ఈఎంఐ కట్టకపోతే క్రెడిట్స్కోరుకు విఘాతం: క్లియర్స్కోర్
By Sakshi

ఈఎంఐ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయితే ఏమవుతుందిలే?నన్న నిర్లక్ష్యం పనికిరాదు. ఇది క్రెడిట్ స్కోరుపై చాలా ప్రభావమే చూపిస్తుందంటున్నారు క్లియర్స్కోర్ (క్రెడిట్ బ్యూరో) సహ వ్యవస్థాపకుడు, గ్లోబల్ సీఈవో జస్టిన్బాసిని. భారత్‌లో రుణ మార్కెట్ పరిస్థితులు, క్రెడిట్ స్కోరుపై ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. భారత్‌లో 22-44 వయసు వారు ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నట్టు జస్టిస్ బాసిని తెలిపారు. రుణాలను పొందేందుకు ఇది ముఖ్యమైన వయసుగా పేర్కొన్నారు. ప్రజలు ద్విచక్ర వాహన రుణంతో ప్రారంభించి, కారు, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు, కన్జ్యూమర్ డ్యురబుల్ లోన్స్, ఆ తర్వాత గృహ రుణానికి అప్‌గ్రేడ్ అవుతున్నారని చెప్పారు. పెద్ద వయసుకు వచ్చేసరికి రుణాలు తీసుకునే ధోరణి సన్నగిల్లుతోందన్నారు. క్రెడిట్ స్కోరుపై అవగాహన ఏ మేరకు? ఫైనాన్షియల్ కోచింగ్ సర్వీస్ రుణం పొందేందుకు మంచి స్కోరు ఏది?
భారత్‌లో రుణాలు తీసుకున్న వారి సంఖ్య 30 కోట్లుగా ఉంది. క్రెడిట్ ఖాతా తెరవడం, మూసివేసిన చరిత్ర వీరికి ఉంది. సగటున ప్రతీ నెలా అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ కలిపి పది లక్షల మందే తమ పేర్లను నమోదు చేసుకుని క్రెడిట్ స్కోరు తెలుసుకుంటున్నారు. ఈ సంఖ్య అస్థిరంగానూ, తక్కువగానూ ఉంది. సాధారణంగా ఒక్కసారి మాత్రమే ఈ క్రెడిట్ బ్యూరోప్లాట్ఫామ్లు ఉచిత క్రెడిట్ రిపోర్ట్ ఆఫర్ చేస్తాయి. ఆ తర్వాత డబ్బులు చెల్లించి పొందాల్సి ఉంటుంది.
బ్రిటన్‌లో చాట్‌బోట్స్ సాయంతో ఫైనాన్షియల్ కోచింగ్ ఆరంభించాం. మరికొన్ని వారాల్లో భారత్‌లోనూ దీన్ని ఆరంభించనున్నాం. క్రెడిట్ స్కోరు, రిపోర్ట్, ఆర్థిక అంశాల గురించి తెలుసుకునేందుకు సాయంగా ఉంటుంది. ప్రశ్నకు సంబంధించి ఆర్టికల్స్, వీడియోలను చాట్‌బోట్స్ రిఫర్ చేస్తాయి. మా సేవలు ఉచితం. క్రెడిట్ స్కోరును ప్రతీ నెలా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రజలు తమ క్రెడిట్ స్కోరు పెంచుకునేందుకు మేం సాయం అందిస్తాం. కొత్తగా మార్కెట్లోకి వచ్చే వారికి అనువైన ఉత్పాదన తెలియజేసేందుకు కూడా సాయం చేస్తాం.
మూడు రకాల క్రెడిట్ స్కోరు బకెట్లు ఉన్నాయి. 850 కంటే స్కోరు ఎక్కువ ఉంటే అది అసాధారణం. 750-850 మధ్య ఉంటే అది మంచి స్కోరుగా పరిగణించడం జరుగుతుంది. 650-750 మధ్య ఉంటే అది పరిశీలించతగిన విభాగం. ఈ విభాగంలోని వారు స్కోరు పెంచకునేందుకు అవకాశం ఉంటుంది. రుణం పొందేందుకు కచ్చితమైన కటాఫ్ అంటూ ఏమీ లేదు.
You may be interested
మీ ఎస్బీఐ డెబిట్ కార్డును మార్చుకున్నారా?
Saturday 25th August 2018ఎస్బీఐ కస్టమర్లందరూ దృష్టి సారించాల్సిన అంశం ఒకటుంది. ఎస్బీఐ ఖాతాదారులుగా గతంలో మీరు తీసుకున్న డెబిట్ కార్టులను మార్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎస్బీఐ గతంలో ఏటీఎం కమ్ డెబిట్ కార్డులను మ్యాగ్నటిక్ స్ట్రైప్ (మ్యాగ్‌స్ట్రైప్) కార్డులనే జారీ చేసింది. గత కొంత కాలంగా మరింత భద్రతా కోణంలో ఈఎంవీ చిప్‌లు ఉన్న కార్డులను జారీ చేస్తోంది. ఈ క్రమంలో ఈఎంవీ చిప్‌లు లేని కార్డులను ఈ ఏడాది డిసెంబర్ 31లోపు
ఎగుమతి ఆధారిత కంపెనీలకు మహర్ధశ!
Friday 24th August 2018అమెరికాలో వడ్డీ రేట్ల కఠినతరం, రూపాయి విలువ క్షీణత నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గరిష్ట స్థాయిల వద్దే స్వల్ప నష్టాలను చవిచూశాయి. అయితే, లిక్విడిటీ కఠినతరం చేయడం అన్నది మార్కెట్‌కు ఆందోళనకర అంశమేనని మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్‌కు చెందిన సౌరభ్ముఖర్జియా పేర్కొన్నారు. అమెరికా వృద్ధి బలంగా ఉండడం, రూపాయి క్షీణత నేపథ్యంలో ఐటీ, ఫార్మా, ఎగుమతి ఆధారిత కంపెనీలు పెట్టుబడుల కోణంలో ఆకర్షణీయమైనవిగా తెలిపారు. ఈ మేరకు ఓ