STOCKS

News


ఈఎంఐ డిఫాల్టయితే ఇంతే సంగతులు

Saturday 25th August 2018
personal-finance_main1535195228.png-19648

క్రెడిట్‌ స్కోర్‌పై భారీ నెగిటివ్‌ ప్రభావం
లోన్‌, క్రెడిట్‌ తీసుకున్న కస్టమర్లు తప్పనిసరిగా తమ నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్లను క్రమం తప్పక చెల్లించాలని క్లియర్‌స్కోర్‌ సీఈఓ జస్టిన్‌ బాసిన్‌ సూచించారు. నెలవారీ పేమెంట్స్‌(ఈఎంఐ) మిస్‌ చేస్తే క్రెడిట్‌ స్కోర్‌పై భారీగా నెగిటివ్‌ ప్రభావం ఉంటుందన్నారు. క్రెడిట్‌ యుటిలైజేషన్‌ నిష్పత్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలని ఆయన సూచించారు. వేతనం పెరగకపోయినా, ఒకదాని వెంట మరో లోన్‌ తీసుకుంటూ పోతున్నా, క్రెడిట్‌ కార్డు లిమిట్‌లో ఎక్కువ భాగాన్ని వాడేస్తున్నా క్రెడిట్‌హంగ్రీగా భావిస్తారన్నారు. అలాంటి అలవాట్లను మార్చుకోవాలన్నారు. క్రెడిట్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. అదేవిధంగా క్రెడిట్‌ ఎక్స్‌పోజర్‌లో ఒక్కసారిగా అనూహ్య పెరుగుదల ఉండకూడదన్నారు. ఒకేసమయంలో లోన్‌కోసం పలు బ్యాంకులకు దరఖాస్తు చేయడం మంచిది కాదని చెప్పారు. దీనివల్ల స్వల్పకాలంలో పలు మార్పులు క్రెడిట్‌ స్కోర్‌ ఎంక్వైరీలు వస్తాయని, ఇది క్రెడిట్‌ స్కోర్‌ను దెబ్బతీస్తుందని తెలిపారు. క్రెడిట్‌ స్కోర్‌ 850కిపైన ఉంటే అద్భుతమని, 750- 850 మధ్య ఉంటే మంచి స్కోర్‌ అని భావించాలన్నారు. 650- 750 మధ్యలో స్కోర్‌ ఉంటే ఫర్వాలేదు కానీ మెరుగుపరుచుకోవాలని చెప్పారు. భారత్‌లో 24- 44 సంవత్సరాల మధ్య ఎక్కువగా లోన్స్‌ తీసుకుంటుంటారని చెప్పారు. సాధారణంగా టూవీలర్‌, కార్‌, క్రెడిట్‌ కార్డ్‌, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ లోన్స్‌తో ఆరంభించి క్రమంగా హోమ్‌లోన్‌కు అప్‌గ్రేడ్‌ అవుతుంటారని చెప్పారు. తాము క్రెడిట్‌ స్కోర్‌ మెరుగుదల తదితర అంశాలపై కస్టమర్లకు సలహాలు అందిస్తామని చెప్పారు. 



You may be interested

స్టాక్‌ మార్కెట్‌తో రాఖీ బంధన్‌కు పోలికేంటి?

Sunday 26th August 2018

నిశితంగా పరిశీలిస్తే స్టాక్‌ మార్కెట్‌ సైతం రాఖీ పండుగలో ఉండే సెంటిమెంట్లనే ఫాలో అవుతుంది. దగ్గరగా చూస్తే స్టాక్‌ మార్కెట్లకు, రక్షా బంధన్‌కు చాలా పోలికలు కనిపిస్తాయి. నమ్మడం లేదా.. ఓకే.. వివరంగా చూద్దాం.. బంధం: సహోదర ప్రేమ రాఖీ పండుగలో కీలకాంశం. అన్నా చెల్లి అనుబంధం, ఇది తరతరాలకు సంబంధం.. లాంటి పాటలు రక్షాబంధన్‌లో సహోదరుల మధ్య బంధాన్ని గుర్తు చేసేవే! అదే స్టాక్‌మార్కెట్లో కూడా ఒక గాఢమైన బంధం

జూలైలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ కొన్న షేర్లివే..!

Saturday 25th August 2018

ముంబై:- ప్రపంచదేశాల మధ్య వాణిజ్య వివాదాలు, చమురు ధరల పెరుగుదల కారణాలతో జూలైలో స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర అస్థిరతను ఎదుర్కోంది. ఫలితంగా ఈక్విటీ మ్యూచువల్‌ పండ్స్‌లోకి నిధుల ప్రవాహం వరుసగా మూడో నెల తగ్గుముఖం పట్టింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు ఈ జూలైలో రూ.10.45 లక్షల కోట్లకు చేరినట్లు ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసర్చ్‌తెలిపింది.  జూలై నెలలో సిప్‌(ఎస్‌ఐపీ) పెట్టుబడులు రూ. 7,554 కోట్లకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీ

Most from this category