STOCKS

News


ఎస్‌బీఐ ‘ఏటీఎం’ ఆంక్షలు రేపటి నుంచే అమల్లోకి

Tuesday 30th October 2018
personal-finance_main1540839853.png-21569

ప్రభుత్వరంగ ఎస్‌బీఐ ఏటీఎం కార్డులపై విధించిన సరికొత్త నియంత్రణలు 31 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. క్లాసిక్‌, మ్యాస్ట్రో డెబిట్‌ కార్డులు కలిగిన వారు ఇక నుంచి రోజులో ఏటీఎంల నుంచి రూ.20,000వరకే విత్‌డ్రా చేసుకోగలరు. ఎస్‌బీఐ ఈ ఏడాది మార్చి నాటికి 39.50 కోట్ల డెబిట్‌ కార్డులను జారీ చేసి ఉంది. ఇందులో 26 కోట్ల కార్డులు తరచుగా వినియోగిస్తున్నవి. దీంతో ఎస్‌బీఐ ఆంక్షలు చాలా మందిపై ప్రభావం చూపించనున్నాయి. 

 

ప్రస్తుతం రూ.40,000 వరకు క్లాసిక్‌, మ్యాస్ట్రో కార్డుల ద్వారా ఏటీఎంల నుంచి విత్‌ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇది కాస్తా సగానికి తగ్గిపోనుంది. అయితే, ప్రస్తుతం మాదిరే అధిక మొత్తంలో విత్‌డ్రా ఆప్షన్‌ కోసం కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఇతర ఎస్‌బీఐ కార్డులపై రోజువారీ ఉపసంహరణల పరంగా ఎటువంటి మార్పుల్లేవు. ఎస్‌బీఐ గోల్డ్‌ డెబిట్‌ కార్డుపై నిత్యం రూ.50,000, ప్లాటినం డెబిట్‌ కార్డులపై రూ.లక్ష ఉపసంహరించుకోవచ్చు.  ఏటీఎంల వద్ద మోసపూరిత లావాదేవీల నియంత్రణకు, డిజిటల్‌, నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి ఈ చర్య ఉపకరిస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. ఈ కార్డులకు సంబంధించి ఏటీఎంల్లో క్లోనింగ్‌ ఘటనలపై తమకు ఎక్కువగా ఫిర్యాదులు రావడమే ఈ చర్య వెనుక కారణమని తెలిపింది. 

 

ఇక ఇటీవలి కాలంలో ఎస్‌బీఐ పలు నిర్ణయాలు తీసుకుంది. మ్యాగ్‌స్టి‍్రప్‌ కార్డులు ఉన్న వారు చిప్‌ ఆధారిత డెబిట్‌ కార్డులతో మార్చుకోవాలని కూడా ఖాతాదారులకు సూచించింది. ఫామ్‌ 15జీ/హెచ్‌ను హోమ్‌ బ్రాంచ్‌లోనే కాకుండా ఎస్‌బీఐకి చెందిన ఏ శాఖలో అయినా సమర్పించే అవకాశం కల్పించింది. నాన్‌ హోమ్‌ బ్రాంచ్‌లో రూ.25,000 డిపాజిట్‌ పరిమితిని ఎత్తివేసింది. డిసెంబర్‌ 1 నాటికి ప్రతీ కస్టమర్‌ విధిగా బ్యాంకుకు వెళ్లి తమ మొబైల్‌ నంబర్‌ను నమోదు చేసుకోవాలని కూడా కోరింది.



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు డౌన్‌

Tuesday 30th October 2018

క్రితం రోజు రాత్రి అమెరికా మార్కెట్‌ క్షీణత కారణంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మంగళవారం ఉదయం 8.40 గంటలకు 40 పాయింట్ల క్షీణతతో 10,244 పాయింట్ల వద్ద కదులుతోంది. ఇక్కడి నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుగుణంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ కదులుతుంది. సోమవారం స్పాట్‌ నిఫ్టీ 10,250 పాయింట్ల వద్ద ముగియగా, ఫ్యూచర్‌ 10,284 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సోమవారం రాత్రి అమెరికా మార్కెట్‌ 1 శాతం వరకూ పతనమైనప్పటికీ, మంగళవారం

మార్కెట్‌ గమనం ఎటు?

Tuesday 30th October 2018

నిఫ్టీ 200 పాయింట్ల ర్యాలీతో కనిష్ట స్థాయిని నమోదు చేసిందా? లేక ఇంకా పడిపోతుందా? అన్న సందేహం చాలా మందికి ఉంది. మరి సమీప కాలంలో సూచీల కదలికలు ఎలా ఉంటాయన్న దానిపై నిపుణుల అభిప్రాయాలు చూద్దాం.    నిఫ్టీ రోజువారీ చార్ట్‌ 2018లో రెండు టాప్‌లను సూచిస్తోంది. ఈ ఏడాది జనవరి 29న 11,130 ఒకటి కాగా, ఆగస్ట్‌ 28న 11,738 మరొకటి. ఇక ఈ ఏడాది ఆరంభంలో మార్కెట్‌ 38

Most from this category