STOCKS

News


హెల్త్‌ ప్లాన్‌ తీసుకునే ముందు... ఒక్క నిమిషం

Tuesday 27th November 2018
personal-finance_main1543257208.png-22395

వైద్య బీమా ప్రాధాన్యంపై సామాన్యుల్లోనూ అవగాహన పెరుగుతోంది. ఏటేటా వైద్య బీమా ప్లాన్‌ తీసుకునే సగటు మధ్యతరగతి వాసుల సంఖ్య వృద్ధి చెందుతోంది. చిన్న అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినా బిల్లులు వేలల్లో, లక్షల్లో అవుతున్న తరుణంలో బీమా తీసుకోవడం ఆర్థికంగా ఒకింత భద్రతతో కూడిన చర్యే. అయితే, హెల్త్‌ ప్లాన్‌ తీసుకునే వారు ముఖ్యంగా గమనించాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిని బ్యాంక్‌బజార్‌ సీఈవో ఆదిల్‌ శెట్టి తెలియజేశారు. 

 

వేచి ఉండే కాలం
ప్రతీ పాలసీలోనూ ఉండే నిబంధనే ఇది. పాలసీ తీసుకున్న తర్వాత వ్యాధులకు సంబంధించి క్లెయిమ్‌ చేసుకునేందుకు 60 రోజుల వరకు వేచి ఉండాల్సి రావచ్చు. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కొన్నేళ్ల పాటు కూడా వేచి ఉండాల్సి వస్తుంది. 


 
రూమ్‌రెంట్‌
ఆస్పత్రిలో చేరితే చికిత్సలతో పాటు రూమ్‌రెంట్‌ ఖర్చులను కూడా బీమా కంపెనీ చెల్లిస్తుంది. కానీ, కొన్ని పాలసీల్లో ఈ రూమ్‌రెంట్‌ విషయంలో పరిమితులు ఉంటాయి. ఇది చాలా ముఖ్యంగా చూడాల్సిన క్లాజ్‌. బీమా సంస్థలు రోజుకు గరిష్టంగా ఎంత వరకు చెల్లించేది బీమా డాక్యుమెంట్‌లో పేర్కొంటాయి. ఇది మొత్తం ఆస్పత్రి చెల్లింపులపైనా ప్రభావం చూపిస్తుంది. ఇది ఎలా అంటే ఆస్పత్రిలో బిల్లు రూ.1.60 లక్షలు అయిందనుకోండి. రూమ్‌ రెంట్‌ ఒక రోజుకు రూ.2,000 పరిమితి ఉన్నప్పుడు.... మీరు రూ.4,000 రూమ్‌ రెంట్ ఉన్న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారనుకుందాం. అప్పుడు మొత్తం బిల్లులో సగం అంటే రూ.80వేలే కంపెనీ చెల్లిస్తుంది. మిగతా మొత్తం పాలసీదారుడే భరించాలి. 

 

ఆస్పత్రుల నెట్‌వర్క్‌
మీరు తీసుకోదలిచిన బీమా సంస్థ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల చిట్టా కూడా చూడాలి. ఎందుకంటే నగదు రహిత చికిత్స పొందాలంటే సంబంధిత ఆస్పత్రి, బీమా సంస్థ క్యాష్‌ లెస్‌ ట్రీట్‌మెంట్‌ నెట్‌వర్క్‌లో భాగంగా ఉంటేనే సాధ్యం. లేదంటే చికిత్స పొంది తర్వాత క్లెయిమ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నెట్‌వర్క్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత అనుకూలం.

 

ముందస్తు, తర్వాత
సర్జరీ చేయించుకోవాలని ప్లాన్‌ చేసుకుంటే అందుకు ముందస్తు వైద్య పరీక్షలు, డాక్టర్‌ కన్సల్టేషన్‌లు అవసరం. అలాగే, సర్జరీ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినప్పటికీ కొంత కాలం పాటు తదుపరి ఔషధాల వాడకం, డాక్టర్‌ ఫాలోఅప్‌లు, టెస్ట్‌లు చేయించుకోవాల్సి వస్తుంది. వీటన్నింటికీ కవరేజీ ఉందేమో చూసుకోవాలి. 

 

సబ్‌ లిమిట్స్‌
సబ్‌లిమిట్స్‌ ఉన్నాయేమో కూడా చూసుకోవడం ముఖ్యం. అంటే వైద్య వ్యయాల్లో పాలసీదారుడు సొంతంగా కొంత వరకు భరించడం. మిగిలినది కంపెనీ చెల్లిస్తుంది. మరి ఇందులో పాలసీదారుడి వాటా ఎంత, ఓ వ్యాధికి క్లెయిమ్‌ ఎదురైతే మీ వంతు ఎంత మేర చెల్లించాల్సి రావచ్చన్న అంచనాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.



You may be interested

ఐటీ స్టాక్స్‌ ఇప్పటికీ అనుకూలమే!

Tuesday 27th November 2018

ఈ ఏడాది ఐటీ స్టాక్స్‌ మంచి ర్యాలీ చేశాయి. కానీ, గత కొన్ని రోజులుగా మాత్రం ఇవి నష్టాలను ఎదుర్కొంటున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి విలువ డాలర్‌తో క్షీణిస్తూ వచ్చిన విషయం విదితమే. ఇది డాలర్ల మారకంలో ఆదాయాలను గడించే ఐటీ కంపెనీలకు కలిసొచ్చేది. పైగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలాన్ని పుంజుకోవడం కూడా ఐటీ కంపెనీలకు వరంగా మారింది. అందుకే ఐటీ స్టాక్స్‌ ర్యాలీ

మూడురోజుల నష్టాలకు బ్రేక్‌

Monday 26th November 2018

10,600 పైన నిఫ్టీ రాణించిన ఎఫ్‌ఎంజీసీ షేర్లు 373 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ ఎఫ్‌ఎంజీసీ, ఐటీ, ఫైనాన్స్‌ రంగ షేర్ల ర్యాలీ అండతో సూచీలు సోమవారం మూడురోజుల నష్టాలకు ముగింపు పలికాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ పతనం, డాలర్‌ మారకంలో రూపాయి 3నెలల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచమార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు కూడా సూచీల లాభాలకు తోడ్పాటును అందించాయి. మిడ్‌సెషన్‌ వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు అనంతరం స్థిరమైన ర్యాలీ చేశాయి. చివరకు

Most from this category