STOCKS

News


జీవిత బీమా పాలసీల్లో వృద్ధి

Thursday 13th September 2018
personal-finance_main1536824344.png-20229

న్యూఢిల్లీ: నూతన జీవిత బీమా పాలసీ ప్రీమియం వసూళ్లు ఆగస్టులో 6.43 శాతం పెరిగి రూ.18,639.29 కోట్లుగా నమోదైనట్లు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. గతేడాది ఇదే కాలానికి రూ.17,513.59 కోట్ల నూతన ప్రీమియం వసూళ్లు నమోదయ్యాయి. దేశీయంగా ఉన్న 24 జీవిత బీమా సంస్థలలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ నూతన పాలసీ ప్రీమియం వసూళ్లు 1.94 శాతం తగ్గుదలను నమోదుచేయగా, మిగిలిన 23 ప్రైవేటు సంస్థలు సగటున 33.55 శాతం వృద్ధిరేటను సాధించాయి. ప్రైవేటు బీమ సంస్థల నూతన పాలసీ వసూళ్లు రూ.5,517.17 కోట్లు కాగా, అంతకుముందు ఏడాది ఆగస్టులో రూ.4,131.29 కోట్లుగా నిలిచాయి. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నూతన ప్రీమియం వసూళ్లు అత్యధికంగా 104 శాతం, బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ 92.43 శాతం, ఇండియా ఫస్ట్‌ 54 శాతం పెరిగాయి. ఎస్‌బీఐ లైఫ్‌ ప్రీమియం 38.45 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ 37.75 శాతం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ 19.63 శాతం వృద్ధి చెందాయి.



You may be interested

రూపాయి రికవరీ..

Thursday 13th September 2018

ముంబై: ప్రతి రోజూ కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతున్న రూపాయి బుధవారం కొంత కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ మారకం విలువ 51 పైసలు బలపడి 72.18 వద్ద ముగిసింది. రూపాయి మరీ అసంబద్ధ స్థాయికి పడిపోకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ భరోసా కల్పించడం దీనికి తోడ్పడింది. మొదట్లో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం కూడా 72.91 స్థాయికి పడిపోయి కొత్త కనిష్టాన్ని నమోదు

చందా కొచర్‌పై చర్యలు తీసుకోవాలి

Thursday 13th September 2018

వదోదర: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల వ్యవహారంలో ఆరోపణల నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ఐసీఐసీఐ బ్యాంక్ 24వ వార్షిక సర్వసభ్య సమావేశం వాడి,వేడిగా జరిగింది. అవకతవకలకు పాల్పడ్డారంటూ సీఈవో చందా కొచర్‌పై వచ్చిన ఆరోపణల మీద స్పష్టతనివ్వాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలని షేర్‌హోల్డర్లు డిమాండ్ చేశారు. బ్యాంక్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలు, ప్రమాణాలపై కొందరు షేర్‌హోల్డర్లు ప్రశ్నలు లేవనెత్తారు. ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చందా కొచర్‌ ఈ సమావేశానికి హాజరు

Most from this category