STOCKS

News


అమేజాన్‌-ఐసీఐసీఐ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు

Thursday 1st November 2018
personal-finance_main1541011053.png-21621

అమేజాన్‌ సైట్లో తరచూ షాపింగ్‌ చేసే వారికి తీపివార్త... ఐసీఐసీఐ బ్యాంకుతో కలసి అమేజాన్‌ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చింది. ఈ కార్డుతో షాపింగ్‌ చేయడం ద్వారా అదనపు ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. ఈ కార్డులో ప్రతీ రూ.1,000 కొనుగోలుపై రివార్డు పాయింట్లు లభిస్తాయి. పైగా గరిష్ట పరిమితి అంటూ లేదు. ఇవి ఎక్స్‌పైర్‌ కూడా కావు. ప్రతీ రివార్డ్‌ పాయింటు ఒక రూపాయికి సమానం. 

 

రివార్డు పాయింట్లు
అమేజాన్‌ డాట్‌ ఇన్‌లో షాపింగ్‌ చేసే ప్రైమ్‌ సభ్యులకు, బిల్లు మొత్తంపై 5 శాతం రివార్డు పాయింట్లుగా లభిస్తాయి. ప్రైమ్‌ సభ్యులకు ఈ స్థాయిలో రివార్డు పాయింట్లను తెచ్చిపెట్టే కార్డు ఇదేనని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ప్రైమ్‌ సభ్యత్వం లేని ఇతర కస్టమర్లు ఈ కార్డుతో కొనుగోలు చేస్తే 3 శాతం రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఇక అమేజాన్‌ భాగస్వామ్య మర్చంట్స్‌ పోర్టళ్లలో షాపింగ్‌ చేస్తే 2 శాతం రివార్డు పాయింట్లు అందుకోవచ్చు. ఇక, ఇతర ఏ దుకాణంలో అయినా (వీసా కార్డులను అనుమతించే) షాపింగ్‌పై ఒక శాతం రివార్డు పాయింట్లు లభిస్తాయని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఈ రివార్డు పాయింట్లను అమేజాన్‌ డాట్‌ ఇన్‌లో రెడీమ్‌ చేసుకోవచ్చు. ఈ కార్డుపై పెట్రోల్‌ పోయించుకుంటే సర్‌చార్జ్‌ కూడా ఉండదు. అమేజాన్‌ నిర్వహించే సేల్స్‌ కార్యక్రమాల్లో నోకాస్ట్‌ ఈఎంఐ, బోనస్‌ పాయింట్లు కూడా లభిస్తాయి. జాయినింగ్‌ ఫీజు, వార్షిక ఫీజులు కూడా లేవని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ప్రతీ నెలా బిల్లింగ్‌ సైకిల్‌ తేదీ ముగిసిన తర్వాత రివార్డు పాయింట్లను కార్డుదారుని అమేజాన్‌ ప్రైమ్‌ బ్యాలన్స్‌ ఖాతాలో జమ చేస్తారు. గిఫ్ట్‌, క్రెడిట్స్‌ రూపంలో ఇవి జమ అవుతాయి. అమేజాన్‌ సైట్లో అన్ని రకాల చెల్లింపులకూ ఈ బ్యాలన్స్‌ను వినియోగించుకోవచ్చు. అమేజాన్‌ పార్ట్‌నర్‌ సైట్లలోనూ చెల్లింపులు చేయవచ్చు. 

 

ఎవరు అర్హులు?
ప్రస్తుతానికి అమేజాన్‌ యాప్‌ను వినియోగించే ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు ఈ కార్డులను ఆఫర్‌ చేస్తారు. 60 రోజుల్లోపు ఐసీఐసీఐ బ్యాంకుతో అనుబంధం లేని ఇతర కస్టమర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ సుదీప్త రాయ్‌ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు ప్రత్యేకంగా కేవైసీ సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. బిల్లు మొత్తం ఎంతున్నా గానీ 5 శాతం రివార్డు పాయింట్లు, గరిష్ట పరిమితి లేకుండా పొందడం, వాటికి ఎక్స్‌పైర్‌ లేకపోవడం ఆకర్షణలు.



You may be interested

నిఫ్టీ 50 పాయింట్లు గ్యాప్‌అప్‌

Thursday 1st November 2018

ప్రపంచ మార్కెట్ల సానుకూల ప్రభావంతో బుధవారంనాటి భారీ ర్యాలీకి కొనసాగింపుగా గురువారం గ్యాప్‌అప్‌తో భారత్‌ సూచీలు ప్రారంభమయ్యాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 206 పాయింట్ల పెరుగుదలతో 34,650 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 55 పాయింట్ల తగ్గుదలతో 10,442 పాయింట్ల వద్ద మొదలయ్యింది. క్రితం రోజు బ్లాక్‌బస్టర్‌ ఫలితాల్ని ప్రకటించిన ఇంజనీరింగ్‌ కంపెనీ లార్సన్‌ అండ్‌ టూబ్రో 4 శాతం గ్యాప్‌అప్‌తో రూ. 1,350 వద్ద ప్రారంభమై నిఫ్టీ టాప్‌గెయినర్లలో ఒకటిగా

ఈ నాలుగు రంగాలను పరిశీలించొచ్చు: క్యాపిటల్‌ మైండ్‌

Thursday 1st November 2018

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో మధ్య కాలానికి ఫార్మా, ఐటీ, తయారీ, ఎన్‌బీఎఫ్‌సీ రంగాల పట్ల బుల్లిష్‌గా ఉన్నట్టు క్యాపిటల్‌ మైండ్‌ వ్యవస్థాపకుడు దీపక్‌ షెనాయ్‌ తెలిపారు. స్వల్ప కాలంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయని, ఈ రంగాలకు చెందిన స్టాక్స్‌ను మంచి ధరలకు సొంతం చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన తన అభిప్రాయాలను తెలియజేశారు. ‘‘నవంబర్‌లో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు కమర్షియల్‌ పేపర్లను రోలోవర్‌ చేసుకోవాల్సి ఉంది. రాష్ట్రాల్లో

Most from this category