STOCKS

News


క్రెడిట్‌ కార్డు ఇలా వాడితే.. పరపతి పెరిగినట్టే!

Wednesday 6th February 2019
personal-finance_main1549476748.png-24054

క్లిష్ట సమయాల్లోనూ ఖర్చు చేసేందుకు ఉపయోగపడే ఆధారం క్రెడిట్‌ కార్డు. క్రెడిట్‌ కార్డుతో కొనుగోళ్లపై ఇటీవలి కాలంలో వివిధ సంస్థలు ఎక్కువ డిస్కౌంట్లు కూడా ఇస్తున్న సందర్భాలను చూస్తున్నాం. అయితే, క్రెడిట్‌ కార్డు అంటే మనసులో ఆందోళన పెట్టుకోకుండా, తమ క్రెడిట్‌ స్కోరు పెంచుకునేందుకు ఇదొక మంచి సాధనంగా చూడొచ్చు. ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ 2018 మూడో త్రైమాసికం నివేదిక ప్రకారం... బ్యంకు కార్డుల యాక్సెస్‌ పొందుతున్న వారి శాతం జీవిత కాల గరిష్ట స్థాయి 36.9 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 31.7 శాతం వృద్ధి ఉన్నట్టు సిబిల్‌ నివేదిక తెలియజేస్తోంది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా బ్యాంకులు సైతం దూకుడుగా క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే, క్రెడిట్‌ స్కోరు దెబ్బతినకుండా వినియోగించే మార్గాలను గమనిస్తే...

 

సరైన కార్డు
కో బ్రాండెడ్‌ కార్డు, షాపింగ్‌ కార్డు ఇలా... మార్కెట్లో ఎన్నో రకాల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. మీ అవరాలకు సరిపడే కార్డును ఎంచుకోవాలి. ఎక్కువ క్రెడిట్‌ కార్డులు తీసుకుని తెగ వాడేస్తే అది క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒకటి రెండు కార్డులను తీసుకుని పరిమితంగా వాడుకోవాలి.


 
క్రెడిట్‌ లిమిట్‌
కార్డు సంస్థ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలుసుకున్న తర్వాతే వినియోగ పరిమితిని నిర్ణయిస్తుంటుంది. అయితే, తిరిగి చెల్లించే విషయంలో తమ వాస్తవ సామర్థ్యానికి అనుగుణంగా తమ వైపు నుంచి పరిమితులను కార్డుదారులు విధించుకోవడం మంచిదే. వాస్తవానికి క్రెడిట్‌ కార్డు లిమిట్‌లో 30 శాతాన్ని వినియోగించుకుంటే దాన్ని ఆరోగ్యకరంగా చూస్తారు. అధికంగా వినియోగించుకుంటే క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్‌ కార్డుతో ఎటువంటి కొనుగోళ్లు చేస్తారు? అన్న స్పష్టత అవసరం. గ్యాడ్జెట్లు, గృహోపకరణాలను కొనుగోలు చేసేట్టు అయితే దీనికి బదులు కన్జ్యూమర్‌ డ్యురబుల్‌ లోన్‌ తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే క్రెడిట్‌ కార్డుపై వడ్డీ రేటు కంటే కన్జ్యూమర్‌ డ్యురబుల్‌ రుణాలపై వడ్డీ రేటు తక్కువ. దీనివల్ల క్రెడిట్‌ కార్డు లిమిట్‌ను వేరే వాటికి ఉపయోగించుకునే వీలుంటుంది. 

 

సున్నా వడ్డీ
సున్నా శాతం వడ్డీ ఆఫర్‌తో క్రెడిట్‌ కార్డులు కూడా ఉన్నాయి. పలు ఆన్‌లైన్‌ పోర్టళ్లలో ఈ కార్డులతో నోకాస్ట్‌ ఈఎంఐ కింద కొనుగోళ్లు చేసుకోవచ్చు. ముందుగా షరతులు తెలుసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే వడ్డీ భారం పడదు. దీంతో తిరిగి చెల్లింపుల సామర్థ్యం దెబ్బతినదు.

 

ప్రత్యేక ఆఫర్లు
క్రెడిట్‌ కార్డు సంస్థలు ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. వీటి సమాచారాన్ని కార్డుదారుల ఈ మెయిల్స్‌కు పంపిస్తుంటాయి. వీటిని పరిశీలించి స్మార్ట్‌గా వినియోగించుకుంటే లాభమే.

 

సకాలంలో చెల్లింపులు
క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపునకు 45 రోజుల వ్యవధి ఉంటుంది. గడువు నాటికి మొత్తం చెల్లించడం మిస్‌ కావద్దు. మొత్తం చెల్లించకుండా కనీస మొత్తానే చెల్లిస్తే మిగిలిన దానిపై వడ్డీ పడుతుంది. గడువు దాటిన తర్వాత బకాయిలపై 36 శాతం వడ్డీ అంటే రూ.3 వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. 

 

క్రెడిట్‌ రిపోర్టుపై కన్ను
ఇక క్రెడిట్‌ కార్డులున్న వారు కనీసం ఆరు నెలలకు ఓ సారి అయినా తమ క్రెడిట్‌ స్కోరును సమీక్షించుకోవడం అవసరం. సిబిల్‌ వంటి క్రెడిట్‌ బ్యూరో సంస్థలు వార్షికంగా ఓ సారి ఉచిత నివేదికను అందిస్తున్నాయి. నామమాత్రపు ఫీజుతో ఎన్ని సార్లు అయినా పొందొచ్చు.



You may be interested

ఈ ఏడాది బంగారం, వెండిలో ర్యాలీ: కార్వీ

Wednesday 6th February 2019

ఈ ఏడాది బంగారం, వెండి ర్యాలీ చేస్తాయని కార్వీ గ్రూపులో భాగమైన కార్వీ కన్సల్టెంట్స్‌ అంచనా వేసింది. ఇన్వె‍స్టర్లు తమ పెట్టుబడి నిర్ణయాలపై అవగాహన కల్పించేందుకు ఈ సంస్థ తన 11వ వార్షిక కమోడిటీ అండ్‌ కరెన్సీ రిపోర్ట్‌ 2019ను విడుదల చేసింది. 2017లో బేస్‌ మెటల్స్‌ మంచి ర్యాలీ చేయగా, 2018లో మాత్రం ఈ ట్రెండ్‌ కొనసాగని విషయం తెలిసిందే. దేశీయ రూపాయి విలువ క్షీణించడం మరింత సమస్యాత్మకంగా

ఆల్‌టైం హైకి టెక్‌ మహీంద్రా

Wednesday 6th February 2019

ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా షేర్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ వెల్లడించిన క్యూ3 ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకున్నాయి. ఫలితంగా నేడు ఎన్‌ఎస్‌ఈలో షేరు గత ముగింపు(రూ.751.00)తో పోలిస్తే 4.50శాతం లాభంతో రూ.784.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు మార్కెట్‌లో ఐటీ షేర్ల కొనుగోళ్ల సెంటిమెంట్‌ కారణంగా షేరు మరింత ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో 8.50శాతం లాభపడి రూ.814.50ల వద్ద

Most from this category