అన్నది 1-4 శాతం మధ్య ఉంటుంది. ఇది మీ క్రెడిట్‌ కార్డుపై ఉండే నగదు ఉపసంహరణ చార్జీకి అదనం. అందుకే విదేశాలకు వెళ్లే వారు కరెన్సీని తీసుకెళ్లడం లేదా ట్రావెల్‌ కార్డును వెంట తీసుకెళ్లడం మంచిది.

 

ఏం చేస్తే నయం...
విదేశాల్లో ప్రయాణించే వారికి క్రెడిట్‌ కార్డులు లావాదేవీల నిర్వహణకు సౌకర్యంగా ఉంటాయి. తరచుగా ప్రయాణించే వారు అయితే, కనీస చార్జీలు ఉండే కార్డును ఎంచుకోవడం పరిష్కారం. కొన్ని కార్డులు ప్రత్యేకంగా విదేశీ లావాదేవీల ఫీజు లేకుండా ఆఫర్‌ చేస్తున్నాయి. ఇక విదేశాల్లో లావాదేవీలపై అధిక ప్రయోజనాలను ఆఫర్‌ చేసే కార్డును ఎంచుకోవడం కూడా మంచిదే. ‘‘ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డులు విషయంలో ఎటువంటి లావాదేవీల ఫీజు ఉండదు. అవసరమైన దేశంలో నగదు పొందే వెసులుబాటు కూడా ఉంటుంది. కార్డుదారుడు ఎప్పుడైనా ఈ కార్డును తిరిగి లోడ్‌ చేసుకోవచ్చు. క్రెడిట్‌ కార్డులపై పడే మార్కప్‌ ఫీజులు కూడా ఇందులో ఉండవు. ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డును విదేశాల్లో ప్రయాణించే వారికి నేను సూచిస్తాను. అయితే, అదే సమయంలో వెంట క్రెడిట్‌ కార్డు ఉంచుకోవాలి. అదనంగా డబ్బు అవసరం పడితే ఆదుకుంటుంది’’ అని పైసాబజార్‌ డాట్‌ కామ్‌ పేమెంట్‌ ప్రొడక్ట్స్‌ మెడ్‌ సహిల్‌అరోరా సూచించారు.You may be interested

ఈ వారానికి ట్రేడింగ్‌ స్టాక్స్‌

Monday 3rd September 2018

యస్‌ బ్యాంకు, జెట్‌ ఎయిర్‌వేస్‌ సహా పలు స్టాక్స్‌ గురించి మార్కెట్‌ అనలిస్ట్‌ కునాల్‌ బోత్ర ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. ఇందులో ఈ వారానికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, అంబుజా సిమెంట్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ స్టాక్స్‌ను ఆయన సిఫారసు చేశారు.   యస్‌ బ్యాంకు: మంచి కొనుగోలు జోన్‌లోకి ఇది ప్రవేశించింది. జూలైలో మంచి వ్యాల్యూమ్స్‌తో ఈ స్టాక్‌లో బ్రేకవుట్‌ వచ్చింది. ఈ స్టాక్‌ పడిన ప్రతిసారీ తిరిగి పుంజుకోవడం జరుగుతోంది.

పతనమవుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌... ఏంటి కర్తవ్యం?

Monday 3rd September 2018

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ ఏడాది ఆరంభంలో రూ.870 స్థాయిలో ఉంది. తాజాగా ఇది రూ.282 స్థాయికి దిగొచ్చింది. సుమారు 68 శాతం షేరు విలువ ఐస్‌ ముక్కలా కరిగిపోయింది. ఇందులో వాటాదారులు ఈ మేర తమ సంపదను కోల్పోయారు. విమానయాన రంగంలో మొదటి నుంచి ఉన్న ప్రైవేటు కంపెనీగా, అంతర్జాతీయ రూట్లలో ముందు నుంచీ సర్వీసులు నడుపుతూ ప్రముఖ ఎయిర్‌లైన్‌గా ఉన్న జెట్‌ ఎయిర్‌ వేస్‌ షేరు ఈ స్థాయిలో

Most from this category