STOCKS

News


‘హెల్త్‌కోచ్‌’కు ఓకే చెబితే... ప్రీమియం తగ్గిస్తాం!

Friday 29th June 2018
personal-finance_main1530213185.png-17848

మారిన జీవన పరిస్థితులతో నేడు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. చిన్న వయసు నుంచే వైద్య బిల్లుల మోత మోగుతోంది. ఈ పరిస్థితులతో ప్రతీ కుటుంబానికి ఓ ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్‌ పాలసీ ఉండడం ఎంతో అవసరమవుతోంది. ఒంటరి వారికి ఇండివిడ్యువల్‌ హెల్త్‌ పాలసీలు ఉన్నాయి. హెల్త్‌ పాలసీల ప్రీమియం ఏటా పెరుగుతుందని తెలిసిందే. మరి ఈ భారం తగ్గించుకోవాలంటే ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుకోవడమే. అందుకు బీమా సంస్థలు అందిస్తున్న ఆఫర్‌ ‘హెల్త్‌ కోచ్‌’.

 

మ్యాక్స్‌బూపా గో యాక్టివ్‌ ప్లాన్‌, టీటీకే ప్రోయాక్టివ్‌ హెల్త్‌ పాలసీలు ఈ ఆప్షన్‌ అందిస్తు‍న్నాయి. హెల్త్‌ కోచ్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే ఎటువంటి అదనపు వ్యయం ఉండదని మ్యాక్స్‌ బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ ఆశిష్‌ మెహ్రోత్రా తెలిపారు. పాలసీ తీసుకునే వారు వెల్‌నెన్‌ బెనిఫిట్స్‌తో ఉన్న వాటిని ఎంచుకోవాలని ఆయన సూచించారు. వ్యక్తిగత హెల్త్‌కోచ్‌ ఆప్షన్‌ను వినియోగదారులను ఆరోగ్యంగా ఉంచే కోణంలో  శాస్త్రీయంగా డిజైన్‌ చేసినట్టు చెప్పారు. తరచుగా సంప్రదింపుల ద్వారా వారిని ఆరోగ్యంగా ఉండేలా ఇది చూస్తుందని, ఆరోగ్య లక్ష్యాలను చేరుకున్న వారికి ప్రీమియంలో తగ్గింపును ఆఫర్‌ చేస్తున్నట్టు చెప్పారు. 

 

హెల్త్‌కోచ్‌ ఆప్షన్‌ అంటే?
హెల్త్‌కోచ్‌ ఆప్షన్‌ యాప్‌ రూపంలో ఉంటుంది. ఈ యాప్‌లో పోషకాహార నిపుణులు, వ్యక్తిగత శిక్షకులు, వివిధ రకాల వైద్య నిపుణులు ఉంటారు. బరువు నియంత్రణ, శారీరక సామర్థ్యం, యోగా, ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలు, అనారోగ్యం వస్తే బయటపడే సూచనలు ఇవన్నీ యాప్‌ ద్వారా అందజేయడం జరుగుతుంది. ఇందులో పాలసీదారులకు ఆరోగ్యానికి సంబంధించి లక్ష్యాలను విధిస్తుంటారు. వీటి ద్వారా ఆరోగ్యంగా, ఫిట్‌గా జీవించేందుకు హెల్త్‌ కోచ్‌ సాయపడుతుంది. అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యులు దగ్గరకు వెళితే పరిష్కారం సూచిస్తారు. కానీ, హెల్త్‌ కోచ్‌ అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించడం ఎలాగన్న విషయమై పాలసీదారులకు మార్గదర్శనం చేస్తుంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కస్టమర్లకు వారంలో అన్ని రోజులు, రోజులో 24 గంటల పాటు హెల్త్‌ కోచ్‌ సేవల్ని ఆఫర్‌ చేస్తున్నాయి. తమ ఆరోగ్య పరిస్థితిపై మొదటి రోజు నుంచే వారికి అవగాహన కల్పించడం, లక్ష్యాలు విధించి అందుకు అనుగుణంగా నడిచేలా చేయడమే హెల్త్‌కోచ్‌ బాధ్యత. ‘‘కంపెనీలు తమ సొంతంగా హెల్త్‌కోచ్‌ యాప్‌లను రూపొందించుకుంటున్నాయి. రోజువారీగా ఎన్ని అడుగులు నడిచారు, ఏ ఆహరం ఎంత మేర తీసుకున్నారు, ఎన్ని గంటలు నిద్రపోయారు తదితర డేటా తీసుకోవడం జరుగుతుంది. ఈ సమాచారం ఆధారంగా హెల్త్‌కోచ్‌ ప్రతీ కస్టమర్‌కు వ్యక్తిగత శిక్షణ ఆఫర్‌ చేయడంతోపాటు ఆ విధంగా జీవించేందుకు సాయపడుతుంది’’ అని మెహ్రోత్రా వివరించారు.
 



You may be interested

ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి నామినీని మర్చిపోతే కష్టాలే!

Friday 29th June 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల అవగాహన పెరుగుతోంది. అయితే, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారిలో ఎక్కువ మంది నామినీ కాలమ్‌ను పట్టించుకోవడం లేదు. ఎవరి పేరునూ నామినీగా పేర్కొనకుండా ఖాళీగా విడిచిపెట్టేస్తున్నారు. కానీ, అనుకోని పరిస్థితుల్లో ఇది సమస్యలకు దారితీస్తుందని, నామినీని తప్పకుండా పేర్కొనాలని వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ సూచిస్తోంది.   ఎంతగానో ప్రేమించే వారి భవిష్యత్తు అవసరాల కోసమే ఇన్వె‍స్ట్‌ చేస్తుంటారు. మరి మీకు ఏదైనా జరిగితే అవి మీ ఆత్మీయులకు

1947... ఒక రూపాయి కథ!

Thursday 28th June 2018

 మనకు స్వాతంత్య్రం.. రూపాయికి బానిసత్వం...  అప్పట్లో ఒక డాలరుకు సమానంగా ఒక రూపాయి!  ఇప్పుడు ఏకంగా 69 రెట్లు పతనం...  చరిత్రలో కనీవినీ ఎరుగని కనిష్ఠం రూ.69ని తాకిన తీరు  భవిష్యత్తుపై ఆందోళన రేకెత్తిస్తున్న అంతర్జాతీయ అంశాలు బ్రిటిష్‌ వలసపాలన నుంచి స్వేచ్ఛ లభించి 71 ఏళ్లయింది. కొద్ది రోజుల్లో 72వ స్వాతంత్య్ర దినోత్సవం కూడా వచ్చేస్తోంది. అయితే ఏంటంటారా!! డాలరుతో మన దేశ కరెన్సీ మారకం విలువ 72 దిశగా జారిపోతుండటం!! అసలు భారతీయులు సేచ్ఛా

Most from this category