STOCKS

News


వాట్సప్‌ ద్వారా క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌

Monday 24th September 2018
personal-finance_main1537786086.png-20531

ఔను.. మీరు చదివింది నిజమే. ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ ద్వారా ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేయవచ్చు. ప్రైవేట్‌ రంగ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ‘భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌’ తాజాగా ఇటువంటి సేవలను ప్రారంభించింది. దేశీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పరిశ్రమలో ఈ తరహా సేవలను ప్రారంభించిన తొలి సంస్థగా భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నిలిచింది.
క్లెయిమ్‌ ప్రాసెస్‌ ఇలా..
ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు నామినీ తన వాట్సప్‌ ద్వారా భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు టెక్ట్స్‌ మేసేజ్‌ పంపించాలి. సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక బృందం నామినీ మెసేజ్‌కు వెంటనే సమాధానమిస్తుంది. ఇందులో వారు ఒక లింక్‌ పంపుతారు. తర్వాత నామినీ ఈ లింక్‌ను ఓపెన్‌ చేసి క్లెయిమ్‌ డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి. అప్పుడు కంపెనీ క్లెయిమ్‌కు సంబంధించిన తన నిర్ణయాన్ని నామినీకి తెలియజేస్తుంది. అన్నీ సవ్యంగా జరిగితే క్లెయిమ్‌ను నామినీ బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్‌ఫర్‌ చేస్తుంది. పాలసీదారులు క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ కోసం సంస్థ బ్రాంచ్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు

Tuesday 25th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:41 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 11 పాయింట్ల నష్టంతో 10,981 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,997 పాయింట్లతో పోలిస్తే 16 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ మంగళవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఒక్క చైనా మినహా మిగతా ఆసియా ప్రధాన

ఐదో రోజూ ఆగని పతనం

Monday 24th September 2018

11వేల దిగువకు నిఫ్టీ 536 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ ముంబై:- మార్కెట్‌ పతనం ఆగట్లేదు. వరసగా 5రోజూ నష్టాల్లోనే ముగిసింది. అమెరికా - చైనా దేశాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల, డాలర మారకంలో రూపాయి విలువ బలహీనపడటం, దేశీయ మార్కెట్‌లో ఎన్‌బీఎఫ్‌సీ డెట్‌ సంక్షోభం, స్టాక్‌ మార్కెట్‌ నుంచి వెనక్కి తరలిపోతున్న ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఇందుకు కారణయ్యాయి. కారణాల నేపథ్యంలో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌

Most from this category